





Best Web Hosting Provider In India 2024

మోహన్‌లాల్ నుంచి రూ.1000 కోట్ల సినిమా వచ్చినట్లేనా.. వృషభ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్‌పై ఫ్యాన్స్ రియాక్షన్
మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ నుంచి రూ.1000 కోట్ల సినిమా వచ్చేస్తోందని అంటున్నారు ఫ్యాన్స్. తన బర్త్‌డే రోజు మోస్ట్ అవేటెడ్ మూవీ వృషభ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో ఫ్యాన్స్ ఇలా రియాక్టవుతున్నారు.
మోహన్‌లాల్ మోస్ట్ అవేటెడ్ మూవీ వృషభ వచ్చేస్తోంది. తన 65వ పుట్టిన రోజునాడు ఈ సూపర్ స్టార్ ఈ ప్రతిష్టాత్మక సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాడు. నంద కిశోర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను ఏక్తా కపూర్ నిర్మిస్తోంది. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భంగా మూవీ నుంచి తన ఫస్ట్ లుక్ ను కూడా అతడు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు.
వృషభ రిలీజ్ డేట్
మోహన్‌లాల్ బుధవారం (మే 21) తన 65వ పుట్టిన రోజు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా వృషభ మూవీ మోషన్ పోస్టర్ ను తన ఎక్స్ అకౌంట్లో షేర్ చేశాడు. “ఇది ప్రత్యేకం. నా అభిమానులకు అంకితం. ఎదురు చూపులు ఫలించాయి. తుఫాను ప్రారంభమైంది. గర్వం, శక్తితో నేను వృషభ ఫస్ట్ లుక్ ను ఆవిష్కరిస్తున్నాను. మీ మనసు తాకే సినిమా ఇది.
నా పుట్టిన రోజునాడే లాంచ్ చేయడం దీనిని మరింత ప్రత్యేకంగా మార్చేసింది. మీ ప్రేమే నాకెప్పుడూ గొప్ప బలం. వృషభ అక్టోబర్ 16 నుంచి థియేటర్లలో..” అని మోహన్ లాల్ ట్వీట్ చేశాడు. ఈ పోస్టర్ లో మోహన్ లాల్ పొడవైన జుట్టుతో చేతిలో ఖడ్గంతో యుద్ధానికి సిద్ధమవుతున్న యోధుడిలా కనిపిస్తున్నాడు.
వెయ్యి కోట్ల సినిమా వచ్చేస్తోంది
వృషభ అనౌన్స్‌మెంట్ తో ఫ్యాన్స్ చాలా ఉత్సాహంగా ఉన్నారు. తొలి రూ.1000 కోట్ల సినిమా వస్తోంది అంటూ ఓ అభిమాని కామెంట్ చేయడం విశేషం. ఈసారి మంచి వీఎఫ్ఎక్స్ వాడండి అంటూ మరో ఫ్యాన్ అన్నాడు. మలయాళం నుంచి వస్తున్న తొలి రూ.1000 కోట్ల మూవీ అంటూ ఇంకొకరు అభిప్రాయపడ్డారు. చాలా మంది ఫైర్, హార్ట్ ఎమోజీలతో కామెంట్స్ చేశారు.
2023లోనే వృషభ సినిమాను అనౌన్స్ చేశారు. నంద కిశోర్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తుండగా.. ఏక్తా కపూర్ నిర్మిస్తోంది. షనాయా కపూర్, రోషన్ మేక, గరుడ రామ్, సిమ్రన్, శ్రీకాంత్ లాంటి వాళ్లు నటిస్తున్నారు. దేవి శ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే షూటింగ్ పూర్తి చేసుకుంది. అక్టోబర్ 16న తెలుగుతోపాటు ఇతర భాషల్లో రిలీజ్ కానుంది.
సంబంధిత కథనం
టాపిక్