నిన్ను కోరి మే 21 ఎపిసోడ్: రోడ్డు మీద చంద్ర పచ్చళ్ల బిజినెస్- ఏడిపించిన రౌడీలు- చితక్కొట్టిన విరాట్-శాలిని ప్లాన్ ఫెయిల్

Best Web Hosting Provider In India 2024

నిన్ను కోరి మే 21 ఎపిసోడ్: రోడ్డు మీద చంద్ర పచ్చళ్ల బిజినెస్- ఏడిపించిన రౌడీలు- చితక్కొట్టిన విరాట్-శాలిని ప్లాన్ ఫెయిల్

Sanjiv Kumar HT Telugu

నిన్ను కోరి సీరియల్ మే 21 ఎపిసోడ్‌లో పచ్చళ్ల బిజినెస్ గురించి జగదీశ్వరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది చంద్రకళ. రోడ్డు మీద టేబుల్ పెట్టి పచ్చళ్లు అమ్ముతుంది చంద్రకళ. అక్కడికి వచ్చన ముగ్గురు రౌడీలు చంద్రకళను ఏడిపించడంతో విరాట్ చితక్కొడతాడు. మరోవైపు శాలిని ప్లాన్ ఫెయిల్ అవుతుంది.

నిన్ను కోరి సీరియల్ మే 21 ఎపిసోడ్‌

నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఇంట్లో శాలినిని ముప్పుతిప్పలు పెడుతుంది చంద్రకళ. ఇల్లంతా శాలినితో క్లీన్ చేయిస్తుంది చంద్రకళ. అదంతా చూసిన కామాక్షి, శ్రుతి భయపడిపోతారు. చంద్రకళతో పెట్టుకోవద్దని అనుకుంటారు. ఇక చంద్రకళ పచ్చళ్ల బిజినెస్ స్టార్ట్ చేస్తుంది.

పూలను పడేసినట్లుగా

పచ్ఛళ్లు అమ్మడానికి జగదీశ్వరి దగ్గర ఆశీర్వాదం తీసుకోడానికి ప్రయత్నిస్తుంది చంద్రకళ. ప్లేట్‌లో ఉన్న పూలను కింద పడేసినట్లుగా చేసి అత్తయ్య కాళ్లకు నమస్కరిస్తుంది చంద్రకళ. ముందుగా పట్టించుకోని జగదీశ్వరి తర్వాత చంద్రకళను ఆశీర్వదిస్తుంది. తన ప్లేట్‌లో ఉన్న పూలను చంద్రకళ తలపై పడేలా చేస్తుంది జగదీశ్వరి.

దాంతో చంద్రకళ తన అత్తయ్య తనను ఆశీర్వదించిందని సంతోషంగా పచ్చళ్లు అమ్మడానికి బయటకు వెళ్తుంది. అదంతా చూసిన శాలిని, కామాక్షి, శ్రుతి చంద్రకళ పచ్చళ్ల బిజినెస్ జరగకూడదని కుళ్లుకుంటారు. ఎలాగైనా దాని బిజినెస్ పాడు చేయాలని మనసులో అనుకుంటారు.

మరోవైపు ప్రతి షాపుకు వెళ్లి పచ్చళ్లు అమ్ముతుంది చంద్రకళ. కానీ, ఏ ఒక్కరు కూడా ఆ పచ్చళ్లు తీసుకోరు. దాంతో చంద్రకళ ఓ ప్లాన్ వేస్తుంది. ఒక్కొక్కరి దగ్గరికి వెళ్లి అమ్మడం ఎందుకు. నేను సొంతంగా ఓ ప్లేసులో పచ్చళ్లు అమ్మేస్తే సరిపోతుంది కదా అని ఒక ప్లేస్ చూసుకుని టేబుల్ మీద పచ్చళ్లు పెట్టి అమ్ముతుంది చంద్రకళ. అప్పుడు బిజినెస్ బాగానే నడుస్తుంది.

రౌడీల ఎంట్రీ

అయితే, ఇంతలో అక్కడికి ముగ్గురు రౌడీలు వస్తారు. చంద్రకళ పచ్చళ్ల బిజినెస్‌ గురించి ఎగతాళిగా మాట్లాడుతారు. చంద్రకళ వాళ్లకు ధీటుగా సమాధానం ఇస్తుంది. అయినా కూడా రౌడీలు రెచ్చిపోతారు. ఇంతలో అక్కడికి విరాట్ వస్తాడు. ఓ రౌడీ మాట్లాడుతుంటే అతని భుజంపై చేయి వేస్తాడు. ఆడపిల్లను ఏడిపించడం కరెక్ట్ కాదు కదా అని విరాట్ అంటాడు.

వచ్చాడండి హీరో.. మరి ఎలా ఏడిపించాలో మీరే చెప్పండి అని విరాట్‌తో కూడా ఎగతాళిగా మాట్లాడుతారు రౌడీలు. దాంతో ముగ్గురు రౌడీలను విరాట్ చితకొడతాడు. అది చూసిన చంద్రకళ కూడా రౌడీలను కొడుతుంది. విరాట్, చంద్రకళ కలిసి రౌడీలను కొట్టి తరిమేస్తారు. రౌడీలు వెళ్లిపోయిన తర్వాత ఇదంతా నీకు అవసరమా. ఇలా రోడ్డు మీద పచ్చళ్లు అమ్ముకుంటే ఇలాగే ఎవడో ఒకడు వచ్చి ఏడిపిస్తాడు అని విరాట్ అంటాడు.

సక్సెస్ అయ్యేవరకు

ఇంట్లో తేరగా తినలేక ఇలాంటి కష్టాలు పడుతున్నాను అని చంద్రకళ అంటుంది. ఇప్పుడు మీ ఆఫీస్‌లో మీకు ఎవరైనా పోటీకి వస్తే మీరు తప్పుకుంటారా. ఎదిరించి ధైర్యంగా బిజినెస్‌ను సక్సెస్ చేయాలనుకుంటారుగా. నేను కూడా అంతే, ఎవరో వచ్చి ఏదో అన్నారని నా బిజినెస్ ఎందుకు ఆపాలి. ఇలాగే పచ్చళ్ల వ్యాపారం కంటిన్యూ చేస్తానని చంద్రకళ అంటుంది.

ఇక ఇంట్లో చంద్రకళ పచ్చడి డబ్బాలన్ని శాలిని విసిరేద్దామని అనుకుని ప్రయత్నిస్తుంది. కానీ, ఇంతలో జగదీశ్వరి రావడంతో ఆగిపోతుంది. దాంతో శాలిని ప్లాన్ ఫెయిల్ అవుతుంది. జగదీశ్వరి, శాలిని మాట్లాడుకుంటుండగా.. చంద్రకళ ఖాలీ బ్యాగుతో ఎంట్రీ ఇస్తుంది. మీ ఆశీర్వాదం వల్ల అన్ని పచ్చళ్లు అమ్ముడుపోయాయి అని చంద్రకళ చెబుతుంది. దాంతో పట్టించుకోనట్లుగా జగదీశ్వరి వెళ్లిపోతుంది.

కష్టాల గురించి దాచి

తర్వాత రఘురాంను చల్లగాలి కోసం బయటకు తీసుకెళ్తుంది చంద్రకళ. ఇంతలో చంద్రకళకు తల్లి సుభద్ర కాల్ చేస్తుంది. నిన్న ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు. ఏమైనా సమస్య అని తల్లి అడుగుతుంది. అలాంటిది ఏం లేదు. ఫోన్ రిపేర్ అయింది అని చంద్రకళ అబద్ధం చెబుతుంది. ఎన్ని కష్టాలున్న చంద్రకళ అది దాచి పెట్టి తల్లికి అబద్ధం చెబుతుంది.

అది అర్థం చేసుకున్న తల్లి సుభద్ర నా కూతురు మంచిది. ఆ విషయాన్ని వాళ్లు కూడా తెలుసుకుంటారు. నా కూతురు తప్పు చేయలేదని ఏదో ఒక రోజు నిరూపించుకుంటుంది అని సుభద్ర అనుకుంటుంది. ఇక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024