





Best Web Hosting Provider In India 2024

ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సూపర్ హిట్ కామెడీ థ్రిల్లర్.. జాతకాల పిచ్చితో మర్డర్ ప్లాన్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
తెలుగు సూపర్ హిట్ కామెడీ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. మర్డర్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ ఈ రోజు (మే 23) నుంచే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో ఉందో చూసేయండి.
ఓటీటీలోకి కొత్త సినిమాలను మోసుకొస్తూ మరో శుక్రవారం (మే 23) వచ్చేసింది. డిఫరెంట్ జోనర్ సినిమాలు ఆడియన్స్ ను అలరించేందుకు వచ్చేశాయి. ఇందులో ఓ తెలుగు కామెడీ థ్రిల్లర్ స్పెషల్ గా నిలుస్తోంది. అదే ‘సారంగపాణి జాతకం’. కామెడీ క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ మూవీ ఈ రోజు నుంచే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.
ఆ ఓటీటీలోకి
ప్రియదర్శి లీడ్ రోల్ లో యాక్ట్ చేసిన ‘సారంగపాణి జాతకం’ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లోనూ ఈ సినిమా ఫ్యాన్స్ ను అలరిస్తోంది. ఏప్రిల్ 25న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ నెలలోపే ఓటీటీలోకి వచ్చేసింది.
మిక్స్ డ్ రెస్పాన్స్
జాతకాల పిచ్చి, కామెడీ, మర్డర్ ప్లాన్, కాస్త థ్రిల్.. ఇలాంటి ఎలిమెంట్స్ తో సాగే సారంగపాణి జాతకం మూవీకి థియేటర్లలో మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే కామెడీ లవర్స్ కు మాత్రం ఈ మూవీ పిచ్చిపిచ్చిగా నచ్చేసింది. జాతకాలను నమ్మడం వల్ల తలెత్తే అనార్థల గురించి కామెడీగా చెప్పి నవ్వించింది ఈ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీలో ప్రియదర్శితో పాటు వెన్నెల కిశోర్, రూప కొడువాయూర్ కీలక పాత్రలు పోషించారు.
నవ్వాలంటే చూసేయండి
ఓటీటీలో మంచి కామెడీ సినిమా, కాసంత థ్రిల్ కోసం చూస్తున్న ప్రేక్షకులకు సారంగపాణి జాతకం బెస్ట్ మూవీ. ఈ సినిమా కడుపుబ్బా నవ్విస్తుంది. మోహనక్రిష్ణ ఇంద్రగంటి ఈ మూవీకి డైరెక్టర్. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక క్రిష్ణ ప్రసాద్ ఈ మూవీ నిర్మించారు. వివేక్ సాగర్ మ్యూజిక్ అందించారు.
కథ ఏమిటంటే?
సారంగపాణి(ప్రియదర్శి) ఓ కార్ షోరూమ్‌లో సేల్స్‌మెన్‌గా పనిచేస్తుంటాడు. జాతకాల పిచ్చి ఎక్కువ. చేతి గీతలే తన తలరాతను నిర్దేశిస్తాయని నమ్ముతుంటాడు. తన షోరూమ్‌లోనే మేనేజర్‌గా పనిచేసే మైథలిని (రూప కొడవాయూర్) ఇష్టపడతాడు. మైథిలి కూడా సారంగపాణిని ప్రేమిస్తుంది. పెద్దలను ఒప్పించి మైథిలితో ఏడడుగులు వేయాలని సారంగపాణి అనుకుంటాడు. ఎంగేజ్‌మెంట్ జరుగుతుంది.
సాఫీగా సాగిపోతున్న సారంగపాణి జీవితం ఆస్ట్రాలజర్ జిగేశ్వనంద్ (శ్రీనివాస్ అవసరాల) కారణంగా అనుకోని మలుపులు తిరిగుతుంది. సారంగపాణి ఓ మర్డర్ చేస్తాడని అతడి చేతి రేఖలు చూసి జాతకం చెబుతాడు జిగేశ్వరనంద్. హంతకుడి భార్య అనే ముద్ర మైథిలిపై పడకూడదని పెళ్లికి ముందే ఓ హత్య చేయాలని సారంగపాణి ప్లాన్స్ చేస్తాడు.
ఈ మర్డర్ ప్లాన్‌లో సారంగపాణికి అతడి స్నేహితుడు చందు (వెన్నెలకిషోర్) ఎలా సాయం చేశాడు. అహోటెల్ ఓనర్ అహోబిలరావును (తనికెళ్ల భరణి) చంపమని సారంగపాణికి జిగేశ్వరనంద్ ఎందుకు చెప్పాడు? అతడి మర్డర్ ప్లాన్ సక్సెస్ అయ్యిందా? సారంగపాణితో ఎంగేజ్‌మెంట్‌ను మైథిలి ఎందుకు క్యాన్సిల్ చేసుకుంది? జాతకాల పిచ్చి కారణంగా సారంగపాణి ఎలాంటి కష్టాలను ఎదర్కొన్నాడు అన్నదే సారంగపాణి జాతకం మూవీ కథ.
సంబంధిత కథనం