కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ మే 22: జ్యోత్స్నకు తాత చివాట్లు.. ‘కార్తీక్ నాతోనే ఉంటాడు’: దీపతో చెప్పిన జ్యో.. కాంచన ఫైర్

Best Web Hosting Provider In India 2024

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ మే 22: జ్యోత్స్నకు తాత చివాట్లు.. ‘కార్తీక్ నాతోనే ఉంటాడు’: దీపతో చెప్పిన జ్యో.. కాంచన ఫైర్

కార్తీక దీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్ మే 22: పరువు తీశావంటూ జ్యోత్స్నపై శివన్నారాయణ కోప్పడతాడు. జ్యో అబద్ధం చెప్పి తప్పించుకుంటుంది. దశరథ్ కూడా ఆగ్రహిస్తాడు. కార్తీక్‍తో చేసుకున్న అగ్రిమెంట్ గురించి దీపకు చెప్పేస్తుంది జ్యో. కాంచన ఫైర్ అవుతుంది. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.

 
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ మే 22: జ్యోత్స్నకు తాత చివాట్లు.. ‘కార్తీక్ నాతోనే ఉంటాడు’: దీపతో చెప్పిన జ్యో.. కాంచన ఫైర్
 

కార్తీక దీపం 2 నేటి (మే 22, 2025) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. కార్తీక్, దీపకు తన చేతులతో అవార్డు ఇచ్చిన శివన్నారాయణ ఇంటికి వచ్చి రగిలిపోతాడు. జ్యోత్స్నపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. “గాలి మాటలు చెప్పడం. ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పడం కాదు గెలుపంటే. ఈరోజు కార్తీక్ గాడు మనకు చూపించాడు చూడు అదే గెలుపంటే. అటవైపు కన్నెత్తి కూడా చూడకూడదు అనుకున్నా” అని జ్యోత్స్నపై శివన్నారాయణ ఫైర్ అవుతాడు. నీ మనవడికి అవార్డు రావడం ఓర్వలేక నీ మనవరాలిని పంపావా అని అడిగాడని కోప్పడతాడు.

 

మిగిలిన సగం అక్కడ చంపారు

గోరు చుట్టు మీద రోకలి పోటులా.. సగం ఇక్కడే చచ్చి బయలుదేరా.. మిగిలిన సగం అక్కడ చంపారు అంటూ జోత్స్నకు చివాట్లు పెడతాడు శివన్నారాయణ. తాత అని జ్యో.. తాత లేదు.. పీత లేదు ముందు ఆ అగ్రిమెంట్ కథేంటో చెప్పు అని శివన్నారాయణ అడుగుతాడు. అగ్రిమెంట్ ఏంటి అని దశరథ్, సుమిత్ర అడుగుతారు. మనవరాలా నీకు టైమ్ దగ్గర పడిందే అని పారిజాతం మనసులో అనుకుంటుంది. నువ్వు సత్యరాజ్ రెస్టారెంట్ షేర్లు కొనడం ఏంటో చెప్పు అని శివన్నారాయణ ప్రశ్నిస్తాడు.

అది బూతులా వినిపిస్తోంది

నేనేం చేసినా ఫ్యామిలీ పరువు మనసులో పెట్టుకొని చేస్తానని జ్యోత్స్న అంటుంది. “నువ్వు పరువు అని అనొద్దు.. నాకు ఏదో బూతులా వినిపిస్తోంది” అని శివన్నారాయణ అంటాడు. ముందు ఆ అగ్రిమెంట్ ఏంటో చెప్పు అని సుమిత్ర అడుగుతుంది.

నిన్ను తిట్టాడు తాత.. అగ్రిమెంట్ గురించి జ్యో అబద్ధం

దీప ఆపరేషన్‍కు బ్లడ్ ఇచ్చేందుకు వెళ్లిన నా ముందు తాతను కార్తీక్ బావ తిట్టాడని జ్యోత్స్న అబద్ధం చెబుతుంది. కొన్ని చెప్పలేను కానీ.. గట్టిగానే తిట్టాడు అని అంటుంది. ఇవన్నీ నువ్వు కావాలని చెబుతున్నావ్ అని పారిజాతం మనసులో అనుకుంటుంది. చాలా కోపం వచ్చి మాటామాటా పెరిగి కార్తీక్‍తో గొడవ జరిగిందని జ్యో అంటుంది.

 

అందుకే అగ్రిమెంట్ రాయమన్నా

తాతను అన్ని మాటలు అంటే ఎందుకు ఊరుకుంటా.. దీప ఆపరేషన్‍కు ఇచ్చిన డబ్బుకు అగ్రిమెంట్ రాయమన్నా అని జ్యోత్స్న అంటుంది. రక్తం ఇప్పించేందుకు అగ్రిమెంట్ రాయించుకున్న జ్యో.. డబ్బు కోసం అంటూ అబద్ధం చెబుతుంది. బావ పౌరషానికి పోయి.. భార్యపై ప్రేమను నిరూపించుకునేందుకు ఎంతకైనా సిద్ధమని బావ అన్నాడని జ్యో చెబుతుంది. నువ్వు నేను చెప్పింది చేయాలి.. చెప్పింది వినాలని షరతు పెట్టానని జ్యో అంటుంది. రెస్టారెంట్‍లో నా షేర్ ఇచ్చేస్తా.. అవసరమైతే బానిసగా పని చేస్తానని బావ మాట ఇచ్చాడని జ్యో అంటుంది. కావాలని బావే అగ్రిమెంట్ మీద సంతకం పెట్టాడని చెబుతుంది.

ఆ కారణంగానే రూ.10కోట్ల షరతు

కార్తీక్ దేనికీ తగ్గడు.. పోయి మీ తాతకు చెప్పుకో అని కార్తీక్ అన్నాడని జ్యో నోటికి వచ్చిన అబద్ధాలు ఆడుతుంది. అందుకే అగ్రిమెంట్‍ను బ్రేక్ చేస్తే క్షమాపణగా 24 గంటల్లో రూ.10కోట్లు కట్టాలని తాను చెప్పానని జ్యోత్స్న అంటుంది. నువ్వు చెప్పిన వాటిలో ఎంత వరకు నిజం ఉందో అంటూ జ్యోపై అనుమానంగా మాట్లాడాడు దశరథ్. ప్రాణాలు కాపాడినందుకు దీన్ని అనుమానిస్తారా సుమిత్ర అంటుంది. మన కూతురు సాయాన్ని బేరం పెట్టిందని దశరథ్ అంటాడు. క్షమాపణ ఖరీదు రూ.10కోట్లు ఏంటి అని ప్రశ్నిస్తాడు. అగ్రిమెంట్ విషయం మాకెందుకు చెప్పలేదు.. అంటే అవార్డు తీసుకొచ్చి తాతకు ఇచ్చి చెప్పాలనుకున్నా అని జ్యో బదులిస్తుంది.

 

దీపనే ఆ పరిస్థితి తీసుకొచ్చింది

అగ్రిమెంట్ ప్రకారం సత్యరాజ్ రెస్టారెంట్‍లో కార్తీక్ గాడి వాటా మనది.. అంతే కదా అని శివన్నారాయణ అడుగుతాడు. అంతే ని జ్యో సమాధానమిస్తుంది. అందుకే ఆ అవార్డు కూడా తీసుకోవాలనుకున్నా అని జ్యో అంటుంది. కానీ దీప అడ్డుపడింది కదా అని శివన్నారాయణ అంటాడు. మీరు ఎందుకు ఊరుకున్నారని పారిజాతం అడుగుతుంది. నేనేం ఊరుకోలేదు.. అవార్డు నా చేతుల మీదుగానే భార్యాభర్తలకు ఇచ్చానని శివన్నారాయణ అంటాడు. దీపనే ఆ పరిస్థితిని తీసుకొచ్చిందని చెబుతాడు. జ్యోత్స్న ఇదంతా ముందే చెప్పి ఉంటే కథ మరోలా ఉండేదని శివన్నారాయణ అంటాడు. ఈ అవార్డు పోతే పోయింది కానీ.. బావ మాత్రం చెప్పింది చేయాల్సిందే అని జ్యోత్స్న అంటుంది. నీ కాళ్ల దగ్గరికి తీసుకొస్తానని చెబుతుంది.

కావాలనే వాడి జుట్టు నీ చేతిలో పెట్టాడు

దీన్ని రివేంజ్ అంటారు జ్యోత్స్న అని దశరథ్ వారిస్తాడు. నేను దీన్ని న్యాయం అంటా.. బావ వల్ల మన రెస్టారెంట్‍కు చాలా నష్టం జరిగిందని జ్యోత్స్న అంటుంది. రెస్టారెంట్‍ను దెబ్బకొట్టడంతో పాటు తాతను అమానించాడని చెబుతుంది. శివన్నారాయణ మనవరాలిగా నేను చూస్తూ ఎలా ఊరుకుంటానని అంటుంది. అతడికి భార్య ఎక్కువైతే.. నాకు మా తాత ఎక్కువ అంటుంది. అందుకే పంతానికి పోయి అగ్రిమెంట్ రాశాడు.. ఫలితం అనుభవిస్తాడని చెబుతుంది. వాడి తెలివి నాకు తెలుసు.. అందుకే వాడి జుట్టు నీ చేతిలో పెట్టాడని శివన్నారాయణ అంటాడు.

 

పెద్ద ప్లాన్‍తోనే సంతకం

“దీపను జైలులో నుంచి తీసుకొచ్చాడు.. దీప బతకదు అనుకున్నాం బతికించుకున్నాడు.. అది ఎలా సాయం చేయమని చెప్పిన మనతోనే సాయం చేయించుకొని భార్యను కాపాడుకున్నాడు. సంతకం పెట్టిన నువ్వు గెలిచినట్టా.. భార్యను బతికించుకున్న వాడు గెలిచినట్టా. రెస్టారెంట్ విషయంలో కూడా గెలిచాడు. అవార్డు కూడా భార్యను అడ్డుపెట్టి సొంతం చేసుకున్నాడు. మనమే ఇచ్చేలా చేశాడు. వాడిని ఏదో గుప్పెట్లో పెట్టుకున్నావనుకుంటున్నావ్ కానీ.. వాడేదో పెద్ద ప్లాన్‍తోనే అగ్రిమెంట్‍పై సంతకం పెట్టాడు” అని శివన్నారాయణ అంటాడు. నువ్వు నా సామర్థ్యాన్ని నమ్మడం లేదా అని జ్యో అంటే.. మాటల్లో కాదు.. చేతల్లో చూపించు అని కోపంగా వెళ్లిపోతాడు శివన్నారాయణ.

దశరథ్ వార్నింగ్.. సుమిత్ర కోపం

నువ్వు వాడితో పెట్టుకోకు జ్యోత్స్న.. నీకే మంచిది కాదు అని జ్యో వార్నింగ్ ఇస్తాడు దశరథ్. ఈ అగ్రిమెంట్లు, ప్రతీకారాలు మనకు అవసరమా జ్యోత్స్న.. ఆ దేవుడు చూసుకుంటాడు అని సుమిత్ర అంటుంది. డాడీకి ఏమైనా అయితే ఇలాగే మాట్లాడేదానివా మమ్మీ అని జ్యో అడుగుతుంది. సుమిత్ర ఆలోచిస్తుంది. ఇప్పుడు ఏమీ చేయకపోతే భవిష్యత్తులో ఏదైనా పోగొట్టుకునేందుకు సిద్ధంగా ఉండాలంటుంది జ్యోత్న. అన్నీ ఆలోచించే చేస్తున్నానని చెబుతుంది. కూతురు వైపు నిలబడు అని సుమిత్రకు పారు చెబుతుంది. అగ్రిమెంట్ విషయంలో జ్యోత్స్న ఎక్కడ దొరికిపోతుందో అనుకున్నా.. కథ మొత్తం మార్చి ఎవరినీ మాట్లాడకుండా చేసిందని అనుకుంటుంది పారిజాతం.

 

కార్తీక్ ఇంటికి జోత్స్న

దీప మాట్లాడింది కాబట్టి ఈ అవార్డు నీకు వచ్చింది కానీ.. నీ మాట విని ఆగిపోయి ఉంటే ఇది ఆ ఇంట్లో ఉండేదని కార్తీక్‍తో కాంచన అంటుంది. మాకు ఏదీ పూర్తిగా అర్థం కాలేదు.. జ్యోత్స్న మాటలకు ఎందుకు సపోర్టుగా మాట్లాడారు అని దీప అడుగుతుంది. ఇంతలో కార్తీక్ ఇంటికి జ్యోత్స్న వస్తుంది. అడగాల్సిన వాళ్లను అడిగితే తెలుస్తుంది కదా దీప.. అని జ్యోత్స్న అంటుంది.

అగ్రిమెంట్‍ను విషయం చెప్పేసిన జ్యోత్స్న

ఇక్కడికి ఎందుకు వచ్చావని జ్యోత్స్నపై కాంచన ఫైర్ అవుతుంది. మా ఇంట్లో ఓ క్లారిటీ ఇచ్చా మీకు ఇస్తానని జ్యో అంటుంది. రేపటి నుంచి చాలా విషయాలకు ఆశ్చర్యపోవాల్సి ఉంటుందని, అందుకే ఏం జరిగిందో చెబుతానని జ్యో అంటుంది. తర్వాత మాట్లాడదామని కార్తీక్ అంటే.. నేను తెలుకోవాల్సిందేనని దీప అంటుంది. ఏం జరిగిందో ఒక భార్యగా నువ్వు తెలుసుకోవాల్సిందేనని జ్యో అంటుంది. నీ ముందే మనిద్దరి మధ్య జరిగిన అగ్రిమెంట్ గురించి కూడా చెబుతానని కార్తీక్‍తో జ్యో చెబుతుంది.

నీకోసమే ఇదంతా జరిగింది

నీకోసమే నాకు కార్తీక్ బావ అగ్రిమెంట్ రాశాడని దీపతో జ్యోత్స్న అంటుంది. “నువ్వు అంటే మా బావకు ప్రాణం కదా.. నువ్వు బతకాలంటే రక్తం, డబ్బు కావాలని డాక్టర్లు చెప్పారు. టైమ్ లేదని అన్నారు. డబ్బు, బ్లడ్ నేనిస్తానని చెప్పా. ఊరికే నేనెందుకు ఇవ్వాలి. నేను అడిగినది నాకు ఇచ్చావా.. ఇవ్వలేదు కదా. అప్పుడే నాకు అగ్రిమెంట్ ఆలోచన వచ్చింది. దీప కోసం ఏమైనా చేస్తానని సంతకం పెట్టాడు” అని జ్యోత్స్న చెప్పేస్తుంది. దీంతో కాంచన కంగారు పడుతుంది.

 

బావ నాతోనే ఉంటాడు.. నా పని వాడే

ఈ అగ్రిమెంట్ ప్రకారం.. సత్యరాజ్ రెస్టారెంట్‍లో బావకు ఉన్న వాటా నాదేనని జ్యోత్స్న అంటుంది. “ఈ అగ్రిమెంట్ ప్రకారం 9 నుంచి ఐదు వరకు.. సారీ ఎండ్ టైమ్ నేను చెప్పలేను. ఉదయం 9 నుంచి రాత్రి నేను రాత్రి వెళ్లమనే వరకు బావ నాతోనే అసిస్టెంట్‍గా ఉంటాడు. నేను చెప్పిన పనులన్నీ చేస్తాడు. అలా అయితే పని వాడు అవుతాడని అనుకుంటారేమో. ఎస్.. బావ నాకు ఇక పనివాడే” అని జ్యోత్స్న అంటుంది. దీంతో దీప షాక్ అవుతుంది. జ్యోత్స్న కోపంగా అరుస్తుంది కాంచన.

జ్యోత్స్న చెప్పింది నిజమే

ఏంటి కార్తీక్ బాబు.. మీరు ఏం మాట్లాడరేంటి అని దీప ప్రశ్నిస్తుంది. మీరెంత ఆవేశపడినా లాభం లేదని జ్యో అంటుంది. బావ ఇష్టప్రకారమే సంతకం చేశాడని అంటుంది. జ్యోత్స్న చెప్పింది నిజమే దీప అని కార్తీక్ అంటాడు.

చెడపుట్టింది.. కాంచన ఆగ్రహం

“దీప మీద నీకు ఉన్న ప్రేమను అడ్డుపెట్టుకొని ఇది నీ సంసారంతో ఆడుకోవాలని చూస్తుంది” అని కాంచన అంటుంది. దీంతో అత్తా అని అరుస్తుంది జ్యోత్స్న. ఛీ నోరు మూయ్. అత్తా అని ఇంకోసారి పిలిస్తే పళ్లు రాలిపోతాయ్. నీలాంటి దరిద్రపుది మా వదిన కడుపున చెడుపుట్టింది” అని కాంచన ఆగ్రహిస్తుంది. ఇది మీ ఇంట్లో వాళ్లకు తెలుసా.. లేకపోతే ఇదంతా మీ తాతే చేయిస్తున్నాడా అని నిలదీస్తుంది. అనసూయ కూడా కోపంగా మాటలు అంటుంది. జ్యోత్స్న అడ్డంగా వాదిస్తుంది.

 

రేపటి నుంచి కొత్త డ్యూటీ

దీప ప్రాణాలు కాపాడనని జ్యోత్స్న అంటుంది. అది నువ్వు ఫ్రీగా చేయలేదు.. ఒప్పందం ఉందని కార్తీక్ అంటాడు. ఆ క్రెడిట్ తీసుకోకు అని చెబుతాడు. నాకే ప్రాబ్లం లేదు.. ఈ అగ్రిమెంట్ గురించి చెప్పాలకున్నా.. చెప్పాను జ్యో అంటుంది. ఈ అగ్రిమెంట్ చెల్లదు.. నేను ఒప్పుకోను అని కాంచన అంటుంది. నీ పర్మిషన్ అవసరం లేదని జ్యో చెబుతుంది. సత్యరాజ్ రెస్టారెంట్ ఇక నాది కదా.. అక్కడే కలుద్దామని పొగరుగా అంటుంది జ్యో. రేపటి నుంచి నీకు కొత్త డ్యూటీ స్టార్ అవుతుందని కార్తీక్‍తో అంటుంది. దీపతో పెళ్లి చేసుకున్న తర్వాత లుంగీ కట్టుగొని ఇడ్లీ అమ్ముకునే వరకు చాలా స్థాయి తక్కువ పనులు చేశావని అంటుంది. దీంతో కార్తీక్ కోప్పడతాడు. బయటికి పోవే అని కోపంగా అరుస్తుంది కాంచన.

కార్తీక్ మాటతో కాంచన కన్‍ఫ్యూజ్

ఇలా ఆవేశంతోనే రెండు కుటుంబాలను దూరం చేశావని జ్యోత్స్న అంటుంది. “మిస్ హైదరాబాద్.. బీపీ అప్‍ అండ్ డౌన్ అవుతున్నట్టుంది. ఎగిరిపడుతున్నావ్” అని హెచ్చరిస్తాడు కార్తీక్. అత్త మాట నిలబెట్టుకొని ఉంటే ఈ పరిస్థితి ఎందుకు వస్తుందని జ్యోత్స్న అంటుంది. నిలబెట్టుకుందో.. నిలబెట్టుకోలేదో నీకు తెలుసా అని కార్తీక్ అంటాడు. అది నిలబడాలంటే నువ్వు నా మెడలో తాళి కట్టాలి కదా అని జ్యోత్స్న అంటుంది. “మేనకోడలిని కోడలిగా చేసుకుంటానని మామయ్య దగ్గర మా అమ్మ మాట తీసుకుంది. నిన్ను చేసుకుంటానని కాదు” అని కార్తీక్ అంటాడు. దీంతో కాంచనతో పాటు అందరూ కన్‍ఫ్యూజ్ అయినట్టు చూస్తారు.

 

అసలైన మేనకోడలు ఎవరో తెలుస్తుంది

ఆ ఇంటికి ఉన్న ఏకైక వారసురాలు నేనే అయినప్పుడు.. మేనకోడలిని నేనే అవుతా కదా అని జ్యోత్స్న అంటుంది. అసలైన మేనకోడలు ఎవరూ త్వరలోనే తెలుస్తుంది జ్యోత్స్న అని మనసులో కార్తీక్ అనుకుంటాడు. బావ ఏదో దీప గురించి తెలిసినట్టు మాట్లాడుతున్నాడేంటి అని జ్యోత్స్న ఆలోచిస్తుంది.

తనే మా అమ్మకు మేనకోడలు

“రక్త బంధాలు మాత్రమే.. బంధాలు నిలబెట్టలేవు. దీపతో మాకు ఉన్న బంధం కూడా అలాంటిదే. తనే మా అమ్మకు అసలైన మేనకోడలు. ఇది భగవంతుడు ఇచ్చిన బంధం. దూరం చేయడానికి మనుషులు ఎవరు” అని అసలు విషయం చెప్పడు కార్తీక్. “నువ్వు తెలియకుండా అన్న నిజమే అన్నావ్ బావా. దీపే నీ అసలైన మరదలు” అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. నాకు నిజం తెలిసిందని నీకు తెలిస్తే.. గుండె పగులుతుంది చిన్న మరదలా అని ఆలోచిస్తాడు కార్తీక్.

మీ బంధం ఎంత గట్టిదో చూస్తా

దీప నీకు భగవంతుడు ఇచ్చిన బంధమే.. దాన్ని కాపాడుకునేందుకు ఇంతటి డేర్ స్టెప్ తీసుకున్నావ్. మీ బంధం ఎంత గట్టిదో రేపటి నుంచి నేను చూస్తా” అని జ్యోత్స్న అంటుంది. కార్తీక్ ఎక్కడికీ రాడు.. ఏం చేస్తావో చేసుకో అని కాంచన అంటుంది. ఆ మాట బావను అనమను.. అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుంటే 24 గంటల్లో నాకు రూ.10కోట్లు కట్టాలని జ్యోత్స్న చెబుతుంది. అంత డబ్బు మీ దగ్గర ఉంటే ఏదైనా చేయవచ్చు అని తేల్చిచెబుతుంది. నిన్ను ఏ చెప్పుతో కొట్టాలో కూడా తెలియడం లేదే అని కాంచన అంటుంది. ఆ చెప్పుకు కూడా నా స్థాయి ఉండాలి, నీ కోడలి స్థాయి కాదు జ్యో పొగరుగా అంటుంది. కంగారు పడకు.. నీ స్థాయి చెప్పుతోనే నిన్ను కొట్టిస్తానని కార్తీక్ ఫైర్ అవుతాడు. దీంతో కార్తీక దీపం 2 నేటి (మే 22) ఎపిసోడ్ ముగిసింది.