





Best Web Hosting Provider In India 2024

రెజ్లింగ్ ఛాంపియన్ నుంచి సూపర్ స్టార్.. ఒకే ఏడాది 25 హిట్లు.. మోహన్‌లాల్ గురించి ఈ విషయాలు తెలుసా? బర్త్‌డే స్పెషల్
మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ బర్త్ డే ఈ రోజు (మే 21). రెజ్లింగ్ ఛాంపియన్ నుంచి సూపర్ స్టార్ గా ఎదిగారు ఆయన. ఒకే ఏడాది 25 హిట్ సినిమాలు అందించారు. ఇలాంటి ఎన్నో విశేషాలు ఇక్కడ చూసేయండి.
వైవిధ్యమైన కథలతో.. విలక్షణ నటనతో.. వరుసగా బ్లాక్ బస్టర్లు కొడుతున్నారు మోహన్‌లాల్. రీసెంట్ గా తుడరుమ్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. కేరళ బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్లు కలెక్ట్ చేసిన ఫస్ట్ మలయాళ సినిమాగా తుడరుమ్ నిలిచింది. అంతకుముందు ఎల్2 ఎంపురాన్ తో అదరగొట్టారు మోహన్‌లాల్. ఈ రోజు (మే 21) ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన కెరీర్ లోని కొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు మీకోసం.
స్టేట్ ఛాంపియన్
యాక్టింగ్ తో మెప్పిస్తూ కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న మోహన్‌లాల్ ఒకప్పుడు రెజ్లింగ్ ఛాంపియన్ అన్న సంగతి చాలా మందికి తెలియదు. 1977, 1978 మధ్యలో కేరళ స్టేట్ రెజ్లింగ్ ఛాంపియన్ గా నిలిచారు మోహన్‌లాల్. కానీ యాక్టింగ్ పై ప్రేమతో ఆటను వదిలేశారు. స్కూల్ ఏజ్ లోనే నాటకాలతో యాక్టింగ్ స్టార్ట్ చేశారు. అదే బాటలో సాగిపోయారు.
విలన్ గా మొదలెట్టి
ఇప్పుడు హీరోగా, ఇతర కీ క్యారెక్టర్లు చేస్తున్నారు మోహన్‌లాల్. కానీ ఆయన విలన్ గా సినీ కెరీర్ ను స్టార్ట్ చేయడం విశేషం. 1980లో వచ్చిన మలయాళ సినిమా ‘మంజిల్ విరింజ పూక్కల్’తో మోహన్‌లాల్ తెరంగేట్రం చేశారు. ఈ మూవీలో ఆయన విలనిజం పండించారు. దీంతో కెరీర్ స్టార్టింగ్ లో విలన్ రోల్స వచ్చేవి. ఆ తర్వాత తనలోని విలక్షణ నటుడిని ప్రపంచానికి పరిచయం చేశారు. సూపర్ స్టార్ గా ఎదిగిపోయారు.
ఏడాదిలో 34 సినిమాలు
1986.. ఈ ఏడాది మోహన్‌లాల్ కెరీర్ లో స్పెషల్ గా నిలిచిపోతుంది. ఈ సంవత్సరం ఆయన ఏకంగా 34 సినిమాలు చేశారు. అంటే సగటున 11 రోజులకో మూవీ చేశారని అర్థం. ఈ 34 సినిమాల్లో 25 బ్లాక్ బస్టర్లుగా నిలవడం మరో విశేషం. ఈ రికార్డును ఇప్పటివరకూ ఏ హీరో కూడా బ్రేక్ చేయలేకపోయారు. దీని తర్వాత మోహన్‌లాల్ వెనుదిరిగి చూసుకోలేదు. వరుసగా హిట్లు అందించారు. ఫ్యాన్స్ ను సంపాదించుకున్నారు.
అయిదు సార్లు నేషనల్ అవార్డు
మోహన్‌లాల్ వర్సటైల్ కు అభిమానుల ప్రేమతో పాటు అవార్డులూ దక్కాయి. ఆయన ఇప్పటికే అయిదు సార్లు జాతీయ పురస్కారాలు సొంతం చేసుకున్నారు. ఏ ఆర్టిస్ట్ కైనా ఇదే గొప్ప ఘనత. ఒక్కసారి జాతీయ అవార్డు దక్కిందంటే ఎంతో విశేషం. అలాంటిది అయిదు సార్లు ఆయన ఈ పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు. కిరీడం, భారతం, వనప్రస్తం, జనతా గ్యారేజీ, ముంతిరివల్లికల్ సినిమాల్లో నటనకు గాను మోహన్‌లాల్‌కు అవార్డులు దక్కాయి.
సంబంధిత కథనం