జాన్వీ కపూర్ హోమ్‌బౌండ్‌ మూవీ.. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ స్టాండిగ్ ఒవేషన్.. 9 నిమిషాల పాటు చప్పట్ల మోత.. ఎమోషనల్ వీడియో

Best Web Hosting Provider In India 2024

జాన్వీ కపూర్ హోమ్‌బౌండ్‌ మూవీ.. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ స్టాండిగ్ ఒవేషన్.. 9 నిమిషాల పాటు చప్పట్ల మోత.. ఎమోషనల్ వీడియో

 

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025లో భారతీయ సినిమా సత్తాచాటింది. ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించింది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా యాక్ట్ చేసిన హోమ్‌బౌండ్‌ మూవీ కేన్స్ లో అదరగొట్టింది. స్టాండింగ్ ఒవేషన్ దక్కడంతో మూవీ టీమ్ ఎమోషనల్ అయింది.

 
జాన్వీ కపూర్ (REUTERS)
 

ఈ ఏడాది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించిన ఏకైక ఇండియన్ సినిమా ‘హోమ్‌బౌండ్‌’. ఈ మూవీలో జాన్వీ కపూర్, ఇషాన్ కట్టర్, విశాల్ జెత్వా కీ రోల్స్ ప్లే చేశారు. ఈ మూవీకి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025లో అరుదైన గౌరవం దక్కింది. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ మూవీని ప్రదర్శించారు. ఈ మూవీ చూసిన ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాకు 9 నిమిషాల పాటు స్టాండింగ్ ఒవేషన్ దక్కినట్లు మూవీ టీమ్ పేర్కొంది.

 

అద్భుతమైన రెస్పాన్స్

నీరజ్ ఘాయ్వాన్ దర్శకత్వం వహించిన ‘హోమ్‌బౌండ్‌’ మూవీకి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ‘అన్ సర్టెయిన్ రిగార్డ్’ విభాగంలో ఈ చిత్రాన్ని ప్రపంచ ప్రేక్షకుల కోసం ప్రదర్శించారు. ఈ మూవీలో జాన్వీ కపూర్, ఇషాన్ కట్టర్ యాక్టింగ్.. నీరజ్ టేకింగ్ కు ఫుల్ మార్క్స్ పడ్డట్లు తెలిసింది. ఈ మూవీ చూసిన ఆడియన్స్ 9 నిమిషాల పాటు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారని ధర్మ ప్రొడక్షన్స్ ఎక్స్ లో వీడియో పోస్టు చేసింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

ఫుల్ ఎమోషనల్

హోమ్‌బౌండ్‌ సినిమాకు కేన్స్ లో గొప్ప రెస్పాన్స్ రావడంతో టీమ్ యూనిట్ ఫుల్ ఎమోషనల్ అయింది. నిర్మాత కరణ్జో హార్.. దర్శకుడు నీరజ్ ఘాయ్వాన్‌ను గట్టిగా హగ్ చేసుకున్నారు. ఆయన తన చిత్రంపై అపారమైన ప్రేమ, ప్రశంసలు రావడంతో ఎమోషనల్ అయ్యారు. నటులు ఇషాన్ కట్టర్, జాన్వీ కపూర్, విశాల్ జెత్వా కూడా ఆ స్టాండింగ్ ఒవేషన్ ను చూసి భావోద్వేగానికి గురయ్యారు.

హోమ్‌బౌండ్‌ గురించి

హోమ్‌బౌండ్‌లో ఇషాన్ కట్టర్, జాన్వీ కపూర్, విశాల్ జెత్వా లీడ్ రోల్స్ ప్లే చేశారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అఫీషియల్ వెబ్ సైట్ ప్రకారం ఈ మూవీ స్టోరీ లైన్ ఇలా ఉంది.

 

“ఉత్తర భారతదేశంలోని ఒక చిన్న గ్రామానికి చెందిన ఇద్దరు బాల్య స్నేహితులు పోలీస్ ఉద్యోగం సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. ఎప్పటి నుంచో తమకు దక్కని గౌరవాన్ని ఆ జాబ్ ఇస్తుందని అనుకుంటారు. కానీ వారు తమ కలకు దగ్గరవుతున్నప్పుడు, పెరుగుతున్న నిరాశ వారిని కలిపి ఉంచే బంధాన్ని ప్రమాదంలోకి నెడుతుంది’’ అన్నది కథ సారాంశంగా ఉంది.

ఆ మూవీ కూడా

నీరజ్, సుమిత్ రాయ్ ‘హోమ్‌బౌండ్‌’ చిత్రానికి కథను రాశారు. కరణ్ జోహార్, అదర్ పూనావాలా, అపూర్వ మెహతా, సోమెన్ మిశ్రా ఈ చిత్రాన్ని నిర్మించారు. మారిజ్కే డి సోజా, మెలిటా టోస్కాన్ డు ప్లాంటియర్ సహ నిర్మాతలుగా ఉన్నారు. అకాడమీ అవార్డు గ్రహీత దర్శకుడు మార్టిన్ స్కోర్సెస్ ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా మారారు.

నీరజ్ తొలి చిత్రం ‘మసాన్’ కూడా గతంలో కేన్స్ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించారు. ఈ చిత్రంలో విక్కీ కౌశల్, రిచా చడ్డా, పంకజ్ త్రిపాఠి, సంజయ్ మిశ్రా నటించారు. అది అద్భుతమైన సమీక్షలను అందుకుంది. ‘అన్ సర్టెయిన్ రిగార్డ్ స్పెషల్ ప్రైజ్’ కూడా గెలుచుకుంది.

 
 

Source / Credits

Best Web Hosting Provider In India 2024