





Best Web Hosting Provider In India 2024

మణిరత్నంపై నెటిజన్ల విమర్శలు.. త్రిష పాటకు ఇలాంటి పేరా అంటూ ఫైర్
థగ్‍లైఫ్ సినిమా నుంచి రెండో పాట రానుందంటూ మేకర్స్ రీసెంట్‍గా అనౌన్స్ చేశారు. త్రిష ఈ పాటలో ఉండనున్నారు. అయితే, ఈ సాంగ్ పేరు గురించి డైరెక్టర్ మణిరత్నంపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.
స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా నటించిన ‘థగ్‍లైఫ్’ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ గ్యాంగ్‍స్టర్ యాక్షన్ మూవీ జూన్ 5వ తేదీన విడుదల కానుంది. నాయగన్ చిత్రం తర్వాత కమల్, మణి కాంబినేషన్ సుమారు 38ఏళ్ల అనంతరం రిపీట్ అవడంతో ఈ చిత్రంపై హైప్ విపరీతంగా ఉంది. ఇటీవలే వచ్చిన థగ్‍లైఫ్ ట్రైలర్ ఆకట్టుకుంది. ఈ సినిమా నుంచి రెండో పాట రిలీజ్ గురించి మూవీ టీమ్ అప్‍డేట్ ఇచ్చింది. దీని తర్వాత మణిరత్నంపై కొందరు నెటిజన్లు ఆగ్రహిస్తున్నారు.
పాట పేరుపై విమర్శలు
థగ్ లైఫ్ సినిమా నుంచి ‘షుగర్ బేబీ’ పేరుతో రెండో పాట రానుంది. మే 21వ తేదీన ఈ పాటను తీసుకొస్తామని మేకర్స్ ప్రకటించారు. త్రిషపై డబ్బు నోట్ల వర్షం కురుస్తున్నట్టుగా ఉన్న పోస్టర్‌తో ఈ పాటను టీమ్ అనౌన్స్ చేసింది.
ఈ పాటకు షుగర్ బేబీ అనే పేరు ఉండడంతో డైరెక్టర్ మణిరత్నంపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. మణిరత్నం సినిమాలో ఈ పదాలతో పాటనా అంటూ కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 42 ఏళ్ల త్రిష ఉన్న పాట.. ‘షుగర్ బేబీ’ అంటూ ఉండడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.
‘ఇది మణిరత్నం సినిమానేనా?’
త్రిష ఉన్న పాట షుగర్ బేబీ అంటూ ఉండటంతో నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. షుగర్ మమ్మీ అని ఉండాల్సిందని కొందరు ఫన్నీగా రాసుకొస్తున్నారు. మరికొందరు సీరియస్‍గా స్పందిస్తున్నారు. ఇదేమైనా ఐటెమ్ సాంగా.. మణిరత్నంకు ఏమైంది అని ఓ యూజర్ రాసుకొచ్చారు. థగ్ లైఫ్ అసలు మణిరత్నం సినిమానేనా” అంటూ ఓ యూజర్ కామెంట్ చేశారు. ఫస్ట్ పాటకు కూడా సింగుచా అని ఎందుకు పెట్టారో అర్థం కాలేదని, మళ్లీ ఇప్పుడు షుగర్ బ్యూటీ ఏంటి అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు.
రీసెంట్‍గా లిప్‍లాక్ గురించి..
థగ్ లైఫ్ ట్రైలర్‌లో 70ఏళ్ల కమల్ హాసన్.. 42 ఏళ్ల అభిరామికి లిప్‍లాక్ సీన్ ఉండడంతో విమర్శలు వచ్చాయి. త్రిషతోనూ రొమాంటిక్ సీన్ ఉంది. దీంతో ఇంత వయసులో ఇద్దరు హీరోయిన్లుగా రొమాటింగ్ సీన్లు పెట్టడం అవసరమా అంటూ మణిరత్నంను కొందరు నెటిజన్లు ప్రశ్నించారు. ఇప్పుడు రెండో పాట పేరుపై కూడా అభ్యంతరాలు వస్తున్నాయి. మరి ఈ పాట రేపు (మే 21) వచ్చాక ఎలా ఉంటుందో చూడాలి.
థగ్ లైఫ్ సినిమాలో కమల్ హాసన్ కొడుకు పాత్ర పోషించారు హీరో శింబు. తండ్రీకొడుకుల మధ్య పోరాటం కథాంశంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ మూవీలో త్రిష, అభిరామి, ఐశ్వర్య లక్ష్మి, జోజూ జార్జ్, నాజర్, పంకజ్ త్రిపాఠి, అశోక్ సెల్వన్, సాన్య మల్హోత్రా, సంజనా కృష్ణమూర్తి కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీకి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రహమాన్ సంగీతం అందించారు. రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫీ చేశారు. జూన్ 5న తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.
సంబంధిత కథనం