పిల్లల్ని కనాలనుకుంటున్నారా? అయితే ఈ రోజు నుంచే మునక్కాడలు తినడం ప్రారంభించండి

Best Web Hosting Provider In India 2024

పిల్లల్ని కనాలనుకుంటున్నారా? అయితే ఈ రోజు నుంచే మునక్కాడలు తినడం ప్రారంభించండి

Haritha Chappa HT Telugu

మునగకాయలు వేసవిలో అధికంగా దొరుకుతాయి. ఒక్క మునగ చెట్టు వేస్తే చాలు విరగ కాసేస్తుంది. మునక్కాడలతో పాటు మునక్కాడలోని గింజలు కూడా వేసవిలో తినడం చాలా అవసరం.

మునక్కాయలతో ఉపయోగాలు

కేవలం దక్షిణ భారతదేశంలోనే కాదు భారతదేశమంతటా మునక్కాయలకు అభిమానులు ఉన్నారు. కూరలు, సాంబార్లలో అధికంగా వాడతారు. ఉల్లిపాయ, టమాటా, మునక్కాడలు వేసే వంటకానికి తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది ఫిదా అయిపోయారు.

మునక్కాడలు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ముఖ్యంగా వేసవిలో మీరు వీటిని కచ్చితంగా తినాలి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది మొత్తం ఆరోగ్యాన్ని కాపాడతాయి.

మునక్కాయలు ఎందుకు తినాలి?

కేవలం మనమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది ఎన్నో దేశాల వారు మునక్కాయలను తమ ఆహారంలో భాగం చేసుకున్నారు. వీటిని తినడం వల్ల శరీరం నుండి వ్యర్ధాలు విషాలు బయటికి తొలగిపోతాయి. మునక్కాడలో క్లోరోఫిల్స్, థియోసైనేట్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి కాలేయం, రక్తం నుంచి విషాన్ని తొలగించి బయటికి పంపిస్తాయి. అలాగే శరీరంలో పేరుకుపోయిన లోహాలను హారికరమైన రసాయనాలను కూడా బయటికి పంపుతాయి. కాబట్టి మీరు తరచూ మునక్కాయలను తినాల్సిన అవసరం ఉంది.

మునగతో లాభాలు
మునగతో లాభాలు

రోజువారీ ఆహారంలో మునక్కాయలను చేర్చుకోవడం వల్ల కాలేయ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీరు కాలేయాన్ని కాపాలనుకుంటే మునక్కాయలతో పాటు ఆ మునక్కాయల్లోని గింజలను కూడా తినేందుకు ప్రయత్నించండి.

మునగకాయల్లో కాల్షియం, ఇనుము, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ కూడా ఎముకలను బలోపేతం చేస్తాయి. మునక్కాయల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ. మహిళలు ఆస్ట్రియాపోరోసిస్ వంటి సమస్యల బారిన పడకుండా ఉండాలంటే మునగకాయలను తినేందుకు ప్రయత్నించాలి.

పిల్లల్ని కనాలనుకుంటే తినండి

ఆయుర్వేద వైద్యంలో కూడా మునగను ఉత్తమ ఆహారంగా చెబుతారు. మునగకాయలో పాలిఫెనాల్స్ ఉంటాయి. ఇవి మనిషి పునరుత్పత్తి ఆరోగ్యానికి ఎంతో మంచిది. ముఖ్యంగా పురుషులు మునక్కాయలు తినాల్సిన అవసరం ఉంది. ఇవి తినడం వల్ల వారిలో వీర్య నాణ్యత మెరుగుపడుతుంది. పిల్లలను కనేందుకు ప్లాన్ చేసుకుంటున్న వారు… వారంలో నాలుగైదు సార్లు మునక్కాయలను తినడం వల్ల వారిలో సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. అలాగే లైంగిక సామర్థ్యం కూడా పెరుగుతుంది.

మునక్కాయలో పునరుత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది
మునక్కాయలో పునరుత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది (Pixabay)

శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు కూడా మునక్కాడలను తినడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. దీర్ఘకాలికంగా వారు పడుతున్న ఇబ్బందిని మునక్కాడలు తగ్గిస్తాయి. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియాల్ సమ్మేళనాలు వీటిలో అధికంగా ఉంటాయి. అవి ఉబ్బసం, బ్రాంకైటిస్ వంటి సమస్యల నుండి కాపాడతాయి. ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన శ్లేష్మాన్ని కూడా తొలగిస్తాయి.

డయాబెటిస్ వారు కూడా మునక్కాడలను ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటిలో ఉండే గుణాలు రక్తంలో చక్కెర స్థాయిలను పెరగకుండా అడ్డుకుంటాయి. వీటిలో బయోయాక్టివ్ ప్లాంట్ సమ్మేళనాలు ఉంటాయి. కాబట్టి చక్కెర శోషణను నెమ్మదించేలా చేస్తాయి. ఇన్సులిన్ సున్నితత్వాన్ని కూడా మెరుగుపరుస్తాయి. కాబట్టి టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు మునక్కాడలను వారంలో నాలుగైదు సార్లు తినేందుకు ప్రయత్నించండి.

మానసిక ఆరోగ్యానికి కూడా మునక్కాయలు చేసే మేలు ఎంతో. ఎందుకంటే ఈ మునక్కాయల్లో ట్రిఫ్టోఫాన్ అనే ఆమ్లం ఉంటుంది. ఇది ముఖ్యమైన అమైనో ఆమ్లం. దీన్ని తినడం వల్ల సంతోషకర హార్మోన్ అయిన సరటోనిన్ ఉత్పత్తి పెరుగుతుంది. దీనివల్ల నాడీ వ్యవస్థ ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి సంతోషంగా జీవించాలంటే మునక్కాయలను ఆహారంలో భాగం చేసుకోండి.

(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024