




Best Web Hosting Provider In India 2024

కేవలం 25 రూపాయలతో రైలులో దేశం మొత్తం చుట్టేయొచ్చు.. యువతకు మాత్రమే అవకాశం!
మన దేశం భిన్న సంస్కృతులకు.. ప్రకృతి అందాలకు.. చారిత్రక ప్రదేశాలకు.. ఆధ్యాత్మిక ప్రాంతాలకు నిలయం. అలాంటి దేశాన్ని చుట్టేయాలనే కోరిక ఎవరికి ఉండదు? అందుకే జాగృతి యాత్ర.. పేరుతో ప్రత్యేక రైలును తీసుకువచ్చింది కేంద్రం. 2008 నుంచి ఈ రైలు నడుస్తోంది. కానీ ఈ రైలు గురించి చాలా తక్కువ మందికి తెలుసు.
జాగృతి రైలు ప్రధాన ఉద్దేశ్యం వ్యాపారం ద్వారా భారతదేశ నిర్మాణం. ఈ రైలులో ప్రయాణించడం ద్వారా యువత పారిశ్రామికవేత్తలుగా మారడానికి అవసరమైన నైపుణ్యాలు.. అలాగే స్ఫూర్తిని పొందవచ్చు. ప్రయాణంతో పాటు జ్ఞానాన్ని కూడా పెంచుకోవచ్చు. అయితే ఈ రైలులో ఎలా ప్రయాణించాలి.. టికెట్ బుకింగ్ ఎలా చేసుకోవాలి.. ఎంత ఖర్చవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఏడాదికోసారి..
ఈ రైలు ఏడాదికి ఒక్కసారి మాత్రమే నడుస్తుంది. దీంట్లో ప్రయాణానికి 500 మందిని మాత్రమే అనుమతిస్తారు. ప్రయాణంలో యువతకు పారిశ్రామికవేత్తలకు సంబంధించిన మెళకువలు నేర్పిస్తారు. కేవలం 15 రోజుల్లో ఈ రైలు సుమారు 8000 కిలోమీటర్లు నడుస్తుంది.
ఢిల్లీ నుంచి స్టార్ట్..
ఈ రైలు ఢిల్లీ నుండి ప్రారంభమవుతుంది. మొదటి స్టాప్ అహ్మదాబాద్.. ఆ తర్వాత ముంబై, బెంగళూరు మీదుగా మధురై చేరుకుంటుంది. అక్కడి నుండి ఒడిశాలోకి ప్రవేశించి.. మధ్య భారతదేశం ద్వారా తిరిగి ఢిల్లీకి చేరుకుంటుంది. ఈ ప్రయాణంలో అనేక తీర్థయాత్రా స్థలాలతోపాటు.. పర్యాటక ప్రదేశాలను కూడా సందర్శించే అవకాశం కల్పిస్తారు.
ఈ ఏడాది ఎప్పుడు?
జాగృతి యాత్ర ప్రతి ఏడాది నవంబర్ నుంచి ప్రారంభమవుతుంది. దీనికోసం ముందుగానే పేరు నమోదు (రిజిస్ట్రేషన్) చేసుకోవాలి. ఈ రైలులో ప్రయాణించడానికి వయస్సు 21 నుంచి 27 సంవత్సరాల మధ్య మాత్రమే ఉండాలి. ఈ ఏడాది నవంబర్ 7వ తేదీన ప్రారంభమై.. నవంబర్ 22వ తేదీతో ముగుస్తుంది.
బుకింగ్ ఇలా..
ఈ ప్రత్యేక రైలులో సీటును బుక్ చేసుకోవడానికి.. https://www.jagritiyatra.com/ వెబ్‌సైట్‌ను సందర్శించి పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రైలులో ప్రయాణించడానికి యువతను మల్టీ- లెవల్ సెలక్షన్ ప్రాసెస్ తర్వాతే ఎంపిక చేస్తారు. అక్టోబర్ 15వ తేదీ వరకు పేర్లు నమోదు చేసుకోవచ్చు. కేవలం రూ.25 మాత్రమే టికెట్ ధర చెల్లించాల్సి ఉంటుంది.
సంబంధిత కథనం
టాపిక్