




Best Web Hosting Provider In India 2024

ప్రజాపాలనలో కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేశారా..? స్టేటస్ ఇలా తెలుసుకోండి
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నడుస్తోంది. అయితే చాలా మంది ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో కొత్త మంది పేర్లకు ఆమోదం రాగా.. చాలా మందివి పరిశీలిస్తున్నారు. అయితే దరఖాస్తుదారులు వారి వివరాలను స్థానిక అధికారులను ఆశ్రయించి.. తెలుసుకోవచ్చు.
తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు మంజూరవుతున్నాయి. ఇప్పటికే పలువురికి కొత్త కార్డులు వస్తుండగా… మరికొందరి పేర్లను పాత కార్డుల్లోకి ఎంట్రీ చేస్తున్నారు. మరోవైపు పేర్ల తొలగింపు ప్రక్రియ కూడా కొనసాగుతోంది. అయితే చాలా మంది కొత్త కార్డుల కోసం ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమం ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. ఇదంతా కూడా ఆఫ్ లైన్ ద్వారా సాగింది. అయితే దరఖాస్తుదారులు వారి స్టేటస్ వివరాలను తెలుసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు.
కొత్త రేషన్ కార్డుల కోసం ప్రభుత్వం ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరించింది. ఆ తర్వాత మీసేవా ద్వారా అవకాశం కల్పించింది. మీసేవాలో అప్లికేషన్ చేసుకున్న వారికి అప్లికేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది. దీనితో సులభంగా వారి అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకుంటున్నారు. కానీ ప్రజాపాలన(ఆఫ్ లైన్)లో దరఖాస్తులు చేసుకున్న వారికి మాత్రం ఆ ఛాన్స్ లేకుండా పోయింది. దీంతో చాలా మంది దరఖాస్తుదారులు వారి వివరాలను తెలుసుకునేందుకు ఇబ్బందిపడుతున్నారు.
స్టేటస్ ఎక్కడ తెలుసుకోవాలంటే..?
ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారు రేషన్ కార్డుల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. అర్హతలు ఉన్న ప్రతి ఒక్కరికి కార్డు మంజూరవుతుందని స్పష్టం చేస్తున్నారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారు…. పంచాయతీ కార్యదర్శలను సంప్రదించవచ్చు. అక్కడ వివరణ తీసుకున్న తర్వాత…. ఏమైనా సందేహాలు ఉంటే స్థానికంగా ఉండే మండల అధికారులను సంప్రదిస్తే మీ దరఖాస్తు ఏ స్థితిలో ఉందనేది తెలుస్తుంది.
కొనసాగుతున్న వెరిఫికేషన్…..
ప్రజాపాలనలో స్వీకరించిన దరఖాస్తులను ఆన్ లైన్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా జిల్లాల్లో ఈ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఆన్ లైన్ చేసిన వారి దరఖాస్తులపై రెవెన్యూ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో సర్వే చేస్తున్నారు. గ్రామ స్థాయిలో ఆన్ లైన్ ప్రక్రియంతా కూడా పంచాయతీ కార్యదర్శులు చూస్తున్నారు. ఆన్ లైన్ అయిన తర్వాత…. క్షేత్రస్థాయిలో విచారణ జరుపుతున్నారు. ఆపై మండల స్థాయిలోతహసీల్దార్ లాగిన్ చేరుతుంది.
మండల స్థాయిలో ఆమోదం తెలపగానే జిల్లా పౌరసరఫరాల అధికారి లాగిన్‌కు చేరుతుంది. జిల్లా కలెక్టర్ ఆమోదంతో కార్డులు మంజూరు చేసి ప్రభుత్వానికి నివేదిక అందిస్తారు. ఇప్పటికప్పుడు ఈ ప్రక్రియ జరుగుతోంది. అఫ్రూవ్ అయిన వాటికి తదుపరి నెలలో రేషన్ దుకాణాల ద్వారా బియ్యం కేటాయిస్తున్నారు.
కొత్త కార్డు వివరాలను ఎక్కడ చెక్ చేసుకోవాలంటే..
కొత్త రేషన్ కార్డు పొందినవాళ్లు లేదా పాత కార్డులో పేర్లు నమోదైన వారు… వారి వివరాలను ఆన్ లైన్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ముందుగా https://epds.telangana.gov.in/FoodSecurityAct/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఎఫ్ఎస్ సీ సెర్చ్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ రేషన్ కార్డు సెర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపై క్లిక్ చేస్తే FSC సెర్చ్ అనే ఆప్షన్ డిస్ ప్లే అవుతుంది. దీనిపై క్లిక్ చేసి FSC Ref No నెంబర్ లేదా మీ రేషన్ కార్డు నెంబర్ ను ఎంట్రీ చేసి జిల్లాను ఎంచుకోవాల్లి. చివర్లో ఉండే సెర్చ్ పై క్లిక్ చేస్తే మీ కార్డు వివరాలను కింద డిస్ ప్లే అవుతాయి.
సంబంధిత కథనం
టాపిక్