వేసవిలో లూజ్ మోషన్ అయితే ఈ 8 హోం రెమెడీస్ పాటించండి, త్వరగా కంట్రోల్ అవుతాయి

Best Web Hosting Provider In India 2024

వేసవిలో లూజ్ మోషన్ అయితే ఈ 8 హోం రెమెడీస్ పాటించండి, త్వరగా కంట్రోల్ అవుతాయి

Haritha Chappa HT Telugu

వేసవిలో విరేచనాల బారిన ఎక్కువ మంది పడుతూ ఉంటారు. పేగులు పోషకాలను గ్రహించలేనప్పుడు ఈ పరిస్థితి సంభవిస్తుంది. ఇది జరిగినప్పుడు, ఆహారం సరిగ్గా జీర్ణం కాకుండా శరీరం నుండి బయటకు వెళ్లిపోతుంది. ఈ సమస్యను ఎదుర్కోవడానికి ఈ ఎఫెక్టివ్ హోం రెమెడీస్ కొన్ని ఉన్నాయి.

లూజ్ మోషన్స్ కు ఇంటి చిట్కాలు

ఎండలు ముదిరినప్పుడు ఎక్కువ మంది లూజ్ మోషన్స్ బారిన పడుతూ ఉంటారు. వేసవిలో వచ్చే ఆరోగ్య సమస్యల్లో విరేచనాలు అత్యంత సాధారణ వ్యాధులలో ఒకటి. పిల్లల నుంచి వృద్ధుల వరకు ఈ సమస్య బారిన పడుతూ ఉంటారు.

విరేచనాలు రావడానికి కారణం పేగులు పోషకాలను గ్రహించలేక పోవడం. దీని వల్ల ఆహారం సరిగా జీర్ణం కాకుండా శరీరం నుంచి బయటకు వెళ్లిపోతుంది. అయితే, ఇది తీవ్రమైన సమస్య కాదు. దీనికి ఇంట్లోనే చికిత్స చేయవచ్చు. ఈ హోంరెమెడీస్ చాలా చింపుల్ గా ఉంటాయి. వీటిని పాటించాక లూజ్ మోషన్స్ దాదాపు తగ్గిపోతాయి. రెండు రోజుల పాటూ ఈ ఇంటి చిట్కాలు పాటించినా కూడా తగ్గకపోతే మాత్రం వైద్యులను సంప్రదించడం అన్ని విధాలా మంచిది.

1. పెరుగన్నం

పెరుగు ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. అన్నంలో రెండు మూడు స్పూనుల పెరుగు కలుపుకుని మూడు పూటలా తినేందుకు ప్రయత్నించండి. ఇది మంచి ఉపాయం.

2. నెయ్యి అన్నం

వేడి అన్నంలో ఒక స్పూను నెయ్యి వేసి చిటికెడు ఉప్పు వేసి బాగా కలపండి. ఆ అన్నాన్ని తినండి. రోజులో రెండు మూడు సార్లు ఇలా తినేందుకు ప్రయత్నించండి. చాలామేరకు విరేచనాలు ఆగుతాయి.

3. మజ్జిగ

మజ్జిగలో లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఇది హానికరమైన, ఉపయోగకరమైన గట్ బ్యాక్టీరియాల మధ్య సమతుల్యతను నిర్వహించడానికి సహాయపడుతుంది. విరేచనాల సమయంలో క పెద్ద గ్లాసు లేదా రెండు చిన్న గ్లాసుల మజ్జిగ తాగడం మంచిది. విరేచనాలను ఎదుర్కోవటానికి మజ్జిగ కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

4. అరటి పండు

అరటిపండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. అరటిపండ్లలో ఎసెన్షియల్ ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఇవి మీరు విరేచనాలతో బాధపడుతున్నప్పుడు మీ శరీరం నుండి విడుదలవుతాయి. ఈ పండ్లు డీహైడ్రేషన్ బారిన పడిన శరీరానికి అవసరమైన శక్తిని ఇస్తాయి. మీకు విరేచనాలు ఉన్నప్పుడు ప్రతి రెండు గంటలకు ఒకసారి పండిన అరటిపండు తినండి.

5. ఆపిల్స్

రోజు యాపిల్ తినడం వల్ల వైద్యులను చూాడాల్సిన పరిస్థితి రాదని అంటారు. అది నిజమే. ఒక ఆపిల్ తీసుకుని నెయ్యిలో ఉడికించాలి. అందులో జాజికాయ పొడి, యాలకుల పొడి వేసి తింటే డయేరియా సమస్యను దూరం చేసుకోవచ్చు.

6. ఉప్పు-చక్కెర నీరు

విరేచనాల కారణంగా, శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. కాబట్టి ఒక లీటరు నీటిలో 5-6 టీస్పూన్ల ఉప్పు, పంచదార కరిగించి ఆ తర్వాత ఈ నీటిని రోజంతా తాగాలి. ఇలా చేయడం వల్ల డీహైడ్రేషన్ కు చికిత్స అందుతుంది. దీంతోపాటు అలసట, బలహీనత నుంచి ఉపశమనం లభిస్తుంది.

7. సగ్గుబియ్యం

విరేచనాలకు చికిత్స చేయడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి సాబుదానా మరొక ప్రభావవంతమైన హోం రెమెడీ. గుప్పెడు సగ్గుబియ్యం తీసుకుని 3 గంటల పాటు నీటిలో నానబెట్టండి. వాటిని వడకట్టిన తర్వాత కిచిడీలాగా వండుకుని తినాలి. ఇది తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.

8. బంగాళాదుంపలు

బంగాళాదుంపల్లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. విరేచనాల కోసం, ఉడకబెట్టిన బంగాళాదుంపలు మంచివి. ఎందుకంటే అవి సులభంగా జీర్ణమవుతాయి. దీనిలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి, ఇవి తగినంత శక్తిని కూడా అందిస్తాయి.

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024