వచ్చే నెలలో ఓటీటీలోకి రాబోతున్న టాప్ 5 మలయాళం మూవీస్ ఇవే.. రూ.230 కోట్ల బ్లాక్‌బస్టర్ కూడా..

Best Web Hosting Provider In India 2024

వచ్చే నెలలో ఓటీటీలోకి రాబోతున్న టాప్ 5 మలయాళం మూవీస్ ఇవే.. రూ.230 కోట్ల బ్లాక్‌బస్టర్ కూడా..

Hari Prasad S HT Telugu

వచ్చే నెలలో ఓటీటీలోకి కొన్ని ఇంట్రెస్టింగ్ మలయాళం సినిమాలు స్ట్రీమింగ్ కు రాబోతున్నాయి. వాటిలో మోహన్ లాల్ నటించిన రూ.230 కోట్ల వసూళ్ల మూవీ తుడరుమ్ కూడా ఉంది. మరి మిగిలిన మూవీస్ ఏవి? ఎక్కడ చూడాలో తెలుసుకోండి.

వచ్చే నెలలో ఓటీటీలోకి రాబోతున్న టాప్ 5 మలయాళం మూవీస్ ఇవే.. రూ.230 కోట్ల బ్లాక్‌బస్టర్ కూడా..

మలయాళం ఇండస్ట్రీ ఈ ఏడాది ఇప్పటికే రెండు రూ.200 కోట్ల వసూళ్లు దాటిన బ్లాక్‌బస్టర్ సినిమాలను అందించింది. మరిన్ని మూవీస్ ను తీసుకురాబోతోంది. అయితే ఇప్పటికే థియేటర్లలో రిలీజైన వాటిలో జూన్ నెలలో ఓటీటీలోకి అడుగుపెట్టబోతున్న మూవీస్ ఏవో ఒకసారి చూద్దాం. జియోహాట్‌స్టార్, ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ లాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లోకి ఈ సినిమాలు రాబోతున్నాయి.

తుడరుమ్ – జియోహాట్‌స్టార్

మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన మూవీ తుడరుమ్. తరుణ్ మూర్తి డైరెక్ట్ చేసిన ఈ థ్రిల్లర్ సినిమా ఇప్పటికే బాక్సాఫీస్ దగ్గర సుమారు రూ.230 కోట్ల వరకూ వసూలు చేసింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను జియోహాట్‌స్టార్ సొంతం చేసుకుంది. జూన్ నెలలోనే మూవీ స్ట్రీమింగ్ కానుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. జియోహాట్‌స్టార్ లోనే ఈ ఏడాది మోహన్ లాల్ అందించిన మరో బ్లాక్‌బస్టర్ ఎల్2: ఎంపురాన్ కూడా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే.

అలప్పుళ జింఖానా

ప్రేమలు మూవీ ఫేమ్ నస్లేన్ లీడ్ రోల్లో నటించిన స్పోర్ట్స్ డ్రామా ఈ అలప్పుళ జింఖానా. ఎగ్జామ్ లో ఫెయిలైన కొందరు ప్లస్ టూ స్టూడెంట్స్.. స్పోర్ట్స్ కోటా ద్వారా కాలేజీలో అడ్మిషన్ కోసం చేసే ప్రయత్నం చుట్టూ తిరిగే మూవీ ఇది. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ సాధించింది. జియోహాట్‌స్టార్ లేదా ప్రైమ్ వీడియోలోకి జూన్ నెలలో ఈ సినిమా వచ్చే అవకాశం ఉంది.

బజూకా

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ బజూకా. డీనో డెన్నిస్ డైరెక్ట్ చేశాడు. ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా రెస్పాన్స్ రాలేదు. ఈ మూవీ జీ5 ఓటీటీలోకి జూన్ 5న వచ్చే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఏదీ రాలేదు.

డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్

మమ్ముట్టి నటించిన మరో మూవీ డొమినిక్ అండ్ లేడీస్ పర్స్. ఎప్పుడో జనవరి 23న థియేటర్లలో రిలీజైంది. ఇప్పటికీ ఓటీటీలోకి రాలేదు. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. అయితే మేకర్స్ తో ఫైనల్ డీల్ ఇంకా కుదరకపోవడంతో రిలీజ్ చేయలేదు. జూన్ మొదటి వారంలో వచ్చే అవకాశం ఉంది.

సర్కీట్

మలయాళ స్టార్ హీరో ఆసిఫ్ అలీ నటించిన మూవీ సర్కీట్ (Sarkeet). మే 8వ తేదీని థియేటర్లలో రిలీజైంది. యూఏఈలో ఉంటూ ఏడీహెచ్‌డీతో బాధపడుతున్న తమ కొడుకును పోషించలేని ఓ మలయాళీ జంట చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. ఆ పిల్లాడు ఓ నిరుద్యోగిని కలిసిన తర్వాత కథ మరో మలుపు తిరుగుతుంది. ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా రెస్పాన్స్ రావడం లేదు. ఈ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్, రిలీజ్ డేట్ జూన్ లోనే బయటకు రాబోతున్నాయి.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024