





Best Web Hosting Provider In India 2024

ఫిల్టర్ కాఫీ పానీయం కాదు.. ఒక ఎమోషన్, ఇదంటే అందరికీ ఎందుకంత ఇష్టం? దీన్ని తాగడం వల్ల ఏం జరుగుతుంది?
ఫిల్టర్ కాఫీ పేరు చెబితేనే ఎంతోమంది కాఫీ ప్రియులకు నోరూరిపోతుంది. సాధారణ కాఫీతో పోలిస్తే ఫిల్టర్ కాఫీ అద్భుతంగా ఉంటుంది. దీనివల్ల కలిగే ప్రయోజనాలు కూడా ఎక్కువే.
ఉదయం అయితే చాలు కాఫీ లేదా టీ పొట్టలో పడాల్సిందే… అప్పుడే రోజు మొదలుపెట్టేవారు ఎక్కువ. అయితే ఈ మధ్య టీ కన్నా కాఫీ ప్రియులు పెరిగిపోతున్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ పానీయాలలో కాఫీ కూడా ఒకటి. అయితే కాఫీలలో ఎన్నో రకాలు ఉన్నాయి. అందులో ఫిల్టర్ కాఫీ ఒకటి. ప్రతి ఒక్కరూ ఫిల్టర్ కాఫీని ఎంతో ఇష్టపడతారు. ఇది రిఫ్రెషింగ్ రుచిని అందిస్తుంది. దీని వాసనకి మెదడు మైమరిచిపోతుంది.
సాధారణ ప్రజలే కాదు బాలీవుడ్ స్టార్లు, సెలబ్రిటీలు ఎంతోమందికి ఫిల్టర్ కాఫీ అంటే ప్రాణం. అంతెందుకు బాలీవుడ్ సూపర్ హీరోయిన్ దీపికా పదుకొనే ఫిల్టర్ కాఫీ లేనిదే నిద్ర కూడా లేవలేదు. ఉదయాన్నే ఫిల్టర్ కాఫీ తాగకపోతే ఆ రోజంతా ఏ పనీ చేయలేదట. ఆహారం తినకపోయినా ఫిల్టర్ కాఫీ తప్పకుండా ఉండాల్సిందేనని ఎన్నోసార్లు చెప్పింది దీపిక. అంతెందుకు దీపిక పదుకొనే, రణవీర్ పెళ్లిలో వచ్చిన అతిధులకు ఫిల్టర్ కాఫీని ప్రత్యేకంగా అందించారు.
ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి ఫిల్టర్ కాఫీ అంటే ప్రాణం. అది ఒక పానీయంగా కాదు ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ లా మారిపోయింది. ఫిల్టర్ కాఫీ తయారీ పద్ధతి కూడా ఇతర ఒక కాఫీలతో పోలిస్తే కాస్త భిన్నంగానే ఉంటుంది.
ఫిల్టర్ కాఫీ వల్ల ఉపయోగాలు
సాధారణ కాఫీ ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు చెప్పాయి. ప్రతిరోజు ఒకటి లేదా రెండు కప్పులు కాఫీ తాగితే చాలు. వారి ఆయుష్షు పెరుగుతుందని కూడా పరిశోధనకర్తలు చెబుతున్నారు. అయితే ఫిల్టర్ కాఫీ మరింత మెరుగైనది అని చెప్పుకోవచ్చు. ఫిల్టర్ చేయని కాఫీతో పోలిస్తే ఫిల్టర్ కాఫీ లో డైటర్పీన్స్ అని పిలిచే ఫైటో కెమికల్స్ అధికంగా ఉంటాయి. ఈ కాఫీని తాగడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. కాబట్టి అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్న వారు ఫిల్టర్ కాఫీ తాగడం ఎంతో మంచిది.
ఫిల్టర్ కాఫీ పై ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు జరిగాయి. నార్వేలో 20 నుండి 79 సంవత్సరాల మధ్య గల ఐదు లక్షల మందిపై అధ్యయనాన్ని నిర్వహించారు. వారంతా ఫిల్టర్ కాఫీని ఇష్టంగా తాగుతున్నవారే. ఫిల్టర్ కాఫీ తాగే వారిలో అకాల మరణం అంటే ఆరోగ్య సమస్యలు బారినపడి మరణించే అవకాశం 15 శాతం తగ్గుతుందని తేలింది. దీనిబట్టి ఫిల్టర్ కాఫీ ఆరోగ్యానికి మేలే చేస్తుందని అర్థం అవుతోంది.
గుండె జబ్బులు తగ్గుతాయి
ఫిల్టర్ చేయని కాఫీతో పోలిస్తే ఫిల్టర్ కాఫీ గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని కూడా చాలా వరకు తగ్గిస్తుంది. ముఖ్యంగా ఇస్కిమిక్ గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది. అధ్యయనం ప్రకారం ఒకటి నుంచి రెండు కప్పుల ఫిల్టర్ కాఫీ తాగడం వల్ల వారిలో మరణాల రేటు కూడా తగ్గుతుంది.
ఫిల్టర్ కాఫీని ఎలా చేయాలి?
ఫిల్టర్ కాఫీ చేయడానికి ఒక ప్రత్యేకమైన పాత్ర ఉంటుంది. కాఫీని ఫిల్టర్ చేయడానికి చిన్న చిన్న రంధ్రాలు కూడా ఉంటాయి. దానిలో కాఫీ పొడి వేసి, వేడి నీటిని వేసి మూత పెట్టి ఉంచుతారు. తర్వాత అందులో ఉన్న కాఫీని ఫిల్టర్ చేసి ఒక కప్పులో వేసుకుంటారు. అదే ఫిల్టర్ కాఫీ. మీకు ఫిల్టర్ కాఫీ కావాలనుకుంటే ఆ ప్రత్యేకమైన పాత్ర కొనాల్సిందే. సాధారణంగా ఇంటి దగ్గర మీరు ఫిల్టర్ కాఫీని చేయలేరు. ఆ ప్రత్యేకమైన పాత్ర ఉంటే చాలా సులువుగా చేసుకోవచ్చు. అలాగే కాఫీ బీన్స్ కూడా కొనుక్కోవలసిన అవసరం ఉంటుంది.
టాపిక్