





Best Web Hosting Provider In India 2024

ఓటీటీలోకి తెలుగు టెక్నో థ్రిల్లర్ మూవీ – సినిమా మొత్తం కంప్యూటర్ స్క్రీన్స్‌తోనే – ఐఎమ్‌డీబీలో 8.6 రేటింగ్
తెలుగు టెక్నో థ్రిల్లర్ మూవీ వైరల్ ప్రపంచం ఓటీటీలోకి వస్తోంది. మే 23 నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. కంప్యూటర్ స్క్రీన్స్ ఆధారంగానే సాగే ఈ మూవీలో నిత్యా శెట్టి, సాయిరోనక్ హీరోహీరోయిన్లుగా నటించారు.
తెలుగు టెక్నో థ్రిల్లర్ మూవీ వైరల్ ప్రపంచం థియేటర్లలో రిలీజైన రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. మే 23 నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌ను సన్ నెక్స్ట్ అఫీషియల్‌గా ప్రకటించింది. ఓ పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
వైరల్ ప్రపంచం మూవీలో సాయి రోనక్, నిత్యా శెట్టి, ప్రియాంక శర్మ, సన్నీ నవీన్ కీలక పాత్రల్లో నటించారు. బ్రిజేష్ తండి ఈ మూవీకి దర్శకత్వం వహించాడు.
రన్‌టైమ్ 97 నిమిషాలే..
మార్చి ఫస్ట్ వీక్‌లో వైరల్ ప్రపంచం మూవీ థియేటర్లలో రిలీజైంది. ఈ మూవీ రన్ టైమ్ కేవలం 97 నిమిషాలే కావడం గమనార్హం. కంప్యూటర్స్ స్క్రీన్స్ ఆధారంగానే ఈ సినిమా మొత్తం సాగుతుంది. హీరోహీరోయిన్ల వీడియో కాల్స్ మాట్లాడుకోవడం చుట్టూనే కథను నడిపించారు దర్శకుడు. ప్రయోగాత్మకంగా తెరకెక్కిన ఈ మూవీ ఐఎమ్‌డీబీలో 8.6 రేటింగ్‌ను సొంతం చేసుకున్నది.
సోషల్ మీడియా మాయలో…
ఇంటర్నెట్, సోషల్ మీడియా మాయలో పడి యువత ఎలా మోసపోతున్నారు? యువతులు, మహిళలకు టార్గెట్ చేస్తూ సైబర్ నేరగాళ్లు ఎలాంటి కుట్రలు పన్నుతున్నారు అన్నది థ్రిల్లింగ్‌గా చూపిస్తూనే ఈ మూవీ ద్వారా మెసేజ్ ఇచ్చారు డైరెక్టర్. వైరల్ ప్రపంచం మూవీకి గ్యానీ మ్యూజిక్ అందించాడు.
స్వప్న అమెరికావెళ్లడంతో ప్రియుడు రవికి దూరమవుతుంది. సోషల్ మీడియా ద్వారానే ఇద్దరు టచ్‌లో ఉంటారు. మరోవైపు అదితి సోషల్ మీడియాలో పరిచయమైన ప్రవీణ్‌ను ఇష్టపడుతుంది. వీడియో కాల్స్, చాటింగ్‌ల ద్వారా అదితి, స్వప్న తమ ప్రియులతో ప్రేమాయణం సాగిస్తుంటారు.
ఇంటర్నెట్‌ను నమ్ముకున్న వారి జీవితాల్లో అనుకోకుండా ఊహించని మలుపులు తిరుగతాయి? అవేమిటి? అదితి, స్వప్న జీవితాలకు సంబంధించి కీలకమైన సమాచారాలు ఇంటర్నెట్‌లో ఎవరు పెట్టారు అన్నదే ఈ మూవీ కథ.
చైల్డ్ యాక్టర్‌గా…
చైల్డ్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది నిత్యా శెట్టి. దేవుళ్లు, చిన్ని చిన్ని ఆశ, లిటిల్ హార్ట్స్, అంజితో పాటు పలు సినిమాల్లో బాల నటిగా కనిపించింది. రెండు నంది అవార్డులను అందుకున్నది. ఓ పిట్ల కథ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.
హీరోగా సినిమాలు…
మరోవైపు సక్సెస్ ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా తెలుగులో హీరోగా వరుసగా సినిమాలు చేస్తోన్నాడు సాయిరోనక్. లంక, ప్రెషర్ కుక్కర్, రాజయోగం, పాప్‌కార్న్, లగ్గం, రీవైండ్‌తో పాటు పలు సినిమాలు చేశాడు.
సంబంధిత కథనం