రాజమౌళి, మహేష్ సినిమాపై క్రేజీ బజ్.. ఎస్ఎస్ఎంబీ 29లో మరో స్టార్ హీరో? అదే నిజమైతే పూనకాలే!

Best Web Hosting Provider In India 2024

రాజమౌళి, మహేష్ సినిమాపై క్రేజీ బజ్.. ఎస్ఎస్ఎంబీ 29లో మరో స్టార్ హీరో? అదే నిజమైతే పూనకాలే!

ఎస్ఎస్ఎంబీ 29: ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూవీపై క్రేజీ బజ్ వినిపిస్తోంది. ఈ ఎస్ఎస్ఎంబీ 29 సినిమాలో ఓ స్టార్ హీరో కీ రోల్ ప్లే చేయబోతున్నారనే టాక్ వస్తుంది. మరి ఆ హీరో ఎవరో ఇక్కడ చూసేయండి.

మహేష్ బాబు (x/urstrulyMahesh)

సూపర్ స్టార్ మహేష్ బాబు, టాప్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ అనగానే ఎక్కడ లేని హైప్ క్రియేట్ అయింది. ఇక ఈ మూవీని ఫారెస్ట్ అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ గా రెడీ చేస్తున్నారనగానే అంచనాలు మరింత పెరిగిపోయాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీకి సంబంధించి రోజుకో వార్త హాట్ టాపిక్ గా మారుతోంది. ఇప్పుడిక ఈ సినిమాలో మరో స్టార్ హీరో కీ రోల్ ప్లే చేయబోతున్నారనే వార్తలు వస్తున్నాయి.

తమిళ స్టార్ హీరో

ఎస్ఎస్ఎంబీ 29 వర్కింగ్ టైటిల్ తో రాజమౌళి, మహేష్ బాబు మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీలో ఇప్పటికే ఇతర స్టార్లు కూడా భాగమయ్యారు. ఇక ఇప్పుడు తమిళ స్టార్ హీరో, వర్సటైల్ యాక్టర్ చియాన్ విక్రమ్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారనే వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. మహేష్ బాబు సినిమాలో విక్రమ్ కీ రోల్ ప్లే చేస్తున్నారనే న్యూస్ సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారింది.

నిజమెంతా?

రాజమౌళి, మహేష్ బాబు మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచే ఈ సినిమాకు సంబంధించిన విషయాలు వైరల్ గా మారుతున్నాయి. ఇప్పటికే ఈ మూవీలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారనే సంగతి తెలిసిందే. అయితే పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ మూవీ నుంచి తప్పుకున్నారని, ఆయన స్థానంలో బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహం వచ్చారనే వార్త కూడా హాట్ టాపిక్ గా మారింది.

ఈ నేపథ్యంలో ఎస్ఎస్ఎంబీ 29 మూవీలో చియాన్ విక్రమ్ నటిస్తున్నారనే వార్తలపై క్లారిటీ లేదు. దీనిపై మూవీ టీమ్ కూడా అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ ఏం చేయలేదు. కానీ మహేష్ సినిమాలో విక్రమ్ యాక్ట్ చేసే ఛాన్స్ ఉందని మాత్రం ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మరి దీనిపై మూవీ టీమ్ ఎలా రియాక్టవుతుందో చూడాలి.

యాక్షన్ థ్రిల్లర్ గా

వరుసగా బ్లాక్ బస్టర్లతో ప్రపంచ స్థాయికి తెలుగు సినిమాను తీసుకెళ్లిన రాజమౌళి ఇప్పుడు మహేష్ తో మూవీని ఓ రేంజ్ లో రెడీ చేస్తున్నారని తెలిసింది. భారీ యాక్షన్ సీక్వెన్స్ తో అడ్వెంచరస్ థ్రిల్లర్ గా ఈ మూవీ ఉండబోతోంది. ఈ మూవీకి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. కేఎల్ నారాయణ సుమారు రూ.1000 కోట్ల బడ్జెట్ తో మూవీ నిర్మిస్తున్నారు.

మహేష్ ఫస్ట్ టైమ్

ఇప్పటికే ఒడిషా, హైదరాబాద్, విదేశాల్లో ఎస్ఎస్ఎంబీ షూటింగ్ జరుపుకొంది. ఈ మూవీలో యాక్షన్ సీక్వెన్స్ కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్లను రప్పించారని తెలిసింది. ఇప్పటికే మహేష్ పై కొన్ని యాక్షన్ సీన్లు తీశారు. ఇక ఈ మూవీలో మహేష్ షర్ట్ లేకుండా తొలిసారి బాడీ చూపించనున్నారని టాక్.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024