ఇండియాలో ఫుడ్ లవర్స్ కచ్చితంగా సందర్శించాల్సిన 5 నగరాలు ఇవే, ఎంత తిన్నా ఇంకా కావాలనిపిస్తుంది

Best Web Hosting Provider In India 2024

ఇండియాలో ఫుడ్ లవర్స్ కచ్చితంగా సందర్శించాల్సిన 5 నగరాలు ఇవే, ఎంత తిన్నా ఇంకా కావాలనిపిస్తుంది

Haritha Chappa HT Telugu

ఫుడ్ లవర్స్ ఎంతో మంది ట్రావెల్ వ్లాగ్ లు చేస్తున్నారు. రకరకాల ఫుడ్ ను పరిచయం చేస్తున్నారు. ఫుడ్ లవర్స్ కచ్చితంగా సందర్శించాల్సిన నగరాలు కొన్ని ఉన్నాయి. ఇండియాలో ఉన్న ఈ నగరాలకు వెళితే ఎంత తిన్నా తనివి తీరనన్ని వెరైటీ ఫుడ్స్ దొరుకుతాయి.

బెస్ట్ ఫుడ్స్ దొరికే ఇండియన్ సిటీస్ ఏవి? (pixabay)

భారతదేశంలోని ప్రతి నగరానికి ప్రత్యేకత ఉంది. స్థానికంగా దొరికే ఎన్నో రకాల వంటకాలు కూడా ఉన్నాయి. మీకు ట్రావెలింగ్ అంటే ఇష్టమైతే, మీరు మంచి ఆహార ప్రియులు కూడా అయితే మీకోసమే ఇక్కడ మేము బెస్ట్ ఫుడ్ దొరికే నగరాల గురించి ఇచ్చాము.

ఇండియాలోనే ఈ అయిదు నగరాలకి వెళ్లారంటే రకరకాల ఫుడ్స్ దొరుకుతాయి. ఎంత తిన్నా ఇంకా తినాలనిపించేలా ఉంటాయి. ఈ రుచికరమైన వంటకాలను టేస్ట్ చూడాలంటే మీ పొట్టను ఖాళీ ఉంచుకునే వెళ్లారు. మీరు టేస్టీ ఫుడ్ తినేందుకు ఏ నగరాలను ఇండియాలో సందర్శించాలో తెలుసుకోండి.

చోలే కుల్చే రెసిపీ
చోలే కుల్చే రెసిపీ (nehascookbook.com)

అమృత్ సర్

పంజాబీ ఫుడ్ చాలా పాపులర్. మీరు అమృత్ సర్ వెళ్లారంటే అన్ని రకాల పంజాబీ స్పెషల్ ఫుడ్స్ దొరుకుతాయి. చోలే-కుల్చే, అమృత్ సర్ చేపల కూర, మలై లస్సీ కచ్చితంగా టేస్ట్ చూడాలి. గోల్డెన్ టెంపుల్ సమీపంలోని దాబాల్లో వడ్డించే పప్పు, లంగర్ ఫుడ్ కూడా చాలా రుచిగా ఉంటాయి. వీటిని టేస్ట్ చూడకుండా వెనక్కి రాకండి.

ఢిల్లీ

మీరు మొదటిసారి ఢిల్లీని సందర్శించడానికి వచ్చినట్లయితే, ఇక్కడ చాందినీ చౌక్ కు వెళ్లడం మర్చిపోవద్దు. ఈ ప్రదేశం భోజన ప్రియులకు స్వర్గధామం. పరాథా వాలీ గలీ, గోల్ గప్పాస్, దహీ భల్లాల పరాఠాలు మీకు ఎంతో నచ్చుతాయి. ఓల్డ్ ఢిల్లీ బిర్యానీ, కబాబ్ రుచి మీరు తిన్నారంటే మర్చిపోలేరు. స్నేహితులతో వెళ్లి ఇక్కడ ఎంజాయ్ చేసి రండి

లక్నో తందూరీ ముర్గ్
లక్నో తందూరీ ముర్గ్

లక్నో

లక్నోలోని ప్రసిద్ధ గలౌటీ కబాబ్స్, తందూరీ ముర్గ్, బిర్యానీ జీవితంలో ఒక్కసారైనా తినాల్సిందే. తుండే కబాబీ, ఇద్రిస్ బిర్యానీ ప్రతి ఆహారప్రియుడికి నచ్చడం ఖాయం. స్వీట్స్ విషయానికి వస్తే క్రీమ్ పాన్, రాయల్ పీస్ కూడా ఇక్కడ రుచి చూడొచ్చు. ఇంటికి తీసుకెళ్లీ మీ వారికి తినిపించవచ్చు.

కోల్ కతా

బెంగాలీ సంస్కృతితో ఆహారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. కోల్ కతా ఫుడ్స్ లో కోషా మంగ్షో, షోర్షే, మిష్టి దోయ్ ఎంతో అద్భుతంగా ఉంటాయి. ఇవి అన్ని చోట్ల దొరకవు. ఫ్లోరీ పేస్ట్రీ, పార్క్ స్ట్రీట్ రోల్స్ కూడా ఇక్కడ చాలా ప్రసిద్ధి చెందాయి.

హైదరాబాదీ హలీమ్
హైదరాబాదీ హలీమ్ (headbangerskitchen.com)

హైదరాబాద్

నవాబుల నగరం హైదరాబాద్. ఇక్కడి బిర్యానీ, హలీమ్ కచ్చితంగా రుచి చూడాల్సిందే. ప్రపంచంలోనే బెస్ట్ బిర్యానీ దొరికేది ఇక్కడే. చార్మినార్ సమీపంలోని స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ లో కబాబ్ లు, పాయలు, కుర్బానీ కా స్వీట్స్ వంటివి దొరుకుతాయి. ఇవన్నీ ఎంత తిన్నా మళ్లీ మళ్లీ కావాలనిపిస్తుంది.

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024