ఐదుగురు భార్యలతో ఫస్ట్ నైట్- ఓటీటీలో మలయాళ రొమాంటిక్ కామెడీ సిరీస్- 7 భాషల్లో స్ట్రీమింగ్- ఇక్కడ చూసేయండి!

Best Web Hosting Provider In India 2024

ఐదుగురు భార్యలతో ఫస్ట్ నైట్- ఓటీటీలో మలయాళ రొమాంటిక్ కామెడీ సిరీస్- 7 భాషల్లో స్ట్రీమింగ్- ఇక్కడ చూసేయండి!

Sanjiv Kumar HT Telugu

ఓటీటీలో మలయాళ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ మంచి ఆదరణ పొందింది. ఐదుగురు భార్యలతో ఫస్ట్ నైట్ జరుపుకోవాలనే వింత కోరికతో సాగే ఈ సిరీస్ ఏకంగా 7 భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఆ వెబ్ సిరీస్ ఏంటీ, దాని ఓటీటీ రిలీజ్ ప్లాట్‌ఫామ్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఐదుగురు భార్యలతో ఫస్ట్ నైట్- ఓటీటీలో మలయాళ రొమాంటిక్ కామెడీ సిరీస్- 7 భాషల్లో స్ట్రీమింగ్- ఇక్కడ చూసేయండి!

ఓటీటీల్లో వచ్చే మలయాళ సినిమాలు, వెబ్ సిరీస్‌లకు ఫుల్ క్రేజ్ ఉంటుందన్న విషయం తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్‌తో సత్తా చాటడమే కాకుండా ఓటీటీల్లో కూడా దుమ్ములేపుతుంటాయి మలయాళ కంటెంట్ సినిమాలు, సిరీస్‌లు. ఎప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్‌తో మలయాళ సిరీస్‌లు, సినిమాలు అలరిస్తుంటాయి.

క్యాప్షన్‌కు తగినట్లుగా

అలాంటి ఓ వెబ్ సిరీసే నాగేంద్రన్స్ హనీమూన్స్. మలయాళంలో నేషనల్ అవార్డ్ విన్నర్ సూరజ్ వెంజరమూడ్ ప్రధాన పాత్ర పోషించిన రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ నాగేంద్రన్స్ హనీమూన్స్. ఈ సిరీస్‌కు ఒక జీవీతం, ఐదుగురు భార్యలు అనేది క్యాప్షన్. ఈ ఉప శీర్షికను బట్టే నాగేంద్రన్స్ హనీమూన్స్ సిరీస్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.

ఐదుగురు భార్యలతో శోభనం

ఐదుగురు అమ్మాయిలను పెళ్లి చేసుకుని ఐదుగురు భార్యలతో ఫస్ట్ నైట్ జరుపుకోవాలనే వింత కోరిక ఆధారంగా ఈ వెబ్ సిరీస్ నడుస్తుంది. నాగంద్రన్స్ హనీమూన్స్ వెబ్ సిరీస్‌లో పాపులర్ మలయాళ నటి కని కుశ్రుతి, అల్ఫీ పంజికరన్, గ్రేస్ ఆంటోనీ, శ్వేత మీనన్, నిరంజన్ అనూప్ ఫీమేల్ లీడ్ క్యారెక్టర్స్ పోషించారు.

నాగేంద్రన్స్ హనీమూన్ ఓటీటీ స్ట్రీమింగ్

వీరితోపాటు ప్రశాంత్ అలేగ్జాండర్, కళాభవన్ షజాన్, షాలిన్ జోయా ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. రొమాంటిక్ డార్క్ కామెడీ వెబ్ సిరీస్‌గా తెరకెక్కిన నాగేంద్రన్స్ హనీమూన్స్‌కు నితిన్ రెంజి పనికర్ కథ, దర్శకత్వం వహించారు. అయితే, గతేడాది ఆగస్ట్ 17 నుంచి నాగేంద్రన్స్ హనీమూన్స్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

జియో హాట్‌స్టార్ ఓటీటీలో

ఇప్పుడు ఓటీటీ సజెషన్ కింద ఈ సిరీస్‌ను చూసేయొచ్చు. జియో హాట్‌స్టార్ (డిస్నీ ప్లస్ హాట్‌స్టార్)లో నాగేంద్రన్స్ హనీమూన్స్ ఓటీటీ రిలీజ్ అయింది. అది కూడా మలయాళంతోపాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, బెంగాలీ, మరాఠీ వంటి ఏడు భాషల్లో నాగేంద్రన్స్ హనీమూన్స్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

ఆరు ఎపిసోడ్స్‌తో సిరీస్

ఓటీటీ రిలీజ్ అయిన కొంతకాలం వరకు నాగేంద్రన్స్ హనీమూన్స్ జియో హాట్‌స్టార్‌ ఓటీటీ ట్రెండింగ్ సిరీస్‌ల్లో టాప్‌లో నిలిచింది. ఇక నాగేంద్రన్స్ హనీమూన్స్ వెబ్ సిరీస్‌లో మొత్తం ఆరు ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ సుమారుగా 30 నిమిషాల రన్‌టైమ్‌తో ఉంది. ఒక్కో ఎపిసోడ్ ఒక్కో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం మీద ఉంటుంది.

అమ్మాయిల పేర్లతో ఎపిసోడ్ టైటిల్స్

వాటికి ఆ అమ్మాయిల పేర్లనే ఎపిసోడ్ టైటిల్స్‌గా పెట్టారు. జానకి, లిల్లికుట్టీ, లైలా, సావిత్రి, తంగం ఇలా 5 ఎపిసోడ్స్‌కు ఐదుగురు యువతుల పేర్లు ఉండగా.. చివరి ఆరో ఎపిసోడ్‌కు కూడా మోజీ అనే అమ్మాయి పేరుతో ట్విస్ట్ ఇచ్చారు. డార్క్ కామెడీ సిరీస్‌గా తెరకెక్కిన నాగేంద్రన్స్ హనీమూన్స్‌ను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ ఓటీటీలో ఎంచక్కా చూసేయొచ్చు.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024