





Best Web Hosting Provider In India 2024

తెలుగులో రిలీజైన మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ – ఫ్రీగా స్ట్రీమింగ్ – బొద్దింకలు తినే అమ్మాయి కథ
మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ కూర తెలుగులో ఓ స్త్రీ పేరుతో డబ్ అయ్యింది. థియేటర్, ఓటీటీలలో కాకుండా నేరుగా యూట్యూబ్‌లో రిలీజైన ఈ మూవీ ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. ఓ స్త్రీ మూవీలో కీర్తి ఆనంద్, వర్ధిక్ హీరోహీరోయిన్లుగా నటించారు.
మలయాళం హారర్ మూవీ కూర తెలుగులోకి డబ్ అయ్యింది. ఓ స్త్రీ పేరుతో ఈ మూవీ రిలీజైంది. థియేటర్, ఓటీటీలలో కాకుండా నేరుగా యూట్యూబ్‌లో విడుదలైన ఈ మూవీ ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. ఎలాంటి రెంటల్ ఛార్జీలు లేకుండా ఓ స్త్రీ మూవీని యూట్యూబ్‌లో ఉచితంగా చూడొచ్చు.
కీర్తి ఆనంద్ హీరోయిన్…
ఓ స్త్రీ మూవీలో కీర్తి ఆనంద్, వర్ధిక్ హీరోహీరోయిన్లుగా నటించారు. సందేశ్ సత్యన్, అపర్ణ మీనన్ , శోభీంద్రన్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు వైశాగ్ జోజన్ దర్శకత్వం వహించాడు. 2021లో మలయాళంలో రిలీజైన ఈ మూవీ ద్వారా హీరోహీరోయిన్లతో పాటు 30 మంది నటీనటులు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.
షాకింగ్ క్లైమాక్స్…
రెగ్యులర్ హారర్ థ్రిల్లర్ సినిమాలకు భిన్నమైన కాన్సెప్ట్‌తో దర్శకుడు ఈ మూవీని తెరకెక్కించాడు. ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ షాకింగ్‌గా ఉంటుంది. మలయాళం వెర్షన్ కూర ఐఎమ్‌డీబీలో 6.1 రేటింగ్‌ను సొంతం చేసుకున్నది.
లేడీ సైకో కిల్లర్ కథ…
వరప్రసాద్ గొప్ప మ్యూజిక్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకోవాలని కలలు కంటుంటాడు. ఓ వైపు చదువుకుంటూనే మ్యూజిక్‌పై ఫోకస్ పెడతాడు. ఓ రోజు లైబ్రరీలో జెన్సీ అనే అమ్మాయి బొద్దింక తినడం వరప్రసాద్ చూస్తాడు. జెన్సీ ప్రవర్తన అతడికి విచిత్రంగా అనిపిస్తుంది. కొద్ది పరిచయంలోనే జెన్సీతో ప్రేమలో పడతాడు వరప్రసాద్. ఆమెకు ఐ లవ్ యూ చెబుతాడు.
కానీ జెన్సీ మాత్రం అతడి ప్రేమను యాక్సెప్ట్ చేయదు. తాను ఓ ఫుట్‌బాల్ ఛాంపియన్ అని, రాబర్ట్ అనే ప్రొఫెసర్ తనను లైంగికంగా వేధించాడని, అతడి కారణంగానే చేయని తప్పుకు తాను నన్ స్కూల్‌లో చేరాల్సివచ్చిందని తన గతం గురించి వరప్రసాద్‌కు చెబుతుంది జెన్సీ.
వరప్రసాద్ ద్వారా నన్ స్కూల్ నుంచి తప్పించుకుంటుంది జెన్సీ. వరప్రసాద్, జెన్సీ మిస్సింగ్ కేసును ఇన్స్‌పెక్టర్ భరత్ చేపడతాడు. అతడి ఇన్వేస్టిగేషన్‌లో జెన్సీ ఓ సైకో అనే నిజం బయటపడుతుంది. తనను ప్రాణంగా ప్రేమించిన వరప్రసాద్‌ను జెన్సీ ఎందుకు చంపేసింది? అసలు ఆమె గతం ఏమిటి? జెన్సీ అలా మారడటానికి కారణం ఏమిటి అన్నదే ఓ స్త్రీ మూవీ కథ. ఓ స్త్రీ మూవికి నితిన్ పీతాంబరన్, ఏసీ శ్రీరాగ్ మ్యూజిక్ అందించారు.
సంబంధిత కథనం
టాపిక్