కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: కార్తీక్‌కు అవార్డు అంద‌జేసిన శివ‌న్నారాయ‌ణ -లాజిక్‌ల‌తో జ్యోత్స్న‌కు స్ట్రోక్ ఇచ్చిన దీప

Best Web Hosting Provider In India 2024

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: కార్తీక్‌కు అవార్డు అంద‌జేసిన శివ‌న్నారాయ‌ణ -లాజిక్‌ల‌తో జ్యోత్స్న‌కు స్ట్రోక్ ఇచ్చిన దీప

Nelki Naresh HT Telugu

కార్తీక దీపం 2 మే 21 ఎపిసోడ్‌లో అగ్రిమెంట్‌ను అడ్డం పెట్టుకొని రెస్టారెంట్ ఆఫ్ ది ఇయ‌ర్ అవార్డును కార్తీక్ బ‌దులుగా తాను అందుకోవాల‌ని వ‌చ్చిన జ్యోత్స్న‌కు దీప పెద్ద షాకిస్తుంది. శివ‌న్నారాయ‌ణ చేతుల మీదుగానే కార్తీక్‌, దీప క‌లిసి ఆ అవార్డు అందుకుంటారు.

కార్తీక దీపం 2 మే 21 ఎపిసోడ్‌

రెస్టారెంట్ ఆఫ్ ది ఇయ‌ర్ అవార్డు కార్తీక్ అందుకుంటాడ‌నే సంతోషంలో ఉంటుంది దీప‌. స్టేజ్‌పైకి వ‌చ్చిన కార్తీక్ అవార్డు అందుకోబోయేది తాను కాదు జ్యోత్స్న అని ప్ర‌క‌టిస్తాడు. కార్తీక్ మాట‌లు విని దీప షాక‌వుతుంది. స‌త్య‌రాజ్ రెస్టారెంట్ బాధ్య‌త‌లు జ్యోత్స్న‌వేన‌ని, అవార్డు కూడా తానే తీసుకుంటుంద‌ని స్టేజ్‌పై కార్తీక్ ప్ర‌క‌టిస్తాడు. ఏం చేశావు…కార్తీక్‌కు ఏం చెప్పి మార్చేశావ‌ని కోపంగా జ్యోత్స్న‌ను నిల‌దీస్తుంది దీప‌. ఇప్పుడు మ‌నిషినే మార్చాను. రేపు నీ స్థానాన్ని మారుస్తాను. జ‌రిగేది చూడ‌టం త‌ప్ప నీకు వేరే ఆప్ష‌న్ లేద‌ని దీప‌కు బ‌దులిస్తుంది జ్యోత్స్న‌.

కార్తీక్ చేతుల మీదుగా అవార్డు….

స్టేజ్‌పైకి వ‌చ్చి రెస్టారెంట్ ఆఫ్ ది ఇయ‌ర్ అవార్డును మా బావ కార్తీక్ చేతుల మీదుగా అందుకోవాల‌ని అనుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టిస్తుంది జ్యోత్స్న‌. నిర్వ‌హ‌కులు ఆ అవార్డును కార్తీక్ చేతుల మీదుగా జ్యోత్స్న‌కు అంద‌జేస్తారు. స్టేజ్‌పైనే కార్తీక్‌కు ఐ ల‌వ్ యూ చెబుతుంది జ్యోత్స్న‌. ఈ రోజు అవార్డు ఇచ్చిన‌ట్లే రేపు నీ ప‌క్క‌న భార్య స్థానాన్ని ఇస్తావు. ఇచ్చేలా చేస్తాన‌ని జ్యోత్స్న అంటుంది.

అవార్డ్ విన్న‌ర్ నేనే…

ఇంత‌లో కార్తీక్ అని గ‌ట్టిగా పిలుపు వినిపించ‌డంతో క‌ల‌లో నుంచి జ్యోత్స్న బ‌య‌ట‌కు వ‌స్తుంది. ఈ క‌ల‌ను ఎలాగైనా నిజం చేసుకోవాల‌ని అనుకుంటుంది. కార్తీక్ బ‌దులుగా జ్యోత్స్న స్టేజ్‌పైకి వెళుతుంది. అవార్డ్ విన్న‌ర్‌ను నేనే అని అంటుంది. స‌త్య‌రాజ్ రెస్టారెంట్ ఇప్పుడు మాది. ఈ అవార్డు కూడా మాదేన‌ని స్టేజ్‌పై జ్యోత్స్న అంటుంది.

విజేత నేను కాదు…

కానీ అవార్డు నిర్వ‌హ‌కులు మాత్రం ఆ అవార్డ్ కార్తీక్‌దేన‌ని అంటారు. కార్తీక్ స్టేజ్‌పైకి వ‌చ్చి అవార్డుపై క్లారిటీ ఇస్తాడ‌ని జ్యోత్స్న చెబుతుంది. ఈ అవార్డు అందుకోబోయేది నేను కాదు మిస్ జ్యోత్స్న అని కార్తిక్ ప్ర‌క‌టిస్తాడు. ఈ అవార్డు కోసం జ్యోత్స్న పేరును అనౌన్స్ చేయ‌మ‌ని అంటాడు. అవార్డు నీ భ‌ర్త అందుకోక‌పోతే ఆ బాధ జీవితాంతం ఉంటుంద‌ని దీప‌తో అంటుంది కాంచ‌న‌.

స్టేజ్‌పైకి దీప‌…

జ్యోత్స్న‌కే అవార్డు ఇవ్వ‌బోతున్న‌ట్లు నిర్వ‌హ‌కులు ప్ర‌క‌టిస్తుండ‌గా దీప అడ్డుకుంటుంది. స్టేజ్‌పైకి వ‌స్తుంది. నేనే స్టేజ్ ఎక్క‌డం ఇదే మొద‌టిసారి…ఎలా మాట్లాడాలో తెలియ‌క‌పోయినా ఏం మాట్లాడాలో తెలుసు అని దీప అంటుంది. స‌త్య‌రాజ్ రెస్టారెంట్ న‌డుపుతుంది కార్తీక్ అయితే అవార్డు మీరు ఎలా తీసుకుంటార‌ని జ్యోత్స్న‌ను అడుగుతుంది దీప‌.

ఇప్పుడు రెస్టారెంట్‌లో కార్తీక్‌తో పాటు తాను పార్ట‌న‌ర్ అని జ్యోత్స్న స‌మాధాన‌మిస్తుంది. ఐదు రోజుల క్రితం రెస్టారెంట్ బాధ్య‌త‌ల‌ను త‌న‌కు కార్తీక్‌ బ‌దిలీ చేశాడ‌ని చెబుతుంది. లాస్ట్ వ‌న్ ఇయ‌ర్‌గా క్వాలిటీ, రేటింగ్‌ను దృష్టిలో పెట్టుకొని స‌త్య‌రాజ్ రెస్టారెంట్‌కు ఈ అవార్డును అనౌన్స్ చేశామ‌ని నిర్వ‌హ‌కులు అంటారు.

శివ‌న్నారాయ‌ణ చెప్పాలి…

మూత‌ప‌డేందుకు సిద్ధంగా ఉన్న రెస్టారెంట్ నంబ‌ర్ వ‌న్ ప్లేస్‌లో నిల‌బెట్టిన కార్తీక్‌కు అవార్డు ఇస్తారా? ఐదు రోజుల క్రితం పార్ట్‌న‌ర్‌షిప్ తీసుకున్న జ్యోత్స్న‌కు ఇస్తారా? గౌర‌వంగా ఈ అవార్డు ఎవ‌రికి ఇవ్వాలో శివ‌న్నారాయ‌ణ గానే చెప్పాల‌ని దీప అంటుంది. ఇంత‌కుమించిన అవ‌మానం ఉండ‌మ‌ని, దీప‌ను స్టేజ్ దిగ‌మ‌ని దీప‌తో అంటుంది జ్యోత్స్న‌. కార్తీక్‌తో పాటు అవార్డును తీసుకొని స్టేజ్‌పై నుంచి నేనే దిగి వెళ్లిపోతాన‌ని దీప ఆన్స‌ర్ ఇస్తుంది.

కారీక్త్‌కు అవార్డు ఇవ్వాలి…

న్యాయంగా ఈ అవార్డ్ ఎవ‌రికి ఇవ్వాల‌ని శివ‌న్నారాయ‌ణ‌ను అడుగుతుంది దీప‌. మిగిలిన పెద్ద‌లు ఏదంటే అదేన‌ని శివ‌న్నారాయ‌ణ అంటాడు. పెద్ద‌లంతా న్యాయంగా కార్తీక్‌కే అవార్డు ఇవ్వాల‌ని అంటారు. వేడుక‌కు వ‌చ్చిన ఆహుతులు కూడా కార్తీక్‌కే అవార్డు ఇవ్వాల‌ని నినాదాలు చేస్తారు.

న్యాయ‌ప్ర‌కారం ఈ అవార్డు కార్తీక్‌కే ఇవ్వాల‌ని శివ‌న్నారాయ‌ణ ప్ర‌క‌టించ‌డంతో జ్యోత్స్న కూడా షాక‌వుతుంది. శివ‌న్నారాయ‌ణ మాట‌ల‌తో కాంచ‌న‌, అన‌సూయ సంబ‌ర‌ప‌డ‌తారు. తాత‌పై ఫైర్ కాబోతోంది జ్యోత్స్న‌. నువ్వు నోర్మూయ్. ఏది చేసిన ఇంతే. జ‌నాల్లో న‌వ్వుల పాలు చేయ‌డ‌మే నీ ప‌ని అంటూ జ్యోత్స్న‌పై కోప్ప‌డుతాడు.

మ‌న‌వ‌డికి అవార్డు…

ఈ అవార్డును మీ చేతుల మీదుగానే కార్తీక్‌కు ఇవ్వాల‌ని మ‌రోసారి శివ‌న్నారాయ‌ణ‌ను ఇరికించేస్తుంది దీప‌. మీ మ‌న‌వ‌డికి మీ చేతుల మీదుగానే అవార్డు ఇవ్వండి అని స‌త్య‌రాజ్ అంటాడు.

ఏంటి నువ్వేమి మాట్లాడ‌వు అని కార్తీక్‌పై కోపాన్ని ప్ర‌ద‌ర్శిస్తుంది దీప‌. న్యాయ‌నిర్ణేత మీ తాతే క‌దా…అవార్డు నీకే ఇవ్వ‌మ‌ని చెప్పొచ్చు క‌దా అని కార్తీక్ వెట‌కారంగా అంటాడు. దీనికి నీకు కౌంట‌ర్ ఉంటుంద‌ని కార్తీక్‌కు వార్నింగ్ ఇస్తుంది జ్యోత్స్న‌. దీప పిల‌వ‌డంతో జ్యోత్స్న‌ను ప‌క్క‌కు నెట్టేసి అవార్డు అందుకోవ‌డానికి ముందుకొస్తాడు కార్తీక్‌.

దీప కార‌ణం…

అంద‌రూ క‌లిసి అవార్డు నాకే ఇవ్వ‌డం న్యాయ‌మ‌ని అన్నారు…కానీ ఇక్క‌డ జ‌రిగే న్యాయంలోనే ఓ అన్యాయం జ‌రిగింద‌ని కార్తీక్ అంటాడు. స‌త్య‌రాజ్ రెస్టారెంట్ నంబ‌ర్ వ‌న్ పోజిష‌న్‌లో ఉండ‌టానికి తాను ఒక్క‌డినే కార‌ణం కాద‌ని కార్తీక్ చెబుతాడు. నాకే న‌మ్మ‌కం లేని చోట నాకు ధైర్యం చెప్పి, నేనేంటో గుర్తుచేసి న‌న్ను ముందుకు న‌డిపించిన మ‌నిషి దీప అని కార్తీక్ చెబుతాడు.

ప్రేమ కోసం త‌ప్ప పేరు కోసం దీప ఏనాడు తాప‌త్ర‌య‌ప‌లేద‌ని అంటాడు. దీప‌పై కార్తీక్ కురిపిస్తున్న పొగ‌డ్త‌లు విని శివ‌న్నారాయ‌ణ‌, జ్యోత్స్న స‌హించ‌లేక‌పోతారు.

నా విజ‌యంలో దీప ఉంది…

పెద్ద స‌వాల్‌ను ఎదుర్కొని, స‌ర్వం కోల్పోయి…ఓడిపోవ‌డం త‌ప్ప వేరే దారిలేని చీక‌ట్లో నాకు వెలుగై దీప నిల‌బ‌డింద‌ని కార్తీక్ అంటాడు. ఈ రోజు వ‌ర‌కు త‌నే నా చేయి ప‌ట్టుకొని ఓట‌మి వాకిట్లో నిల‌బ‌డ్డ న‌న్ను గెలుపు వేదిక‌పై నిల‌బెట్టింది. నా విజ‌యం వెనుక కాదు…నా విజ‌యంలోనే నా భార్య దీప ఉంద‌ని అంటాడు.

కార్తీక్ మాట‌ల‌తో ఆహుతులు అంద‌రూ చ‌ప్ప‌ట్లు కొట్టి దీప‌ను అభినందిస్తారు. నేను వేసిన ప్ర‌తి అడుగులో దీప ఉంద‌ని కార్తీక్ అంటాడు. మేము బాధ‌లు, క‌ష్టాలు, ఆనందాలు అన్ని పంచుకున్నాం. ఈ అవార్డును పంచుకుంటామ‌ని, నేను దీప క‌లిసి ఈ అవార్డును తీసుకుంటామ‌ని కార్తీక్ చెబుతాడు.

దీప ఎమోష‌న‌ల్‌…

ఇది కేవ‌లం అవార్డు మాత్ర‌మే కాద‌ని త‌న త‌ల్లి ఆత్మ‌గౌర‌వం, నా భార్య ఆత్మాభిమానం, నా ఆత్మ‌విశ్వాసం అని కార్తీక్ ప్ర‌క‌టిస్తాడు. కార్తీక్ మాట‌ల‌తో దీప‌ ఆనందంతో ఎమోష‌న‌ల్ అవుతుంది. మీ చేతుల మీదుగానే కార్తీక్‌, దీప‌కు అవార్డు ఇవ్వ‌మ‌ని నిర్వ‌హ‌కులు అంటారు. కొన్ని త‌ప్ప‌వు…ఇష్టం లేక‌పోయినా చేయాల్సిందేన‌ని శివ‌న్నారాయ‌ణ అంటాడు. దీప‌, కార్తీక్‌ల‌కు అవార్డు ఇస్తాడు.

ఛాలెంజ్‌లో గెలిచిన కార్తీక్…

ఆ సీన్ చూసి కాంచ‌నతో పాటు అన‌సూయ కుటుంబ‌స‌భ్యులు ఆనంద‌ప‌డ‌తారు. అవార్డును చూడ‌గానే తాత‌తో తాను చేసిన ఛాలెంజ్ కార్తీక్ గుర్తొస్తుంది. నేను గెలిచాన‌ని నువ్వే ఒప్పుకోవ‌డం, నువ్వే అవార్డు ఇవ్వ‌డం ఆనందంగా ఉంద‌ని శివ‌న్నారాయ‌ణ‌తో కార్తీక్ అంటాడు. కార్తీక్ మాట‌ల‌తో కోపంగా జ్యోత్స్న‌ను తీసుకొని అక్క‌డి నుంచి వెళ్లిపోతాడు శివ‌న్నారాయ‌ణ‌. అక్క‌డితో నేటి కార్తీక దీపం సీరియ‌ల్ ముగిసింది.

నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024