





Best Web Hosting Provider In India 2024

అలియా భట్ చేసే పప్పీ యోగాతో అందమైన శరీరం, ఇది ఎలా చేయాలంటే
పప్పీ యోగా భంగిమ సెలెబ్రిటీ ఆసనం. ఈ యోగాభ్యాసంలో స్ట్రెచింగ్ ఉంటుంది. అలాగే వెన్ను, దిగువ శరీరంలో నొప్పులను ఇది తగ్గిస్తుంది. బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ ప్రతిరోజూ పప్పీయోగా వేస్తుంది.
శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతో మంది యోగాను అభ్యసిస్తున్నారు. సెలెబ్రిటీలు వేసే యోగాసనాల్లో పప్పీ యోగా ఒకటి. సెలెబ్రిటీ ఫిట్నెస్ కోచ్ అన్షుకా… అలియా పప్పీ యోగా చేస్తున్న వీడియోను షేర్ చేశారు. పప్పీ యోగా ఉత్తమ భంగిమ అని చెప్పుకోవచ్చు. ఆలియా ఒక చక్రం సహాయంతో ఈ యోగాను వేస్తుంది.
పప్పీ యోగాసనం
పప్పీ యోగాసనం శరీరానికి, మనస్సుకు వివిధ రకాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది. గంటల తరబడి ఒకే చోట నిలబడి పనిచేసే వారికి ఈ యోగాసనం ఒక వరం లాంటిది. ఈ యోగాసనం చేయడం వల్ల శరీరంలోని కింది భాగంపై ఒత్తిడి పడతాయి. నరాలు సాగదీసినట్టు అవుతాయి. తద్వారా నడుము, శరీర దిగువ భాగాల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
పప్పీ యోగా మనస్సును శాంతపరుస్తుంది. ఒత్తిడి, ఆందోళన నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఈ కారణంగా దీనిని మెల్టింగ్ హార్ట్ పోజ్ అని కూడా పిలుస్తారు.
కుక్కపిల్ల యోగా చేయడం వల్ల భుజాల నుంచి పిరుదుల వరకు కండరాలు సాగదీసినట్టు అవుతాయి. దీని వల్ల శరీరం పూర్తిగా రిలాక్స్ అవుతుంది. భుజానికి సంబంధించిన నొప్పి సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది.
పప్పీ యోగా శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరచడం ద్వారా శరీరంలో ఫ్లెక్సిబిలిటీని తెస్తుంది. నడుము, వీపు, కాళ్ల కింది భాగంలో నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
పప్పీ యోగా ఎలా చేయాలంటే
ముందుగా వజ్రాసన భంగిమలో నేలపై కూర్చొని లోతైన శ్వాస తీసుకోవాలి. రెండు చేతులను పైకి లేపాలి. ఇప్పుడు నెమ్మదిగా శ్వాస తీసుకోండి. మీ శరీరాన్ని ముందుకు వంచండి. ఇప్పుడు మీ రెండు చేతులను నేలపై ఉంచేటప్పుడు మీ దిగువ వీపును పైకి ఎత్తడానికి ప్రయత్నించండి. ఇలా చేసేటప్పుడు, మీ కాళ్ళు నిటారుగా, వీపు పైకి ఉండాలని గుర్తుంచుకోండి. ఈ భంగిమలో 2 నిమిషాలు ఉండి, తరువాత సాధారణ స్థితిలో కూర్చోండి.
టాపిక్