భృంగరాజ్ మెంతులు కలిపి జుట్టు రాలిపోయే హెయిర్ మాస్క్ ఇంట్లోనే ఇలా చేసుకోండి

Best Web Hosting Provider In India 2024

భృంగరాజ్ మెంతులు కలిపి జుట్టు రాలిపోయే హెయిర్ మాస్క్ ఇంట్లోనే ఇలా చేసుకోండి

Haritha Chappa HT Telugu

హెయిర్ బ్రేకేజ్, జుట్టు రాలిపోవడం వల్ల ఎంతో మంది ఇబ్బంది పడతున్నారు. అలాగే జుట్టు పొడిబారి నిర్జీవంగా మారితే సెలూన్ కు వెళ్లి ఖరీదైన బయోటిన్ ట్రీట్ మెంట్ తీసుకునే బదులు ఈ ఆయుర్వేద, హోం రెమెడీస్ తో జుట్టు రాలకుండా అడ్డుకోవచ్చు. ఇంట్లోనే ఈ హెయిర్ మాస్క్ వేయడం వల్ల ఉపయోగం ఉంటుంది.

ఆయుర్వేద హెయిర్ మాస్క్ (SHUTTERSTOCK)

జుట్టు రాలిపోయే సమస్యతో బాధపడుతున్న అమ్మాయిలు ఎక్కువే. అందంగా కనిపించాలంటే ఒత్తుగా, నల్లగా, మందంగా జుట్టు పెరగాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే చిన్న చిన్న చిట్కాలు పాటించడం వల్ల జుట్టును కాపాడుకోవచ్చు.

అమ్మాయిలు తమ జుట్టు ఆరోగ్యంగా, బలంగా ఉండటానికి బయోటిన్ చికిత్స పొందడానికి సెలూన్ కు వెళతారు. తద్వారా అవి జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. అయితే ఈ ఖరీదైన హెయిర్ ఫాల్ ట్రీట్ మెంట్ కు బదులుగా ఇంట్లోనే వీటిని మిక్స్ చేసి మాస్క్ తయారు చేసి జుట్టుకు అప్లై చేయాలి. ఇది మీ జుట్టును బలోపేతం చేస్తుంది. జుట్టు కూడా సిల్కీగా, షైనీగా కనిపిస్తుంది. జుట్టు రాలడానికి ఈ హెయిర్ మాస్క్ గురించి అంశాలను మన్ ప్రీత్ కౌర్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.

హెయిర్ మాస్క్ తయారీ

జుట్టు రాలకుండా అడ్డుకునే హెయిర్ మాస్క్ తయారీ కోసం మీరు పుల్లని పెరుగు, రెండు గుడ్లు, మెంతులు, భృంగరాజ్ పొడి అవసరం పడతాయి. ఇవన్నీ మీరు జుట్టుకు అప్లై చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు అందుతాయి. ఈ హెయిర్ మాస్క్ చేయడానికి ముందుగా మీరు పుల్లని పెరుగును రాగి గిన్నెలో వేసి కాసేపు ఉంచాలి. ఇలా చేయడం వల్ల అది మరింత పుల్లగా మారుతుంది.

అలాంటి పెరుగును వాడడం వల్ల జుట్టుకు రాగి లోహంలోని లక్షణాలు కూడా లభిస్తాయి. రెండు నుంచి మూడు టీస్పూన్ల పెరుగును ఇలా తీసుకోవాలి. ఇప్పుడు అందులో ఒకటి లేదా రెండు గుడ్లు కొట్టి వేయండి. రెండు టీస్పూన్ల భృంగరాజ్ పొడి వేసకి కలపండి. గుడ్లను వాడకపోతే మెంతులను నానబెట్టి గ్రైండ్ చేసి ఆ మెంతి పేస్ట్ ను రెండు టీస్పూన్లు తీసుకోవాలి. లేదా కావాలనుకుంటే మెంతి గింజల పొడిని కూడా తీసుకోవచ్చు. గుడ్లలో ప్రోటీన్ ఉంటుంది. ఇది జుట్టును బలంగా చేయడానికి సహాయపడుతుంది. బయోటిన్ ప్రభావాన్ని ఇస్తుంది.

సిల్కీ జుట్టును ఇచ్చే హోయిర్ మాస్క్
సిల్కీ జుట్టును ఇచ్చే హోయిర్ మాస్క్

ఇప్పుడు హెయిర్ మాస్క్ రెడీగా ఉంటుంది. దీన్ని జుట్టుకు అప్లై చేసి 40 నిమిషాల పాటు వదిలేయాలి. ఈ మొత్తం హెయిర్ మాస్క్ ను జుట్టు మూలాల వరకు అప్లై చేయాలి. తలకు పాలిథిన్ కవర్ చుట్టి వదిలేయాలి. జుట్టుకు వెచ్చదనం కూడా అందుతుంది. ఈ పదార్థాల ప్రయోజనాలు జుట్టు మూలాలకు చేరతాయి. నలభై నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. ఈ హెయిర్ మాస్క్ వల్ల జుట్టు స్ట్రాంగ్ గా మారడమే కాకుండా సిల్కీగా, షైనీగా మారుతుంది.

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024