సైలెంట్ గా ఓటీటీలోకి సస్పెన్స్ హారర్ థ్రిల్లర్.. మైండ్ బ్లాక్ కాన్సెప్ట్.. కుర్చీలో దెయ్యం..మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్

Best Web Hosting Provider In India 2024

సైలెంట్ గా ఓటీటీలోకి సస్పెన్స్ హారర్ థ్రిల్లర్.. మైండ్ బ్లాక్ కాన్సెప్ట్.. కుర్చీలో దెయ్యం..మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్

ఓటీటీలోకి మరో సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ వచ్చేసింది. థియేటర్లలో రిలీజైన మూడు నెలల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. డిఫరెంట్ స్టోరీ లైన్ తో, మైండ్ బ్లాక్ కాన్సెప్ట్ తో వచ్చిన ఆ మూవీ ఏంటీ? ఎక్కడ స్ట్రీమ్ అవుతుందో చూసేయండి.

ఓటీటీలోకి సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ (x)

మీకు హారర్ సినిమాలంటే ఇష్టమా? కొత్త సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ కోసం వెయిట్ చేస్తున్నారా? అయితే ఈ సినిమా మీకోసమే. డిఫరెంట్ స్టోరీ లైన్ తో వచ్చిన సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ ‘ది డెవిల్స్ చైర్’ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ రోజు (మే 22) నుంచే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో రిలీజైన మూడు నెలల తర్వాత ఈ మూవీ ఓటీటీలోకి రావడం గమనార్హం.

ఏ ఓటీటీలో అంటే?

ది డెవిల్స్ చైర్ మూవీ సైలెంట్ గా ఆహా వీడియో ఓటీటీలోకి వచ్చేసింది. గురువారం నుంచి ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో డిజిటల్ స్ట్రీమ్ అవుతోంది. ఈ సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ గ్రిప్పింగ్ స్టోరీ లైన్ తో, డిఫరెంట్ కాన్సెప్ట్ తో సాగుతోంది. ఈ మూవీతో అభినయ్ కృష్ణ‌ హీరోగా మారాడు. జబర్దస్త్ లో అదిరే అభిగా ఆడియన్స్ కు అతను సుపరిచితమే.

డెబ్యూ డైరెక్టర్

ది డెవిల్స్ చైర్ సినిమాకు గంగా సప్తశిఖర డైరెక్టర్. డైరెక్టర్ గా గంగా సప్తశిఖరకు ఇదే ఫస్ట్ మూవీ. ఇందులో అభినయ కృష్ణ‌, ఛత్రపతి శేఖర్, స్వాతి మందల్, వెంకట్ దుగ్గిరెడ్డి తదితరులు నటించారు. బాబీ ఫిలిమ్స్, ఓం సాయి ఆర్ట్స్, సీఆర్ఎస్ క్రియేషన్స్ బ్యానర్లపై కేకే చైతన్య, వెంకట్ దుగ్గిరెడ్డి, చంద్ర సుబ్బగారి నిర్మించారు. ఈ సినిమా ఫిబ్రవరి 21న థియేటర్లలో రిలీజైంది.

కథ ఏమిటంటే?

విక్రమ్ (అభినయ్ కృష్ణ‌) ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తుంటాడు. బెట్టింగ్ కు బానిసగా మారిన అతడు కంపెనీకి చెందిన కోటి రూపాయలను బెట్టింగ్ లో పెడతాడు. ఈ విషయం బయటకు రావడంతో అతనిపై కంపెనీ కేసు పెడుతుంది. ఆ సమయంలో అతని లవర్ రుధిర (స్వాతి మందల్) హీరోను తన ఇంట్లోనే పెట్టుకుంటుంది.

డెవిల్ శక్తి

ఓ పాత కాలం నాటి యాంటిక్ కుర్చీని రుధిర కొని తెచ్చుకుంటుంది. ఆ చైర్ లోని డెవిల్ శక్తి ఉంటుంది. ఆ దెయ్యం విక్రమ్ కు మాత్రమే కనిపిస్తుంది. కండీషన్స్ పెడుతూ విక్రమ్ కు డబ్బులు ఇస్తోంది. చివరకు రూ.కోటి కావాలని దెయ్యాన్ని కోరతాడు హీరో. అప్పుడు లవర్ ను చంపేస్తే రూ.5 కోట్లు ఇస్తానని ఆ దెయ్యం చెబుతుంది. మరి విక్రమ్ ఆ పని చేశాడా? కుర్చీలో అసలు ఏముంది? అనేది కథ.

ఆ మెసేజ్

ది డెవిల్స్ చైర్ మూవీ ఆడియన్స్ కు మంచి థ్రిల్ ను ఇస్తోంది. ఓ వైపు సస్పెన్స్, థ్రిల్ తో పాటు స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చాడు డైరెక్టర్. దురాశ దు:ఖానికి చేటు అనే సందేశాన్ని ఇచ్చాడు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో సన్నివేశాలు భయపెడతాయి. ఈ మూవీ పార్ట్ 2 కూడా రాబోతుందని మేకర్స్ పేర్కొన్నారు. లాస్ట్ లో ట్విస్ట్ కూడా అలరిస్తుంది.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024