కాశీ పండితులతో సరస్వతి నవరత్నమాల హారతి- ప్రతి సాయంత్రం ప్రత్యక్షప్రసారం

Best Web Hosting Provider In India 2024

కాశీ పండితులతో సరస్వతి నవరత్నమాల హారతి- ప్రతి సాయంత్రం ప్రత్యక్షప్రసారం

Bandaru Satyaprasad HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Bandaru Satyaprasad HT Telugu

కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాల్లో ప్రతీ సాయంత్రం…సరస్వతి నవరత్నమాల హారతి నిర్వహిస్తున్నారు. హారతి ఘట్టాన్ని లైవ్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించింది. ఈ మేరకు నేటి నుంచి హారతి ఘటాన్ని లైవ్ ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు.

కాశీ పండితులతో సరస్వతి నవరత్నమాల హారతి- ప్రతి సాయంత్రం ప్రత్యక్షప్రసారం

భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాల్లో ప్రత్యేక ఆకర్షణగా ఉన్న సరస్వతి నవరత్నమాల హారతి ఘట్టాన్ని ప్రతీ రోజూ ప్రత్యక్ష ప్రసారం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం ఆదేశాల మేరకు నేటి నుంచి హారతి కార్యక్రమాన్ని లైవ్ కవరేజీ చేశారు.

కాశీ పండితులతో ప్రత్యేక హారతి

ప్రతీ రోజు సాయంత్రం నిర్వహించే సరస్వతి హారతిని ఇవ్వడానికి, కాశీలో అత్యంత ప్రజాదరణ పొందిన గంగా హారతినిచ్చే పండితులను ప్రత్యేకంగా ప్రభుత్వం పిలిపించింది. దాదాపు అరగంట పాటు సాగే సరస్వతి నవరత్నమాల హారతిలో తొమ్మిది ప్రత్యేక హారతులను ఇస్తారు.

సరస్వతి నవరత్నమాల స్తోత్రంతో తొమ్మిది హారతులు

  1. ఓంకార హారతి-సర్వ దోష నివారిణి
  2. నాగ హారతి – సర్పదోషాన్ని పోగొట్టి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది
  3. పంచ హారతి – దీర్ఘాయుష్షుకు
  4. సూర్య హారతి రోగాలను మాపి ఆరోగ్యాన్ని ఇస్తుంది.
  5. చంద్ర హారతి – పాడి పంటలను, మనః శాంతినిస్తుంది.
  6. నంది హారతి – ధర్మ బుద్ధిని, శక్తిని, విద్య బుద్ధినిస్తుంది.
  7. సింహ హారతి- నాయకత్వాన్ని ధైర్యాన్నిస్తుంది.
  8. కుంభ హారతి -సంపదను ఇచ్చి, కోటి సుఖాలను అందిస్తుంది.
  9. నక్షత్ర హారతి – నిర్మలమైన మనస్సును, కీర్తిని అందిస్తుంది.

సరస్వతి నవరత్న మాలా హారతి మహోత్సవం 6వ రోజు అత్యంత ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సరస్వతి అమ్మవారి హారతిని వీక్షించి దివ్యదర్శనం పొందారు.

లక్షలాది మంది పుష్కర స్నానాలు

సరస్వతి అమ్మవారికి రాష్ట్ర ప్రజల శాంతి, సౌభాగ్యం, అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఇలాంటి ఆధ్యాత్మిక హారతి, ధార్మిక ఉత్సవాలు సమాజంలో సానుకూల చైతన్యాన్ని కలిగిస్తాయని అన్నారు.

నేటితో సరస్వతి పుష్కరాలు ప్రారభమై ఆరు రోజులు అయ్యిందని, ప్రతి రోజు లక్షలాది మంది పుష్కర స్నానాలు ఆచరించి కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకున్నారని తెలిపారు.

రానున్న ఆరు రోజులు కీలకం

గత 6 రోజులుగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరేలు పుష్కరాల ఏర్పాట్లు పర్యవేక్షణ చేస్తూ భక్తులకు సౌకర్యాలు కల్పనపై ప్రత్యేక ఫోకస్ చేస్తున్నారని ఏర్పాట్లు పట్ల హర్షం వ్యక్తం చేశారు. రానున్న 6 రోజులు చాలా ముఖ్యమని భక్తులు రద్దీ పెరిగే అవకాశం ఉందని ఎలాంటి లోటుపాట్లు రానీయొద్దని సూచించారు.

Bandaru Satyaprasad

TwittereMail
బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

టాపిక్

Telangana NewsTrending TelanganaTelugu NewsCm Revanth Reddy
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024