భైరవం సినిమాకు ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్.. శాటిలైట్ రైట్స్ కూడా.. ఎన్ని కోట్లంటే!

Best Web Hosting Provider In India 2024

భైరవం సినిమాకు ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్.. శాటిలైట్ రైట్స్ కూడా.. ఎన్ని కోట్లంటే!

భైరవం సినిమాకు ఓటీటీ, శాటిలైట్ రైట్స్ డీల్ జరిగింది. ఏ ఓటీటీ హక్కులు తీసుకుందో సమాచారం బయటికి వచ్చేసింది. ఈ చిత్రం నాన్ థియేట్రికల్ హక్కులకు మంచి ధర దక్కింది.

తెలుగు మల్టీస్టారర్ యాక్షన్ మూవీకి ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్.. శాటిలైట్ రైట్స్ కూడా.. ఎన్ని కోట్లంటే!

ట్రైలర్ వచ్చిన తర్వాత ‘భైరవం’ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ మల్టీస్టారర్ యాక్షన్ చిత్రానికి మంచి క్రేజ్ వచ్చింది. ఈ చిత్రం మే 30వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ మూవీకి హైప్ రావడంతో నాన్ థియేట్రికల్ హక్కులను మంచి డీల్ జరిగింది. ఓటీటీ, శాటిలైట్ హక్కుల వివరాలు బయటికి వచ్చాయి.

స్ట్రీమింగ్, టెలికాస్ట్ హక్కుల వివరాలు

భైరవం సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకుంది. థియేట్రికల్ రన్ తర్వాత జీ5లోనే ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు అడుగుపెడుతుంది. ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌ను జీ తెలుగు టీవీ ఛానెల్ దక్కించుకుంది. మొత్తంగా ఈ మూవీ నాన్ థియేట్రికల్ హక్కులను జీ సంస్థ సొంతం చేసుకుంది.

మంచి ధరకు డీల్

భైరవం సినిమా డిజిటల్ స్ట్రీమింగ్, శాటిలైట్ హక్కులు కలిపి సుమారు రూ.32కోట్లకు జీ సంస్థ దక్కించుకున్నట్టు సమాచారం బయటికి వచ్చింది. మంచి ధరకు ఈ చిత్రం నాన్ థియేట్రికల్ హక్కులను అమ్ముడయ్యాయి. ట్రైలర్ అంచనాలను పెంచటంతో రేట్ బాగా వచ్చింది.

యాక్షన్‍తో అదిరిన ట్రైలర్

భైరవం సినిమాకు విజయ్ కనడమేడల దర్శకత్వం వహించారు. వారాహి అమ్మవారి దేవాలయం భూములను దేవాదాయ శాఖ మంత్రి దోచేయాలని చూస్తే.. ఆ కుట్రను అడ్డుకోవడం కోసం ముగ్గురు పోరాడడం చుట్టూ మూవీ స్టోరీ సాగుతుందని ట్రైలర్ ద్వారా అర్థమైంది. మంచు మనోజ్, శ్రీనివాస్, నారా రోహిత్ యాక్షన్ ట్రైలర్లో అదిరిపోయింది. ఇంటెన్స్ స్టోరీతో సూపర్ యాక్షన్ సీక్వెన్సులు ఉంటాయని తెలిసిపోయింది.

‘కాంతారకు మించిన వైబ్ ఇస్తుంది’

తమిళ మూవీ గరుడన్ ఆధారంగా భైరవం చిత్రం తెరకెక్కింది. అయితే, ఆ స్టోరీలోని సోల్‍ను మాత్రమే ఈ మూవీలో చాలా మార్పులు చేసినట్టు బెల్లంకొండ శ్రీనివాస్ తెలిపారు. ఈ చిత్రం ప్రమోషన్లను మూవీ టీమ్ జోరుగా చేస్తోంది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కూడా గ్రాండ్‍గా జరిపింది. వరుసగా ఇంటర్వూలు ఇస్తున్నారు శ్రీనివాస్. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. రిషబ్ శెట్టి కన్నడ ఐకానిక్ మూవీ ‘కాంతార’ను మించిన వైబ్‍ను ప్రేక్షకులకు భైరవం ఇస్తుందని చెప్పారు.

భైరవం సినిమాలో డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ కూడా ఓ కీరోల్ చేశారు. ఆనంది, దివ్య పిళ్లై, అజయ్, జయసుధ కీలకపాత్రలు పోషించారు. శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్ సమర్పిస్తోంది. శ్రీచరణ్ పాకాల ఈ మూవీకి సంగీతం అందించారు.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024