Best Web Hosting Provider In India 2024

బ్రహ్మముడి మే 23 ఎపిసోడ్: యామిని నుంచి ఇంట్లోవాళ్లను కాపాడిన రాజ్- చిరంజీవితో కావ్యకు పోలిక- అప్పుకు జాబ్ పోయే ప్రమాదం!
బ్రహ్మముడి సీరియల్ మే 23 ఎపిసోడ్లో యామిని పంపిన మనిషి జనాభా లెక్కలంటూ వస్తాడు. కావ్య గురించి మర్చిపోయారని రుద్రాణి ఇరికిస్తుంది. దాంతో ఎటు ఏం చెప్పలేక ఇంట్లోవాళ్లు అవస్థలు పడుతుంటే రాజ్ కాపాడుతాడు. దాంతో రుద్రాణిని తీసుకెళ్లి చెంపదెబ్బలు కొడుతుంది ఇందిరాదేవి. అప్పుకు జాబ్ పోయే ప్రమాదం ఏర్పడుతుంది.
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో జనాభా లెక్కలు రాసుకునే వ్యక్తిగా వచ్చిన యామిని మనిషి వెళ్లిపోతుంటే.. రుద్రాణి ఆపుతుంది. ఇంట్లో ముఖ్యమైన కావ్య గురించి రాయలేదు అని రుద్రాణి అంటుంది. ఏంటీ కళావతి మీ అత్తయ్య మరిచిపోవచ్చు. నువ్వు కూడా మర్చిపోతే ఎలా. ఆఫీసర్ మీరు రాసుకోండి. తనపేరు కళావతి అని రుద్రాణి అంటుంది.
కోడలు అంటే
ఈవిడ ఈ ఇంటికి ఏమవుతారు. చెప్పండి ఏమవుతారు అని యామిని మనిషి అడుగుతాడు. దాంతో అంతా కంగారుపడిపోతుంటారు. ఇంటికి కాదు మా వదినకు కోడలు అవుతుంది అని రుద్రాణి అంటుంది. కోడలు అంటే జనాభా లెక్కల ఆఫీసర్ అడిగితే.. అది మా వదిన చెబుతుంది అని అపర్ణను ఇరికిస్తుంది రుద్రాణి. చెప్పండి కోడలు అంటే అని ఆఫీసర్ అంటాడు.
చెప్పు వదినా. ఇప్పుడు నిజం చెప్పక తప్పదు అని రుద్రాణి అనుకుంటుంది. ఏంటీ ఆఫీసర్ అలా అడుగుతారు. కళావతి గారు ఆవిడకు మేనకోడలు అని రాజ్ అంటాడు. అలా రుద్రాణి, యామిని వేసిన ప్లాన్ నుంచి కావ్యను, ఇంట్లోవాళ్లను రాజ్ కాపాడుతాడు. తొక్క వలచి నిజాలన్ని ముందు పెట్టిన నిజం తెలుసుకోలేకపోతున్నావేంటీ రాజ్. నువ్ మరి ఇంత తింగరోడిలా ఉన్నావేంట్రా బాబు అని రుద్రాణి మనసులో అనుకుంటుంది.
మేనకోడలు అయితే వాళ్ల అమ్మా నాన్న ఎక్కడున్నారు అని ఆఫీసర్ అడుగుతాడు. వాళ్లింట్లో ఉన్నారు. మా కోడలు కావ్యను పెంచుకుంటుంది అని ఇందిరాదేవి అంటుంది. మరి ఆవిడ ఏ ఇంటి మనిషి అని ఆఫీసర్ అంటే.. మా కావ్య అందరి మనిషి అని ప్రకాశం అంటాడు. చిరంజీవి అందరివాడే. అలా అని అన్నిచోట్ల రాయలేంగా. తన అడ్రెస్ ప్రూఫ్‌లో ఏ అడ్రస్ ఉంది అని చిరంజీవితో కావ్యను పోలుస్తాడు ఆఫీసర్.
రుద్రాణిని కొట్టిన తల్లి
ఈ ఇంటి అడ్రస్సే ఉంది అని ఇందిరాదేవి అంటుంది. అయితే, ఈ ఇంటి మనిషి. ఇక ఏ ప్రాబ్లమ్ లేదు అని ఆఫీసర్ వెళ్లిపోతాడు. అమ్మ రుద్రాణి ఇలా రా అమ్మా. నీతో చాలా పని ఉందని ఇందిరాదేవి పిలుస్తుంది. అంతా కలిసి రుద్రాణిని ఇందిరాదేవితో పంపిస్తారు. అది చూసి ఎంత అన్యూన్యమైన కుటుంబమూ అని రాజ్ అంటాడు. రుద్రాణిని గదిలోకి తీసుకెళ్లిన ఇందిరాదేవి చెంపలు వాయిస్తుంది.
ఆ సౌండ్ విన్న రాజ్ అనుమానంగా పెళ్లుమని ఏదో వినిపించిందని అడుగుతాడు. ఏం లేదని అంతా కవర్ చేస్తారు. చెంప మీద చేయి పెట్టుకుని రుద్రాణి బయటకు దొంగచాటుగా వస్తుంది. ఇంతలో స్వప్న పిలిచి మొహం చాటేసి వెళ్లిపోతున్నావ్. లోపల ఏం జరిగింది అని స్వప్న అడుగుతుంది. నీకెందుకు అని రుద్రాణి అంటుంది. మీరు వెళ్లగానే సౌండ్ వచ్చింది. ఏంటా అని స్వప్న అంటుంది.
రుద్రాణి కవర్ చేస్తుంది. అది చెంప చెల్లుమనిపించిన సౌండ్‌లా ఉందేంటీ అని చెంప మీద చేయి అచ్చులు చూస్తుంది స్వప్న. అత్తయ్య మొహం కందిపోయిందేంటీ. నీ చెంప పగులగొట్టింది అమ్మమ్మ గారే అని నాకు తెలుసు. పనికి రాని విషయాల్లో వేలు పెడితే ఇలాగే ఉంటుంది. ఇంకొక్కసారి నా చెల్లి జోలికి వస్తే ఇదే పని నేను చేయడానికి కూడా వెనుకాడను. నీ వయసుకు తగిన పనులు చేస్తే బెటర్ అని స్వప్న ఏడిపించి వార్నింగ్ ఇస్తుంది.
కావ్య కౌంటర్స్
ఏం చేయాలో నాకు తెలుసు అంటూ రుద్రాణి వెళ్లిపోతుంది. నీ బుద్ధి రాహుల్ కక్కుర్తి మారితే చూడాలని ఉంది. మారుస్తా. త్వరలోనే మీకు జ్ఞానోదయం కలిగిస్తా అని స్వప్న అనుకుంటుంది. కిచెన్‌లో కావ్య పని చేసుకుంటుంటే రాజ్ వచ్చి అలాగే చూస్తాడు. అది కావ్య చూస్తుంది. రాజ్, కావ్య మాట్లాడుకుంటారు. కావ్య కౌంటర్స్ వేస్తుంది. సారీ యాక్సెప్ట్ చేసినట్లుగా ఓ కాఫీ ఇవ్వండి అని రాజ్ అంటే కావ్య ఇవ్వను అని వెళ్లిపోతుంది.
ఇంతలో ఇందిరాదేవి, అపర్ణ వచ్చి కాఫీ కోసం ఇంతలా అడుక్కోవాలా అని అంటారు. రొమాంటిక్‌గా అడుగుతున్నాను అని రాజ్ అంటాడు. వెళ్లి కావ్యకు ప్రపోజ్ చేయొచ్చుగా అని రాజ్‌ను ఇందిరాదేవి, అపర్ణ మోటివేట్ చేస్తారు. రేపు చెబుతాను. శుక్రవారం అమ్మవారి ఆశీర్వాదం ఉంటుంది అని రాజ్ అంటాడు. దాంతో ఇందిరాదేవి కౌంటర్స్ వేస్తారు. ఈరోజు రాత్రి ఫుల్‌గా ప్రిపేర్ అవుతా. రేపు వచ్చి మీ మనవరాలికి ప్రపోజ్ చేస్తాను అని చెప్పి వెళ్లిపోతాడు రాజ్.
నా కొడుకును చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. వాడికి గతం గుర్తుకు రాకపోయినా పర్వాలేదు. జీవితాంతం ఇలా సంతోషంగా నా కోడలిని ప్రేమిస్తూ పిల్లల్ని కంటే చాలు అని అపర్ణ అంటుంది. ఆ మాటలను రాహుల్ వింటాడు. అలా జరగాలంటే కావ్య ఒప్పుకోవాలిగా అని ఇందిరాదేవి అంటుంది. ఎలాగైనా ఒప్పించాలిగా అని కావ్య దగ్గరికి వెళ్తారు ఇందిరాదేవి, అపర్ణ. పెద్ద ప్లానే వేశారు అని రుద్రాణికి చెప్పేందుకు వెళ్తాడు రాహుల్.
సెకండ్ ఇన్నింగ్స్
రేపు అత్తయ్య, అమ్మమ్మ పెద్ద ప్లాన్ వేశారు. రాజ్ గాడితో కావ్యకు లవ్ ప్రపోజ్ చేయించబోతున్నారు. అదే జరిగితే రాజ్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలైనట్లే. తర్వాత పెళ్లి అంటారు. ఇంటికొచ్చి రాజ్ కూర్చొంటాడు. కావ్య ఎలాగైన గతం గుర్తు చేస్తుంది అని రాహుల్ అంటాడు. అలా జరగడానికి వీళ్లేదు అని యామినికి రుద్రాణి కాల్ చేస్తుంది. రేపు కావ్యకు రాజ్ లవ్ ప్రపోజ్ చేయబోతున్నాడు. కావ్య ఒప్పుకుంటే రాజ్ ఇక్కడే సెటిల్ అయిపోతాడు అని రుద్రాణి అంటుంది.
రేపు రాజ్‌ను ఎలా ఆపుతావో చూసుకో. అలా జరిగితేనే రాజ్ నీ సొంతం అవుతాడు. బాగా ఆలోచించుకో అని యామినికి రుద్రాణి చెబుతుంది. దాంతో యామిని భయపడుతుంది. యామిని ఆపుతుందా అని రాహుల్ అంటే.. ఆపుతుంది. వాడంటే అంత ఇష్టం. వాడిని చంపినా చంపుతుంది కానీ ఎవరికి దక్కనివ్వదు అని రుద్రాణి చెబుతుంది. మరోవైపు చార్లెస్‌ను అప్పు పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్తుంది.
ఎలా వచ్చానో అంత ఈజీగా వెళ్లగలను అని చార్లెస్ అంటాడు. కరెక్టే అని సీఐ చెబుతాడు. ఈసారి తప్పించుకుంటే హాఫ్ సెంచరి పూర్తి అవుతుంది. ఈసారి వాడిని కోర్టుకు తీసుకెళ్తేనే మన పరువు ఉంటుంది. మీడియా వాళ్లు కాచుకుకూర్చుంటారు. వాడు తప్పించుకుంటే నీ ఉద్యోగమే పోతుంది అని సీఐ అంటాడు. వాడు ఈసారి కోర్టు మెట్లు ఎక్కుతాడు అని అప్పు అంటుంది.
లవ్ ప్రపోజ్
అనవసరంగా ఛాలెంజ్ చేశారు. మీ ఉద్యోగం పోవడం ఖాయం. నేను తప్పించుకుంటాను అని చార్లెస్ అంటాడు. దాంతో ఫుల్ బిర్యాని పెట్టి నిద్రపోకుండా లాఠీలతో కొట్టండి అని అప్పు అంటుంది. కానీ, చార్లెస్ అనే దొంగతో అప్పు జాబ్ పోయే ప్రమాదంలో పడినట్లు తెలుస్తోంది. తర్వాత కావ్యతో అపర్ణ, ఇందిరాదేవి మాట్లాడుతారు. ఇప్పుడు ప్లాన్ వేరు. వాడే వచ్చి నీకు లవ్ ప్రపోజ్ చేస్తాడు. నువ్ ఇవాళ చేసినట్లు కాకుండా ఒప్పుకో అని అపర్ణ చెబుతుంది.
వాడికి గతం గుర్తు చేస్తే సమస్య నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటే కాదు కదా అని ఇందిరాదేవి అంటుంది. గతం గుర్తుకు రాకుండానే నాకు పెళ్లి అయిందనే విషయం తెలిస్తే తను రామ్ ఆ రాజ్ ఆ అని, అబద్ధం చెప్పి మోసం చేసి పెళ్లి చేశామని మళ్లీ గొడవ చేయరా అని కావ్య అంటుంది. అలా అని వదిలేస్తే యామిని ఊరుకుంటుందా. యామిని అడ్డుకోవాలంటే వాడికి నీ మీద కలిగిన ప్రేమను వాడుకోవాలి అని ఇందిరాదేవి అంటుంది.
సినిమా చూస్తావ్
ఇప్పుడు నువ్ ఆలోచిస్తుంటే నాకు భయమేస్తుంది అని అపర్ణ అంటుంది. ఏం చేయాలి అని కావ్య అంటే.. ప్రపోజ్ చేస్తే ఒప్పుకోవాలి. పంతులును పిలిపిస్తే పెళ్లి చేసుకోవాలి అని అపర్ణ, ఇందిరాదేవి అంటుంది. రేపు మా ప్లాన్ ఫెయిల్ అయితే సినిమా చూస్తావ్ అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతారు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.