





Best Web Hosting Provider In India 2024

ఎండకు ముఖం నల్లగా మారితే ఈ ఫేస్ ప్యాక్ వేసుకోండి, చర్మంపై ఉన్న ట్యాన్ మొత్తం పోతుంది
సూర్యరశ్మి, దుమ్ము కారణంగా ముఖంపై మృతకణాలు పేరుకుపోయి ముఖం రంగు పూర్తిగా మారుతుంది. ఈ టాన్‌ను తొలగించడానికి ఈ ఫేస్ ప్యాక్‌ను అప్లై చేయండి. ఇవన్నీ ఇంట్లో దొరికే వస్తువులే. కాబట్టి వీటికయ్యే ఖర్చు కూడా తక్కువే.
వేసవిలో వేడి వాతావరణం వల్ల చర్మంపై వేడి, దుమ్ము, చెమట పేరుకుపోతుంది. దీనివల్ల చర్మంపై టాన్ పట్టేస్తుంది. ముఖం మొత్తం రంగు పాలిపోయినట్లు కనిపిస్తుంది. చిన్నవయసులోనే టాన్ పట్టేసి ముఖంలో ముదురుతనం కనిపిస్తుంది.
ఎండాకాలంలో ముఖం రంగు మారడం వల్ల అందవిహీనంగా కనిపిస్తారు. ముఖం కాంతిని సరిచేయాలంటే కొన్ని రకాల హోమ్ మేడ్ ఫేస్ ప్యాక్ లా తయారుచేసుకుని అప్లై చేయాలి. ఇది మృతకణాలను తొలగించడంతో పాటు మెరుపును తిరిగి ఇస్తుంది.
హోమ్ మేడ్ ఫేస్ ప్యాక్ ఇలా చేయండి
పచ్చి బంగాళాదుంప రసం – మూడు స్పూన్లు
బార్లీ పిండి – ఒక స్పూను
ఆరెంజ్ పీల్ పౌడర్ – ఒక స్పూను
లైకోరైస్ పౌడర్ – అర స్పూను
కాఫీ పౌడర్ – అరస్పూను
ఇక్కడ చెప్పిన వస్తువులతో ఫేస్ ప్యాక్ ను తయారుచేసుకోవాలి. ఒక గాజు గిన్నెలో పచ్చి బంగాళాదుంప రసంలో బార్లీ పిండి, నారింజ తొక్కల పొడి, లైకోరైస్ పౌడర్, కాఫీ పొడి కలపాలి. ఈ విధంగా పచ్చి బంగాళదుంప రసంలో కలిపిన తర్వాత కూడా ఈ పౌడర్లన్నీ బాగా కలవవు. కాసేపు ఉంచితే ఇవి బాగా నానుతాయి. ఇప్పుడు రోజ్ వాటర్ వేసి బాగా తయారుచేసిన ప్యాక్ ను సిద్ధం చేసుకోవాలి.
ముందుగా ఫేస్ వాష్ సహాయంతో ముఖాన్ని బాగా కడుక్కోవాలి. తద్వారా ముఖంపై పేరుకుపోయిన అదనపు నూనె, మురికి తొలగిపోతాయి. ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేయాలి. ఇది తేలికగా ఆరడం ప్రారంభించినప్పుడు, తేలికపాటి చేతులతో ముఖం మొత్తాన్ని బాగా మసాజ్ చేయండి.
ఫేస్ ప్యాక్ పై మసాజ్ చేస్తే మంచిది. తద్వారా ఇది నేచురల్ స్క్రబ్ లా పనిచేసి డెడ్ స్కిన్ ను తొలగిస్తుంది. స్క్రబ్ లా మసాజ్ చేసిన తర్వాత ఈ ఫేస్ ప్యాక్ ను శుభ్రమైన నీటితో శుభ్రం చేసుకోండి. ముఖంపై మెరుపు వస్తుంది.