





Best Web Hosting Provider In India 2024

రెండు ఓటీటీల్లోకి వస్తున్న తమిళ రివేంజ్ థ్రిల్లర్ సినిమా.. స్ట్రీమింగ్ వివరాలివే
వల్లమై సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. రెండు ప్లాట్‍ఫామ్‍ల్లో అడుగుపెట్టనుంది. స్ట్రీమింగ్ డేట్ అధికారికంగా ఖరారైంది. ఈ సినిమాను ఎక్కడ చూడొచ్చంటే..
తమిళ నటుడు పేమ్‍గి అమరన్ ప్రధాన పాత్ర పోషించిన వల్లమై సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 25వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఈ థ్రిల్లర్ చిత్రానికి కరుప్పయా మురుగన్ దర్శకత్వం వహించారు. థియేట్రికల్ రన్‍లో నెగెటివ్ టాక్ దక్కించుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ఈ వల్లమై (Vallamai) సినిమా ఇప్పుడు రెండు ఓటీటీల్లోకి రానుంది.
స్ట్రీమింగ్ ఎక్కడంటే..
వల్లమై సినిమా మే 23వ తేదీన ఆహా తమిళ్, టెంట్‍కొట్ట ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ చిత్రం స్ట్రీమింగ్‍పై ఆహా తమిళ్ నేడు (మే 20) అధికారికంగా ప్రకటించింది. “జీవితాలు పూర్తిగా మారిపోయాయి. మే 23న వల్లమై చిత్రం ఆహా తమిళ్‍లో ప్రీమియర్ అవుతుంది” అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఆహా తమిళ్.
రివేంజ్ థ్రిల్లర్‌లా..
వల్లమై సినిమాను రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రంగా డైరెక్టర్ మురుగన్ తెరకెక్కించారు. కూతురిపై అఘాయిత్యం చేసిన వారిపై తండ్రి పగ తీర్చుకునేందుకు పోరాడడం చుట్టూ ఈ మూవీ ఉంటుంది. అయితే, స్క్రీన్‍ప్లే సరిగా లేకపోవడం, నరేషన్ గ్రిప్పింగ్‍గా లేవనే టాక్ వచ్చింది. దీంతో ఈ చిత్రానికి థియేట్రికల్ రన్ పెద్దగా సాగలేదు. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయింది.
వల్లమై మూవీలో ప్రేమ్‍గి అమరన్ కూతురు పాత్రలో దివ్యదర్శిని నచించారు. దీప శంకర్, సీఆర్ రంజిత్ కూడా కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీని డైరెక్టర్ మురుగనే నిర్మించారు. జీకేవీ సంగీతం అందించారు.
వల్లమై స్టోరీలైన్
వినికిడి లోపం ఉన్న శరవణన్ (ప్రేమ్‍గి) తన కూతురు భూమిక (దివ్యదర్శిని)తో కలిసి చెన్నై వెళతాడు. రాత్రివేళ పోస్టర్లు అంటించే పనికి శవరణన్ వెళుతుంటాడు. ఓ రోజు అనుకోని ఘటన జరుగుతుంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న భూమిక లైంగిక దాడికి గురవుతుంది. తన కూతురిపై అఘాయిత్యం చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని శరవణన్ అనుకుంటాడు. భూమికపై లైంగిక దాడి చేసింది ఎవరు? వారిని శరవణన్ ఎలా కనుగొన్నాడు? ప్రతీకారం తీర్చుకున్నాడా? ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయనేది వల్లమై సినిమాలో ఉంటాయి. మే 23 నుంచి ఆహా తమిళ్, టెంట్‍కొట్ట ఓటీటీల్లో ఈ చిత్రాన్ని చూడొచ్చు.
కాగా, అస్త్రం సినిమా ఇటీవలే ఆహా తమిళ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి వచ్చింది. ఈ తమిళ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో శ్యామ్ ప్రధాన పాత్ర పోషించారు. మార్చిలో థియేటర్లలో రిలీజైన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఈ సినిమాకు అరవింద్ రాజగోపాల్ దర్శకత్వం వహించారు.
సంబంధిత కథనం