మొన్న మర్డర్ మిస్టరీ ఇప్పుడు కోర్ట్ రూమ్ డ్రామా- బిచ్చగాడు హీరో కొత్త మూవీ లాయర్- 4 భాషల్లో రిలీజ్- డైరెక్టర్‌గా రైటర్!

Best Web Hosting Provider In India 2024

మొన్న మర్డర్ మిస్టరీ ఇప్పుడు కోర్ట్ రూమ్ డ్రామా- బిచ్చగాడు హీరో కొత్త మూవీ లాయర్- 4 భాషల్లో రిలీజ్- డైరెక్టర్‌గా రైటర్!

Sanjiv Kumar HT Telugu

బిచ్చగాడు సినిమాతో తమిళ, తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరు తెచ్చుకున్న హీరో విజయ్ ఆంటోనీ మొన్న మర్డర్ మిస్టరీ జోనర్‌లో మార్గన్ మూవీని అనౌన్స్ చేశాడు. ఇప్పుడు కోర్ట్ రూమ్ డ్రామాగా మరో కొత్త సినిమా లాయర్‌ను తెరపైకి తీసుకురానున్నాడు. ఈ సినిమాతో తమిళ రైటర్ జాషువా సేతురామన్ డైరెక్టర్‌గా మారనున్నారు.

మొన్న మర్డర్ మిస్టరీ ఇప్పుడు కోర్ట్ రూమ్ డ్రామా- బిచ్చగాడు హీరో కొత్త మూవీ లాయర్- 4 భాషల్లో రిలీజ్- డైరెక్టర్‌గా రైటర్!

తమిళ స్టార్ హీరో విజయ్ ఆంటోని కెరీర్ ప్రారంభం నుంచి కూడా కొత్త కథల్ని, డిఫరెంట్ కంటెంట్‌లతో ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు. హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా, సంగీత దర్శకుడిగా, పాటల రచయితగా, ఎడిటర్‌గా ఇలా అన్ని క్రాఫ్ట్‌ల మీద పట్టు ఉన్న బహుముఖ ప్రజ్ఞాశాలిగా విజయ్ ఆంటోనీ పేరు తెచ్చుకున్నాడు.

బిచ్చగాడు సిరీస్‌తో

బిచ్చగాడు సినిమాతో తమిళ, తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న విజయ్ ఆంటోనీ రీసెంట్‌గా బిచ్చగాడు 2 మూవీతో అలరించాడు. మొన్నటికి మొన్న కొత్త మూవీని మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మార్గన్‌ను అనౌన్స్ చేసిన విజయ్ ఆంటోనీ ఇప్పుడు మరో న్యూ సినిమాను ప్రకటించారు.

విజయ్ ఆంటోనీ 26వ మూవీ

ప్రస్తుతం విజయ్ ఆంటోనీ తన కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. విజయ్ ఆంటోని కెరీర్‌లో 26వ సినిమాగా ఇది రానుంది. తన 26వ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రకటన చేశారు విజయ్ ఆంటోనీ. ‘లాయర్’గా విజయ్ ఆంటోని ఆడియెన్స్ ముందుకు రానున్నారు. తమిళంలో మంచి పేరు తెచ్చుకున్న సినిమా జెంటిల్ ఉమెన్.

తమిళ రైటర్ దర్శకత్వం

ఈ జెంటిల్ ఉమెన్‌ మూవీ రైటర్ జాషువా సేతురామన్ ‘లాయర్’ మూవీని తెరకెక్కిస్తున్నారు. అంటే, లాయర్ మూవీతో తమిళ రైటర్ డైరెక్టర్‌గా మారి డెబ్యూ ఇవ్వనున్నారు. జాషువా సేతురామన్ కథ, విజన్, మేకింగ్ మీద విజయ్ ఆంటోని ఎంతో నమ్మకంగా ఉన్నారు. ‘లాయర్’ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను తాజాగా రిలీజ్ చేశారు.

గ్రిప్పింగ్ కోర్ట్ రూమ్ డ్రామా

విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ నిర్మిస్తున్న లాయర్ మూవీ గ్రిప్పింగ్ కోర్ట్ డ్రామాగా రాబోతోంది. ఫాతిమా విజయ్ ఆంటోని కంపెనీ, విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్ మీద మీరా విజయ్ ఆంటోని సమర్పణలో విజయ్ ఆంటోని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు ఆల్రెడీ ప్రారంభం అయ్యాయి.

నాలుగు భాషల్లో రిలీజ్

లాయర్ రెగ్యులర్ షూటింగ్‌ జూన్ నుంచి ప్రారంభం కానుంది. లాయర్ నటీనటులు, సాంకేతిక బృందం, ఇతర అంశాలకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటిస్తారు. ఈ మూవీని తమిళ, తెలుగు, కన్నడ, హిందీ వంటి నాలుగు భాషల్లో విడుదల చేయనున్నారు.

విజయ్ ఆంటోనీ మేనల్లుడు విలన్

ఇదిలా ఉంటే, రీసెంట్‌గా ప్రకటించిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ మార్గన్‌ సినిమాకు లియో జాన్ పాల్ దర్శకత్వం వహించారు. ఇందులో విజయ్ ఆంటోనీ మేనల్లుడు అజయ్ దీషన్ విలన్‌గా చేస్తున్నాడు. ఈ సినిమాతోనే అజయ్ దీషన్‌ను విజయ్ ఆంటోనీ ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు.

రెండు సినిమాలతో

అంతేకాకుండా మార్గన్ సినిమాను కూడా విజయ్ ఆంటోనీ ఫిలింస్ కార్పొరేషన్ నిర్మిస్తుండగా, హీరో భార్య మీరా విజయ్ ఆంటోని సమర్పిస్తున్నారు. అయితే, మార్గన్ జూన్ 27న థియేటర్లలో విడుదల కానుండగా.. లాయర్ మూవీ రిలీజ్ డేట్‌ను ఇంకా ప్రకటించలేదు. మరి ఈ రెండు సినిమాలతో విజయ్ ఆంటోనీ ఎలాంటి పేరు తెచ్చుకుంటారో వేచి చూడాల్సిందే.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024