గుండె నిండా గుడి గంట‌లు టుడే ఎపిసోడ్‌: పుట్టింటికి మీనా దూరం -ప్ర‌భావ‌తి జెల‌సీ -బాలును బావ అని పిల‌వ‌న‌న్న‌ శివ‌

Best Web Hosting Provider In India 2024

గుండె నిండా గుడి గంట‌లు టుడే ఎపిసోడ్‌: పుట్టింటికి మీనా దూరం -ప్ర‌భావ‌తి జెల‌సీ -బాలును బావ అని పిల‌వ‌న‌న్న‌ శివ‌

Nelki Naresh HT Telugu

గుండె నిండా గుడి గంట‌లు సీరియ‌ల్ మే 21 ఎపిసోడ్‌లో ప్ర‌భావ‌తి ద‌గ్గ‌ర కొట్టేసిన డ‌బ్బును బాలుకు తిరిగి ఇచ్చేస్తాడు శివ‌. ఇంకోసారి నా విష‌యాల్లో జ్యోకం చేసుకోవ‌ద్ద‌ని బాలుతో గొడ‌వ‌ప‌డ‌తాడు. మ‌రోవైపు బ్యూటీపార్ల‌ర్‌లో ఉన్న రోహిణి ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి డ‌బ్బులు కావాల‌ని బ్లాక్‌మెయిల్ చేస్తాడు వ‌ర్ధ‌న్‌.

గుండె నిండా గుడి గంట‌లు సీరియ‌ల్ మే 21 ఎపిసోడ్‌

చేయి నొప్పి నుంచి పూర్తిగా కోలుకోక‌ముందే గుణ ద‌గ్గ‌ర ప‌నిచేయ‌డానికి వెళ‌తాడు శివ‌. గుణ ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని పార్వ‌తి, సుమ‌తి వ‌ద్ద‌ని ఎంత చెప్పిన విన‌డు. అప్పుడే అక్క‌డికి మీనా వ‌స్తుంది. ఒంటి చేయితో ఎలా ప‌నిచేస్తావు? రెస్ట్ తీసుకోమ‌ని డాక్ట‌ర్లు అన్నారుగా అని అంటుంది. మీరు క‌ష్ట‌ప‌డుతుంటే నేను ఖాళీగా ఉండ‌లేన‌ని మీనాకు బ‌దులిస్తాడు శివ‌.

గుణ ఫ్రాడ్‌…

గుణ చాలా ఫ్రాడ్ అని, వాడి మూలంగానే మ‌న కుటుంబానికి ఎన్నో స‌మ‌స్య‌లు వ‌చ్చాయ‌ని పార్వ‌తి, సుమ‌తి అంటారు. కానీ శివ మాత్రం గుణ‌నే వేసుకేసుకొనివ‌స్తాడు. గుణ న్యాయంగా ఫైనాన్స్ బిజినెస్ చేస్తున్నాడ‌ని అంటాడు. వ‌డ్డీ డ‌బ్బులు వ‌సూలు చేయ‌డానికి అమ్మ నిన్ను క‌ష్ట‌ప‌డి చ‌దివిస్తుందా…. రౌడీ ప‌నులు చేసుకొని బ‌తుకుతావా అని శివ‌కు క్లాస్ ఇస్తుంది మీనా.

మీ ఆయ‌నే రౌడీ…

నేను రౌడీనా? ఎవ‌రి మీద ప‌డితే వాళ్ల మీద చేయి చేసుకొనే మీ ఆయ‌న రౌడీ అని మీనాతో అంటాడు శివ‌. మా ఆయ‌న గురించి ఇంకో మాట త‌ప్పుగా మాట్లాడితే ప‌ళ్లు రాల‌గొడ‌తాన‌ని శివ‌కు వార్నింగ్ ఇస్తుంది మీనా. మీ ఆయ‌న ఏంటి? బావ అని పిల‌వ‌లేవా అని అంటుంది. నా చేయి విర‌గొట్టిన బాలును బావ అని పిల‌వ‌న‌ని శివ అంటాడు. గుణ‌తో ప‌నిచేస్తున్నావ‌నే బాలు నీ చేయి విర‌గ్గొట్టాడ‌ని పార్వ‌తి అంటుంది.

నీ చేయి ఎందుకు విర‌గ్గొట్టావ‌ని బాలును తాను నిల‌దీశాన‌ని అప్ప‌టి నుంచి త‌న‌తో మాట్లాడ‌ట‌మే మానేశాడ‌ని మీనా అంటుంది. ఇద్ద‌రం మొహాలు కూడా చూసుకోవ‌డం లేద‌ని మీనా చెబుతుంది. మా ఆయ‌న‌తో మాట్లాడితే గొడ‌వ‌లు పెట్టుకోవాల్సివ‌చ్చింద‌ని నేనే మాట్లాడ‌టం లేద‌ని అంటుంది. నీ వ‌ల్ల అక్క కాపురంలో గొడ‌వ‌లు జ‌రుగుత‌న్నాయ‌ని శివ‌ను పార్వ‌తి కోప్ప‌డుతుంది.

ఇక్క‌డికి వ‌చ్చేయ్‌…

నువ్వు కూడా ఇక్క‌డికి వ‌చ్చేయ్‌…అలాంటివాడితో కాపురం చేయ‌డం అన‌వ‌స‌రం మీ ముగ్గురిని నేను పోషిస్తాన‌ని శివ అంటాడు. నువ్వు ఎవ‌డివి నా కాపురం గురించి మాట్లాడ‌టానికి శివ‌కు వార్నింగ్ ఇస్తుంది మీనా. పార్ట్‌టైమ్ జాబ్ ప‌క్క‌న‌పెట్టి బాగా చ‌దువుకోమ‌ని త‌మ్ముడికి చెబుతుంది. మ‌న ద‌గ్గ‌ర డ‌బ్బు లేద‌ని న‌న్ను దొంగ అన్నారు…అక్క‌ను రోజు అవ‌మానిస్తున్నారు. నేను బాగా డ‌బ్బు సంపాదించాలంటే గుణ ద‌గ్గ‌ర ప‌నిచేయాల్సిందే న‌న్ను అపోద్దు అని మీనా, పార్వ‌తి వారిస్తున్నా విన‌కుండా శివ వెళ్లిపోతాడు.

బ్యూటీ పార్ల‌ర్‌కు వ‌ర్ధ‌న్‌…

మ‌నోజ్‌తో జ‌రిగిన గొడ‌వ‌ను గురించి ఆలోచిస్తుంది రోహిణి. ఇక నుంచి జాబ్ పేరుతో మ‌నోజ్‌ను ఇబ్బంది పెట్ట‌కూడ‌ద‌ని అనుకుంటుంది. రోహిణిని వెతుక్కుంటూ వ‌ర్ధ‌న్ బ్యూటీ పార్ల‌ర్‌కు వ‌స్తాడు. నాకు అర్జెంట్‌గా యాభై వేలు కావాల‌ని, నువ్వు ఇవ్వ‌క‌పోతే మీ ఇంటికెళ్లి అత్త‌గారిద‌గ్గ‌ర తీసుకుంటాన‌ని బ్లాక్‌మెయిల్ చేస్తాడు.

రోహిణికి వార్నింగ్‌…

రోహిణి బ్యూటీపార్ల‌ర్ లోప‌ల వ‌ర్ధ‌న్‌తో మాట్లాడ‌టం ఓన‌ర్ చేస్తుంది. లేడీస్ పార్ల‌ర్ లోప‌లికి వ‌ర్ధ‌న్‌ను రాణించినందుకు రోహిణికి క్లాస్ ఇస్తుంది. నువ్వు ఈ పార్ల‌ర్‌కు ఓన‌ర్ కాద‌ని, ఎంప్లాయ్ అని గుర్తుంచుకో…ఇంకోసారి ఇది రిపీట్ అయితే నువ్వు ఇక్క‌డ ఉండ‌వ‌ని వార్నింగ్ ఇస్తుంది.

శివ గొడ‌వ‌…

రాజేష్‌తో పాటు త‌న స్నేహితుల‌తో బాలు మాట్లాడుతుండ‌గా అక్క‌డికి గుణ‌తో క‌లిసి శివ వ‌స్తాడు. నువ్వు ఇచ్చింది తిరిగి ఇద్దామ‌ని వ‌చ్చామ‌ని బాలుతో గుణ అంటాడు. ప్ర‌భావ‌తి ద‌గ్గ‌ర కొట్టేసిన డ‌బ్బు తిరిగి ఇస్తాడు. నేను దొంగ‌త‌నం చేసిన డ‌బ్బు తిరిగి ఇచ్చేశా…నువ్వు విరిచిన చేయి ఇవ్వ‌గ‌ల‌వా అని గొడ‌వ‌కు దిగుతాడు. మా నాన్న క‌ష్ట‌ప‌డి సంపాదించిన డ‌బ్బు ఇద‌ని, అది ఆయ‌న‌కే చేరాల‌ని శివ ఇచ్చిన డ‌బ్బును తీసుకుంటాడు బాలు. నేను దొంగ‌ల‌ను న‌మ్మ‌ను ఈ డ‌బ్బు లెక్క‌పెట్ట‌మ‌ని రాజేష్‌కు ఇస్తాడు బాలు.

నా విష‌యాల్లో జోక్యం చేసుకోవ‌ద్దు…

నేను డ‌బ్బులు తిరిగి ఇచ్చేశా…ఇక నుంచి నా విష‌యాల్లో జోక్యం చేసుకోవ‌ద్ద‌ని బాలుతో అంటాడు శివ‌. నా లైఫ్ నా ఇష్టం అని శివ అంటాడు. నేను విన‌ల‌దేని మా అక్క‌తో స‌ల‌హాలు ఇప్పించ‌కు అని అంటాడు.

నేను మీ అక్క‌తో చెప్ప‌డం ఏంటి అని బాలు బ‌దులిస్తాడు. డ్రామాలు ఆడ‌కు…నేను గుణ‌తో ప‌నిచేసిన విష‌యం నువ్వే మా అక్క‌తో చెప్పావ‌ని బాలుపై ఫైర్ అవుతాడు శివ‌. ఎక్కువ‌గా డిస్క‌ష‌న్స్ వ‌ద్ద‌ని, ఇక‌పై నా జోలికి రావ‌ద్దొని అంటాడు.

జైలుకు పంపిస్తావా…

అస‌లు స‌రిపోతుందా? వ‌డ్డీ కావాలా అని బాలును అడుగుతాడు శివ‌. పాకెట్‌లో నుంచి ఐదు వేలు తీసి బాలుకు ఇస్తాడు. అస‌లు ఇచ్చావు అది మా డ‌బ్బు…వ‌డ్డీ నీ పొగ‌రు…అది మా ద‌గ్గ‌ర చూపించ‌కు అని శివ ముఖంపై అత‌డి ఇచ్చిన డ‌బ్బును విసిరికొడ‌తాడు. నువ్వు డ‌బ్బులు ఎలా సంపాదిస్తున్నావో నాకు తె లుసు అని శివ‌తో అంటాడు బాలు.

తెలిసినా నువ్వు ఏం చేస్తావు. కేసు పెట్టి జైలులో వేయిస్తావా…నువ్వు ఏం చేసినా న‌న్ను కాపాడ‌టానికి గుణ ఉన్నాడ‌ని శివ అంటాడు. ఏదైనా ఉంటే నాతో మాట్లాడ‌మ‌ని, మా అక్క‌ను ముందు పెట్టి నువ్వు వెన‌క దాక్కొని డ్రామాలు ఆడొద్ద‌ని బాలును హెచ్చ‌రించి వెళ్లిపోతాడు.

జైలుకు వెళితే టైమ్‌కు భోజ‌నం…

టైమ్‌కు వంట చేయ‌డం లేద‌ని మీనాను ఆడిపోసుకుంటుంది ప్ర‌భావ‌తి. టైమ్‌కు మీరు భోజ‌నం చేయాల‌నుకుంటే జైలుకు వెళ్లండ‌ని మీనా వెట‌కారంగా స‌మాధాన‌మిస్తుంది. నీకు పొగ‌రు బాగా ఎక్కువైంద‌ని, నీ సంగ‌తి చెప్తా అని మీనాపై ఫైర్ అవుతుంది ప్ర‌భావ‌తి. అప్పుడే పూల కొట్టు గిరాకీ వ‌స్తుంది. పూల‌ను ఫ్రిజ్ నుంచి తీసి క‌స్ట‌మ‌ర్‌కు ఇస్తుంది మీనా. నువ్వు పూలు ఫ్రిజ్‌లో పెట్ట‌డం వ‌ల్ల కూర‌ల‌న్నీ పూల వాస‌న వ‌స్తున్నాయ‌నే కావాల‌నే మీనాతో గొడ‌వ‌కు దిగుతుంది ప్ర‌భావ‌తి.

ప్ర‌భావ‌తి అసూయ‌…

మీనా షాప్ బాగా న‌డ‌వ‌డం చూసి అసూయ‌ప‌డుతుంది ప్ర‌భావ‌తి. వ్యాపారం బాగానే సాగుతున్న‌ట్లుంద‌ని, చేతి నిండా డ‌బ్బులు క‌నిపిస్తున్నాయ‌ని అంటుంది. అది ఎంత పెద్ద షాప్ అన్న‌ది చూడొద్ద‌ని , ఎంత గౌర‌విస్తున్నామో చూడ‌మ‌ని మీనా అంటుంది. రోహిణి బ్యూటీ పార్ల‌ర్‌కు త‌న పేరు పెట్టి గౌర‌వాన్ని పెంచింద‌ని, నెల నెల డ‌బ్బుల తీసుకొచ్చి త‌న‌కు ఇస్తుంద‌ని ప్ర‌భావ‌తి అంటుంది. రోహిణిని తెగ పొగుడుతుంది ప్ర‌భావ‌తి. నువ్వు ఏ రోజు ఒక్క రూపాయి కూడా నాకు తెచ్చివ్వ‌లేద‌ని మీనాను దెప్పిపొడుస్తుంది.

పూల‌కొట్ట‌కు మాత్ర‌మే ఉంది…

అప్పుడే బాలు అక్క‌డికి వ‌స్తాడు. నీ పేరు ఒక్క మా పూల కొట్టుకు మాత్ర‌మే ఉంద‌ని మ‌ర్చిపోకు అని బాలు అంటాడు. అత‌డి మాట‌ల‌తో రోహిణి కంగారు ప‌డుతుంది. పార్ల‌ర్‌కు కూడా ఉంద‌ని ప్ర‌భావ‌తి అంటుంది. అదెప్పుడో మార్చేశార‌ని లోలోన బాలు అంటాడు. బాలు నిజం చెప్ప‌కుండా స‌త్యం అడ్డుకుంటాడు.

శివ ఇచ్చిన డ‌బ్బును స‌త్యానికి ఇచ్చేస్తాడు బాలు. ప్ర‌భావ‌తి ద‌గ్గ‌ర దొంగ కొట్టేసిన డ‌బ్బు ఇద‌ని బాలు అంటాడు.

ప్ర‌భావ‌తి ప్ర‌శ్న‌లు…

ఆ దొంగ దొరికాడా? డ‌బ్బంతా తిరిగి ఇచ్చాడా అని ప్ర‌భావ‌తి, రోహిణి అనుమానంగా అడుగ‌తారు. ఆ దొంగ ఎవ‌రు అని అంటారు. అది మాత్రం తెలియ‌ద‌ని బాలు అబ‌ద్ధం ఆడుతాడు. మీ పుట్టింటికి ఎందుకు వెళ్లావ‌ని మీనాను అడుగుతాడు బాలు. గుణ ద‌గ్గ‌ర జాబ్ చేయ‌కుండా ఆప‌మ‌ని నేను నిన్ను పంపించాన‌ని నాకు వార్నింగ్ ఇచ్చాడ‌ని బాలు అంటాడు. ఇక నుంచి నువ్వు మీ పుట్టింటికి వెళ్ల‌డానికి వీలు లేద‌ని మీనాతో అంటాడు బాలు. మీ త‌మ్ముడు ఉండే ఏ చోటుకి వెళ్ల‌కూడ‌ద‌ని అంటాడు.

శివ‌కు ఫోన్ చేసి బాలుతో జ‌రిగిన గొడ‌వ‌ల గురించి అడుగుతుంది మీనా. న‌న్ను పుట్టింటికి రావొద్ద‌ని అన్నాడ‌ని అంటుంది. అయితే రాకు…నువ్వు నీ ఇంట్లో సంతోషంగా ఉండు. మేము కూడా హ్యాపీగా ఉంటామ‌ని శివ స‌మాధానం చెప్ప‌డంతో మీనా షాక‌వుతుంది. అక్క‌డితో నేటి గుండె నిండా గుడి గంట‌లు సీరియ‌ల్ ముగిసింది.

నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024