కమల్ సార్ నాకు మెంటర్.. మణిరత్నంతో సింక్ కుదిరింది.. త్రిష ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Best Web Hosting Provider In India 2024

కమల్ సార్ నాకు మెంటర్.. మణిరత్నంతో సింక్ కుదిరింది.. త్రిష ఇంట్రెస్టింగ్ కామెంట్స్

కమల్ హాసన్, మణిరత్నంపై స్టార్ హీరోయిన్ త్రిష ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది. థగ్ లైఫ్ ప్రమోషన్లలో బిజీగా ఉన్న ఆమె.. మూవీ టీమ్ గురించి మాట్లాడింది. మణిరత్నంతో కలిసి ఎదిగానని పేర్కొంది.

కమల్ హాసన్, త్రిష, శింబు

క్రేజీ కలయికలో రెడీ అయిన సినిమా ‘థగ్ లైఫ్’. మణిరత్నం, కమల్ హాసన్ చాలా కాలం తర్వాత కలిసి సినిమా కోసం పని చేశారు. సిలంబరసన్, త్రిష లాంటి స్టార్ క్యాస్టింగ్ తో మూవీ రెడీ అయింది. ఇలాంటి కాంబినేషన్లో సినిమా అనగానే అంచనాలు పెరిగిపోయాయి. జూన్ 5న థియేటర్లలో రాబోతున్న ఈ సినిమా టీమ్ ప్రమోషన్లలో జోరు కొనసాగిస్తోంది. తాజాగా త్రిష.. థగ్ లైఫ్ గురించి మాట్లాడుతూ కమల్ హాసన్, మణిరత్నం గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది.

చాలా ఏళ్లుగా

ఇండియా టుడేతో ఇంటర్వ్యూలో త్రిష ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది. “శింబు, కమల్ సార్ ను చాలా కాలం నుంచి తెలుసుకుంటూనే ఉన్నా. కాబట్టి ఈ మూవీలో షూటింగ్ లో ఈజీగా అనిపించింది. నా సినీ జీవితంలో కమల్ హాసన్ సార్ నా మెంటర్. శింబుతో కలిసి రెండు సినిమాల్లో యాక్ట్ చేశా. మేము చాలా కాలంగా ఒకరికొకరం తెలుసు. అందుకే థగ్ లైఫ్ సెట్ లోకి అడుగుపెట్టినప్పుడు ఎంతో సెఫ్టీగా అనిపించింది. అది నాకు సురక్షితమైన ప్రదేశంలా అనిపించింది’’ అని త్రిష తెలిపింది.

కలిసి ఎదిగా

‘‘’పొన్నియిన్ సెల్వన్’ చేయడంతో మణిరత్నం సార్ ని మరింత అర్థం చేసుకోగలిగా. నేను ఆయనతో కలిగి ఎదిగానని అనిపిస్తోంది. ఎవరితోనైనా పదే పదే పనిచేయడం వల్ల మీరు బంధాన్ని ఏర్పరచుకోవడానికి లేదా ఒకరినొకరు మెరుగ్గా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నా నుంచి ఎలాంటి యాక్టింగ్ రాబట్టాలో ఆయనకు తెలుసు. నాకు ఆయనతో కంఫార్ట్ గా ఉంది. మాకు సింక్ కుదిరింది’’ అని త్రిష చెప్పింది.

థగ్ లైఫ్ గురించి

థగ్ లైఫ్ లో కమల్ హాసన్, సిలంబరసన్ టీఆర్, త్రిష, అభిరామి, ఐశ్వర్య లక్ష్మి, అశోక్ సెల్వన్, సాన్యా మాల్హోత్రా, జోజు జార్జ్, నాజర్, అలీ ఫజల్, పంకజ్ త్రిపాఠి, రోహిత్ సారఫ్, బాబురాజ్ తదితరులు నటించారు. ఈ మూవీ జూన్ 5న థియేటర్లలో విడుదల కానుంది. ఇటీవల రిలీజైన థగ్ లైఫ్ ట్రైలర్ అంచనాలను మరింత పెంచేసింది. ఈ ట్రైలర్ లో త్రిష, అభిరామితో కలమ్ రొమాన్స్ హాట్ టాపిక్ గా మారింది.

42 ఏళ్ల త్రిష ‘పొన్నియిన్ సెల్వన్ 1, 2’ చిత్రాలలో దర్శకుడు మణిరత్నం తో పనిచేసింది. తాజాగా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రంలో కనిపించింది త్రిష. 2010 లో ‘మన్మధన్ అంబు’, 2015 లో ‘తుంగా వనం’ చిత్రాల్లో కమల్ తో కలిసి నటించింది. 2010 లో విడుదలైన సూపర్ హిట్ రొమాంటిక్ చిత్రం ‘విన్నైతాండి వారువాయా’ లో సిలంబరసన్ తో రొమాన్స్ చేసింది. 2003 లో విడుదలైన ‘అలై’ చిత్రంలో కూడా ఈ ఇద్దరు కలిసి నటించారు.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024