బ్ర‌హ్మ‌ముడి టుడే ఎపిసోడ్‌: కావ్య‌కు సారీ చెప్పిన రాజ్ -సైకోగా మారిన యామిని -స్వ‌ప్న మాస్ ర్యాగింగ్‌కు రుద్రాణి బెదుర్స్

Best Web Hosting Provider In India 2024

బ్ర‌హ్మ‌ముడి టుడే ఎపిసోడ్‌: కావ్య‌కు సారీ చెప్పిన రాజ్ -సైకోగా మారిన యామిని -స్వ‌ప్న మాస్ ర్యాగింగ్‌కు రుద్రాణి బెదుర్స్

 

బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్ మే 22 ఎపిసోడ్‌లో కావ్య తో పాటు దుగ్గిరాల ఫ్యామిలీ అడుతోన్న నాట‌కాన్ని బ‌య‌ట‌పెట్ట‌డానికి యామిని మ‌రో కొత్త స్కెచ్ వేస్తుంది. జ‌నాభా లెక్క‌ల ఆఫీస‌ర్‌గా త‌న మ‌నిషిని దుగ్గిరాల ఇంటికి పంపిస్తుంది. కావ్య‌తో దుగ్గిరాల ఇంటికి ఉన్న సంబంధాన్ని బ‌య‌ట‌పెట్టించాల‌ని అనుకుంటుంది.

 
బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్ మే 22 ఎపిసోడ్‌
 

కావ్య‌కు ల‌వ్ లెట‌ర్ ఇస్తాడు రాజ్‌. పంచ్‌లు, ప్రాస‌ల‌తో కూడిన ఆ ల‌వ్ లెట‌ర్ చ‌దువుతుంది కావ్య‌. రాసింది న‌చ్చ‌క‌పోతే తిట్టు భావం అర్థం కాక‌పోతే కొట్టు , నువ్వు మాట్లాడ‌క‌పోతే చూసుకుంటా గోదారి గ‌ట్టు అంటూ ఫ‌న్నీగా ల‌వ్ లెట‌ర్ లో త‌న ప్రేమ‌ను వ్య‌క్తం చేస్తాడు రాజ్‌.

 

కావ్య లెట‌ర్ చ‌ద‌వ‌డం పూర్తిచేసిన త‌ర్వాత నేను రాసిన లెట‌ర్ చూసి ఏలా అనిపించింది. మ‌న‌సు పుల‌క‌రించిందా అని కావ్య అడుగుతాడు రాజ్‌. నా చేతి వేలిని ప‌ట్టుకొని అరుంధ‌తి న‌క్ష‌త్రం చూడాల‌ని అనిపించిందా అని అంటాడు.

క‌ళ్యాణ్ రాశాడు క‌దా…

ఈ లెట‌ర్ రాసింది మీరు కాదు.. క‌ళ్యాణ్ క‌దా అని రాజ్‌ను అడుగుతుంది కావ్య‌. కాద‌ని రాజ్ బుకాయిస్తాడు. ఆ మాట‌లు నావి అని బిల్డ‌ప్‌లు ఇస్తాడు. చివ‌ర‌కు నిజం ఒప్పుకుంటాడు. క‌ళ్యాణ్ రాశాడ‌ని మీరు ఎలా క‌నిపెట్టార‌ని అడుగుతాడు. లెట‌ర్‌లో ఇట్లు మీ క‌ళ్యాణ్ అని రాసి ఉంద‌ని చూపిస్తుంది. కాపీ కొట్టి రాసిన మీది ఎంత గొప్ప మ‌న‌సో అర్థ‌మ‌వుతుంద‌ని ఛీ కొట్టి వెళ్లిపోతుంది.

క‌ళ్యాణ్ వెంట‌ప‌డ్డ రాజ్‌?..

కోపం ప‌ట్ట‌లేక‌పోయిన క‌ళ్యాణ్‌ను కొట్ట‌డానికి అత‌డి వెంట‌ప‌డ‌తాడు రాజ్‌. ఇందిరాదేవి, అప‌ర్ణ వ‌చ్చి రాజ్‌ను ఆపేస్తారు. క‌ళ్యాణ్‌ను చంపేస్తావా ఏంటి? అస‌లు ఏమైంది అని రాజ్‌ను అడుగుతారు. నా మ‌న‌సులోని మాట‌ల‌ను ల‌వ్ లెట‌ర్‌గా రాసి కావ్య‌ను ఇంప్రెస్ చేయాల‌ని అనుకున్నాన‌ని, కానీ ఆ ప్లాన్‌ను క‌ళ్యాణ్ చెడ‌గొట్టాడ‌ని రాజ్ కోపంగా జ‌రిగింది చెబుతాడు. యూత్‌ఫుల్ ఐడియాతో ఇంప్రెస్ చేస్తాన‌న్నావు…ఇదేనా నీ ఐడియా అని రాజ్‌ను ఎగ‌తాళి చేస్తారు ఇందిరాదేవి, అప‌ర్ణ‌.

 

వారిద్ద‌రి స‌హాయంతో కావ్య‌ను ప్రేమ‌లోకి దించ‌డానికి మ‌రో ఐడియా వేస్తాడు రాజ్‌. ఇందిరాదేవి, అప‌ర్ణ‌ల‌తో రాజ్ మాట్లాడుతున్న మాట‌ల‌ను కావ్య వింటుంది. త‌న కోసం రాజ్ ఆరాట‌ప‌డ‌టం, త‌న ప్రేమ కోసం ప‌రిత‌పించ‌డం బాగుంద‌ని సంబ‌ర‌ప‌డుతుంది.

మూడుముళ్ల సాక్షిగా..

అప్పుడే కావ్య‌కు యామిని ఫోన్ చేస్తుంది. నీ మొగుడు నీ చుట్టే తిరుగుతున్నాడ‌ని సంబ‌ర‌ప‌డుతున్నావా అని అడుగుతుంది. నీ మాట‌లు నిజం అవుతాయ‌ని కావ్య బ‌దులిస్తుంది. ఒక్క రోజు రాజ్ నీ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చాడ‌ని సంబ‌ర‌ప‌డిపోకు అని కావ్య‌తో అంటుంది యామిని.

ఆయ‌న నాకు వేసిన మూడుముళ్ల సాక్షిగా ఇది మూడోరోజు…ఈ మూడు రోజుల్లో మూడు గిఫ్ట్‌లు ఇచ్చాడ‌ని కావ్య బ‌దులిస్తుంది. రాజ్‌ చుట్ట‌పుచూపుగానే నీ ఇంటికి వ‌స్తున్నాడ‌ని, ఎక్క‌డికి వెళ్లినా రావాల్సిన నా ద‌గ్గ‌రికి రావాల్సిందేన‌ని యామిని అంటుంది. ఏదో ఒక రోజు శాశ్వ‌తంగా రాజ్ నా ద‌గ్గ‌ర‌కు వ‌స్తాడ‌ని కావ్య బ‌దులిస్తుంది.

యామిని సైకోయిజం…

కోడ‌లిగానే ప‌నికిరాను అన్న ఈ ఫ్యామిలీతోనే న‌న్ను కోడ‌లిగా అంగీక‌రించేలా చేశాను…అలాంటిది నీలాంటి సైకోను ఓడించ‌లేనా అని కావ్య అంటుంది. కావ్య మాట‌ల‌తో యామిని కోపం ప‌ట్ట‌లేక‌పోతుంది. ఎవ‌రు సైకో అంటూ కావ్య‌పై ఎగిరిప‌డుతుంది. నీలోని సైకోయిజాన్ని చిన్న‌ప్పుడే గుర్తించి ట్రీట్‌మెంట్ ఇప్పిస్తే నీ జీవితం ఇలా ఉండేది కాదు…ఇంకొక‌రి మొగుడి కోసం ఆరాట‌ప‌డుతూ దిగ‌జారిపోయేదానికి కాద‌ని యామిని గ‌ట్టి స్ట్రోక్ ఇస్తుంది కావ్య‌. రాజ్ నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన నీకు ట్రీట్‌మెంట్ ఇప్పిస్తాన‌ని కావ్య అంటుంది.

 

రుద్రాణి చిరాకు…

ఈ సారి నేను కొట్టే దెబ్బ‌కు నువ్వు కోలుకోలేవ‌ని కావ్య‌తో కోపంగా అంటుంది యామిని. ధ‌ర్మం మీద అధ‌ర్మం ఎప్ప‌టికీ గెల‌వ‌ద‌ని, నీకు గ‌తి అంతే అని కావ్య ఫోన్ క‌ట్ చేస్తుంది. కావ్య‌ను వ‌దిలిపెట్టొద్ద‌ని ఫిక్స‌వుతుంది యామిని. వెంట‌నే రుద్రాణికి ఫోన్ చేస్తుంది. అస్త‌మానం ఎందుకు ఫోన్ చేస్తున్నావ‌ని , రాజ్‌కు నిజం చెప్ప‌డానికి టైమ్ కావాల‌ని యామినికి చిరాగ్గా బ‌దులిస్తుంది రుద్రాణి. అంత ఓపిక నాకు లేద‌ని మ‌రో కొత్త ప్లాన్‌ను రుద్రాణికి చెబుతుంది.

కొంచెం గ్యాప్ ఇచ్చిన కావ్య అల్లుక‌పోయేలా ఉంద‌ని అంటుంది. జ‌నాభా లెక్క‌ల వారిల త‌న మ‌నుషులు మీ ఇంటికి వ‌స్తార‌ని, ఎవ‌రికి ఏమ‌వుతారో వాళ్లే బ‌య‌ట‌పెడ‌తార‌ని చెప్పి యామిని ఫోన్ క‌ట్ చేస్తుంది. న‌న్నే సైకో అంటావా నా సైకోయిజం ఎలా ఉంటుందో చూపిస్తాన‌ని కావ్య‌ను ఉద్దేశించి కోపంగా ర‌గిలిపోతుంది యామిని.

సారీ చెప్పిన రాజ్‌…

త‌న మూడు ప్లాన్ బెడిసికొట్ట‌డంతో ఐ యామ్ వెరీ సారీ అంటూ పాట పాడి కావ్య‌కు సారీ చెబుతాడు రాజ్‌. దుగ్గిరాల ఫ్యామిలీ మెంబ‌ర్స్ కూడా రాజ్‌తో క‌లిసి డ్యాన్స్ చేశారు. రాజ్ ఎంత బ‌తిమిలాడిన కావ్య మాత్రం త‌గ్గ‌దు. చివ‌ర‌కు కావ్య క‌రిగిపోతుంది. కావ్య న‌వ్వుతుంది. ఆమె న‌వ్వు చూసి రాజ్ సంబ‌రంతో గంతులు వేస్తాడు.

 

యామిని మ‌నుషులు ఎంట్రీ…

వారంతా సంతోషంగా ఉండ‌గా స‌డెన్‌గా జ‌నాభా లెక్క‌ల వాళ్ల రూపంలో యామిని మ‌నుషులు అక్క‌డికి ఎంట్రీ ఇస్తారు. క‌రెక్ట్ టైమ్‌కు వ‌చ్చార‌ని రుద్రాణి సంబ‌ర‌ప‌డుతుంది. రాజ్ ఇంట్లోనే ఉండ‌టంతో యామిని మ‌నిషిని బ‌య‌ట‌కు తీసుకెళ్లి అత‌డికి కావాల్సిన స‌మాచారం చెప్పాల‌ని అప‌ర్ణ అనుకుంటుంది. అంద‌రిని లైవ్‌లో చూసిన త‌ర్వాతే లిస్ట్‌లో వారి పేర్లు న‌మోదు చేస్తాన‌ని అత‌డు అంటాడు. ఇంట్లో ఉండే వివ‌రాలు రాసుకోవాల్సిందేన‌ని ప‌ట్టుప‌డ‌తాడు.

కావ్య‌ను ఇరికించిన ప్ర‌కాశం…

కావ్య అక్క‌డ క‌నిపించ‌క‌పోవ‌డంతో ఆమెను పిలుస్తాడు ప్ర‌కాశం. మ‌తిమ‌రుపుతో కావ్య‌ను ఇరికించిన ప్ర‌కాశంపై ఇంద‌రాదేవి ఫైర్ అవుతుంది. ఇంట్లోవాళ్ల పేర్లు లిస్ట్‌లో రాసుకునేముందు నా పేరు రాసుకొండి అని యామిని మ‌నిషితో రాజ్ చెబుతాడు. మీరెవ‌రు అని అత‌డు అడ‌గ్గా…ఈ ఇంటికి ద‌త్త పుత్రుడిన‌ని రాజ్ బ‌దులిస్తాడు. నీ పేరును అప్పుడే చేర్చ‌డం కుద‌ర‌ద‌ని రుద్రాణి అంటుంది. నీ పేరు ప‌క్క‌న దుగ్గిరాల ఇంటి పేరును చేర్చ‌డానికి టైమ్ ప‌డుతుంద‌ని అంటుంది.

స్వ‌ప్న మాస్ ర్యాగింగ్‌…

క‌రెక్ట్‌గా వివ‌రాలు చెప్ప‌క‌పోతే అంద‌రి పేర్లు ఓట‌ర్ లిస్ట్ నుంచి తీసేస్తాన‌ని యామిని మ‌నిషి వార్నింగ్ ఇస్తాడు. ఒక్కొక్క‌రుగా త‌మ వివ‌రాలు చెబుతుంటారు. రుద్రాణి త‌న‌తో పాటు రాహుల్ పేరు చెబుతుంది. మావ‌య్య గురించి చెప్ప‌లేదు ఏంటి అని రుద్రాణిని ఆట‌ప‌ట్టిస్తుంది స్వ‌ప్న‌. మీ ఆయ‌న ఎక్క‌డికి వెళ్లాడో తెలియ‌దా? అస‌లు వ‌స్తాడో రాడో కూడా తెలియ‌దా అని రుద్రాణిని అడుగుతుంది స్వ‌ప్న‌. రాడు అని చిర‌గ్గా రుద్రాణి బ‌దులిస్తుంది.

 

క‌ళావ‌తిని మ‌ర్చిపోయారు…

అప‌ర్ణ‌, సుభాష్ త‌మ వివ‌రాలు చెబుతారు. మీకు పిల్ల‌లు లేరా అని జ‌నాభా లెక్క‌ల మ‌నిషి వారిని అడుగుతాడు. వారికి ఓ కొడుకు ఉండేవాడు…అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయాడ‌ని వారి బ‌దులుగా రాజ్ బ‌దులిస్తాడు. అంతేగా ఇంకెవ‌రూ లేరుగా అని జ‌నాభా లెక్క‌ల ఆఫీస‌ర్ వెళ్లిపోవ‌డానికి సిద్ధ‌మ‌వుతాడు.

అత‌డిని రుద్రాణి ఆపుతుంది. అదేంటి క‌ళావ‌తి గురించి చెప్ప‌డం మ‌ర్చిపోయారు అని అంటుంది. అంద‌రూ ఆమెవైపు కోపంగా చూస్తారు. ఏంటి క‌ళావ‌తి మీ అత్త‌య్య మ‌ర్చిపోవ‌చ్చు…నువ్వు మ‌ర్చిపోతే ఎలా సెటైర్ వేస్తుంది రుద్రాణి. ఈవిడ ఈ ఇంటికి ఏమ‌వుతార‌ని జ‌నాభా లెక్క‌ల మ‌నిషి అడుగుతాడు.

కావ్య‌కు రాజ్ ప్ర‌పోజ్‌…

కావ్య‌కు ప్ర‌పోజ్ చేసి ఆమెను పెళ్లికి ఒప్పించాల‌ని రాజ్ అనుకుంటాడు. మ‌రోవైపు కావ్య ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన ఇందిరాదేవి, అప‌ర్ణ‌…రాజ్ ప్ర‌పోజ‌ల్ గురించి చెబుతారు. రాజ్ ప్రేమ‌ను నువ్వు యాక్సెప్ట్ చేయాల‌ని కావ్య‌తో అంటారు. రాజ్‌, కావ్య ల‌వ్ ప్ర‌పోజ‌ల్ గురించి యామినికి ఇన్ఫ‌ర్మేష‌న్ ఇస్తుంది రుద్రాణి. రాజ్ ఇంటికి రాకుండా చేయ‌మ‌ని చెబుతుంది. అక్క‌డితో నేటి బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్ ముగిసింది.

 

 
 

Source / Credits

Best Web Hosting Provider In India 2024