మరో ఓటీటీలోకి వస్తున్న తెలుగు యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. ఇంకా రెండు రోజులే..

Best Web Hosting Provider In India 2024

మరో ఓటీటీలోకి వస్తున్న తెలుగు యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. ఇంకా రెండు రోజులే..

Hari Prasad S HT Telugu

తెలుగు యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు మరో ఓటీటీలోకి వస్తోంది. ఇప్పటికే ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. మరో రెండు రోజుల్లో రెండో ఓటీటీలోకి అడుగుపెట్టబోతోంది. ఆ వివరాలేంటో చూడండి.

మరో ఓటీటీలోకి వస్తున్న తెలుగు యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. ఇంకా రెండు రోజులే..

నందమూరి కల్యాణ్ రామ్, విజయశాంతి తల్లీకొడుకులుగా నటించిన మూవీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి. గత నెల 18న థియేటర్లలో రిలీజైన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. నెల రోజుల్లోపే అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఇప్పుడీ సినిమా మరో ఓటీటీలోకి కూడా వస్తోంది. ఒకవేళ ప్రైమ్ వీడియో సబ్‌స్క్రిప్షన్ లేని వాళ్లు ఇందులో ఆ సినిమా చూడొచ్చు.

ఆహా వీడియో ఓటీటీలోకి..

కల్యాణ్ రామ్, విజయశాంతి నటించిన తెలుగు యాక్షన్ థ్రిల్లర్ మూవీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి ఆహా వీడియో ఓటీటీలోకి వస్తోంది. శుక్రవారం (మే 23) నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆ ఓటీటీ తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. “ఓ పోలీస్ అధికారిణి కొడుకే ఓ చట్టంగా మారితే ఏం జరుగుతుంది? న్యాయం, తిరుగుబాటు, రక్త సంబంధాల గ్రిప్పింగ్ స్టోరీ. అర్జున్ సన్నాఫ్ వైజయంతి మే 23న ఆహాలో ప్రీమియర్ కానుంది” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది.

అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ మే 12వ తేదీనే ప్రైమ్ వీడియోలోకి అడుగుపెట్టింది. మొదట్లో విదేశాల్లోనే అందుబాటులోకి వచ్చిన ఈ సినిమా తర్వాత ఇండియన్ వ్యూయర్స్ కూడా చూసే అవకాశం లభించింది. ప్రస్తుతం ప్రైమ్ వీడియో టాప్ ట్రెండింగ్ లో 5వ స్థానంలో ఉంది. ఈ మూవీకి 5.2 ఐఎండీబీ రేటింగ్ నమోదైంది. అంటే జనాలకు పెద్దగా నచ్చలేదని చెప్పొచ్చు.

అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ గురించి..

ప్రదీప్ చిల్కూరి డైరెక్ట్ చేసిన మూవీ ఈ అర్జున్ సన్నాఫ్ వైజయంతి. కల్యాణ్ రామ్‌కు జోడీగా సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించింది. బాలీవుడ్ పాపులర్ యాక్టర్స్ అర్జున్ రాంపాల్, సోహైల్ ఖాన్ కూడా ఉన్నారు. అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాను కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్ కు మదర్ సెంటిమెంట్ యాడ్ చేసి తెరకెక్కించారు.

ఓ నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్, గ్యాంగ్‌స్టర్‌గా కొడుకు, అతన్ని ఇంట్లో వాళ్లు చీదరించుకోవడం, చివరికి అతని గొప్పతనం తెలిసి దగ్గరకు తీసుకోవడం అనేది రొటీన్ ఫార్ములానే. అయితే ఈ రొటీన కథను కాస్త భిన్నంగా చెప్పడంలో డైరెక్టర్ సక్సెసయ్యాడు. క్లైమాక్స్ మాత్రం ఎవరూ ఊహించని ఒక షాక్ ఫ్యాక్టర్‌తో రాసుకున్నాడు డైరెక్టర్. ఈ సినిమా ఇదే పెద్ద బలం అని చెప్పొచ్చు.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024