థియేట‌ర్ల‌లో డిజాస్ట‌ర్ – ఓటీటీలో బ్లాక్‌బ‌స్ట‌ర్ – వంద మిలియ‌న్ల వ్యూస్‌తో కుమ్మేసిన తెలుగు యాక్ష‌న్ కామెడీ మూవీ

Best Web Hosting Provider In India 2024

థియేట‌ర్ల‌లో డిజాస్ట‌ర్ – ఓటీటీలో బ్లాక్‌బ‌స్ట‌ర్ – వంద మిలియ‌న్ల వ్యూస్‌తో కుమ్మేసిన తెలుగు యాక్ష‌న్ కామెడీ మూవీ

Nelki Naresh HT Telugu

నితిన్ రాబిన్‌హుడ్ మూవీ ఓటీటీలో కుమ్మేస్తోంది. వంద మిలియ‌న్ల స్ట్రీమింగ్ మిన‌ట్ వ్యూస్‌ను సొంతం చేసుకున్న‌ది. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ జీ5 ఓటీటీ ఓ పోస్ట‌ర్‌ను అభిమానుల‌తో షేర్ చేసుకుంది. వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్‌గా న‌టించింది.

రాబిన్‌హుడ్ ఓటీటీ

థియేట‌ర్ల‌లో డిజాస్ట‌ర్‌గా నిలిచిన నితిన్ రాబిన్‌హుడ్ ఓటీటీలో కుమ్మేస్తోంది. జీ5ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ యాక్ష‌న్ కామెడీ మూవీ వంద మిలియ‌న్ల స్ట్రీమింగ్ మిన‌ట్ వ్యూస్‌ను సొంతం చేసుకున్న‌ది. ఈ విష‌యాన్ని జీ5 ఓటీటీ అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించింది. ఓ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసింది.

ఒకే రోజు ఓటీటీలో…టీవీలో…

నితిన్‌, శ్రీలీల జంట‌గా న‌టించిన ఈ మూవీ ఓటీటీలో రిలీజైన రోజు టీవీలోనూ ప్రీమియ‌ర్ టెలికాస్ట్ అయ్యింది. అయినా ఓటీటీలో మాత్రం మంచి రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది. మ‌నీ హీస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్ష‌న్ కామెడీ మూవీగా తెర‌కెక్కిన రాబిన్‌హుడ్‌కు వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మించింది.

అర‌వై కోట్ల బ‌డ్జెట్‌…

దాదాపు అర‌వై కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన రాబిన్‌హుడ్‌ మూవీ 15 కోట్ల‌లోపే వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. బ‌డ్జెట్‌లో ఇర‌వై ఐదు శాతం కూడా రిక‌వ‌రీ సాధించ‌లేక‌పోయింది. ఈ ఏడాది టాలీవుడ్‌లో నిర్మాత‌ల‌కు భారీగా న‌ష్టాలు మిగిల్చిన సినిమాల్లో ఒక‌టిగా రాబిన్‌హుడ్ నిలిచింది. కామెడీ బాగున్నా కాన్సెప్ట్ ఔట్‌డేటెడ్ కావ‌డంతో ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయింది.

డేవిడ్ వార్న‌ర్ గెస్ట్ రోల్‌…

రాబిన్‌హుడ్‌లో రాజేంద్ర‌ప్ర‌సాద్‌, దేవ ద‌త్త్ నాగే, వెన్నెల‌కిషోర్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఆస్ట్రేడియ‌న్ క్రికెట‌ర్ డేవిడ్ వార్న‌ర్ అతిథి పాత్ర‌లో న‌టించాడు. కేతికా శ‌ర్మ స్పెష‌ల్ సాంగ్‌లో మెరిసింది.

రామ్…రాబిన్‌హుడ్‌గా మారితే…

రామ్ ఓ అనాథ‌. త‌న‌తో పాటు అనాథ‌శ్ర‌మంలో పెరుగుతోన్న చిన్నారులు ఆక‌లితో అల‌మ‌టించ‌డం చూడ‌లేక రాబిన్‌హుడ్‌గా పేరు మార్చుకొని దొంగ‌త‌నాలు చేయ‌డం మొద‌లుపెడ‌తాడు. రాబిన్‌హుడ్‌ను ఎలాగైనా ప‌ట్టుకోవాల‌ని పోలీస్ ఆఫీస‌ర్ విక్ట‌ర్ గ‌ట్టి ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. విక్ట‌ర్ కార‌ణంగా దొంగ‌త‌నాల‌కు పుల్‌స్టాప్ పెట్టి జాన్ స్నో న‌డుపుతోన్న సెక్యూరిటీ ఏజెన్సీలో జాబ్‌లో చేరుతాడు రామ్‌.

ఆస్ట్రేలియా నుంచి వ‌చ్చిన నీరా వాసుదేవ్‌ సెక్యూరిటీ బాధ్య‌త‌ల‌ను రామ్‌, జాన్ స్నో తీసుకుంటారు. త‌న తాత‌య్య‌ను క‌ల‌వ‌డానికి వ‌చ్చిన నీరా ఎలా క‌ష్టాల్లో ప‌డింది? నీరాను చంపేందుకు సామీ అనే డ్ర‌గ్ డీల‌ర్ ఎలాంటి ప్ర‌య‌త్నాలు చేశాడు? అత‌డి బారి నుంచి నీరాను రామ్ ఎలా కాపాడాడు అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

రాబిన్‌హుడ్ త‌ర్వాత నితిన్ త‌మ్ముడు సినిమా చేస్తోన్నాడు. వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీని దిల్‌రాజు నిర్మిస్తోన్నాడు.

నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024