హిస్టరీ క్రియేట్ చేసిన జో రూట్.. ప్రమాదంలో సచిన్ ఆల్‌టైమ్ రికార్డు!

Best Web Hosting Provider In India 2024


హిస్టరీ క్రియేట్ చేసిన జో రూట్.. ప్రమాదంలో సచిన్ ఆల్‌టైమ్ రికార్డు!

ఇంగ్లాండ్ దిగ్గజ బ్యాటర్ జో రూట్ హిస్టరీ క్రియేట్ చేశాడు. ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. జింబాబ్వేతో టెస్టు సందర్భంగా అద్భుతమైన ఫీట్ సాధించాడు. ఈ క్రమంలోనే క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ రికార్డును ప్రమాదంలో పడేశాడు.

జో రూట్, సచిన్ టెండూల్కర్

టెస్టు క్రికెట్లో తిరుగులేని ఫామ్ లో ఉన్న ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ మరో చరిత్ర నెలకొల్పాడు. తిరుగులేని రికార్డు నమోదు చేశాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 13 వేల పరుగులు మైలురాయి చేరుకున్న ఆటగాడిగా ప్రపంచ రికార్డు సొంతం చేసుకున్నాడు. జింబాబ్వేతో జరుగుతున్న ఏకైక టెస్టులో రూట్ ఈ ఫీట్ సాధించాడు. జోష్ మీద ఉన్న రూట్ ఇదే స్పీడ్ తో సచిన్ ఆల్ టైమ్ రికార్డునూ అందుకునే అవకాశముంది.

కలిస్ ను వెనక్కినెట్టి

గురువారం (మే 22) జింబాబ్వేతో తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో జో రూట్ 34 పరుగులు మాత్రమే చేశాడు. కానీ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. టెస్టుల్లో తన 153 మ్యాచ్ లో రూట్ 13 వేల పరుగుల మైలురాయి చేరుకున్నాడు. ఈ ఫార్మాట్లో అత్యంత వేగంగా 13 వేల రన్స్ కంప్లీట్ చేసిన ప్లేయర్ గా రూట్ నిలిచాడు. దక్షిణాఫ్రికా దిగ్గజం జాక్వెస్ కలిస్ (159 మ్యాచ్ లు) రికార్డును బద్దలుకొట్టాడు. రాహుల్ ద్రవిడ్ (160), రికీ పాంటింగ్ (162), సచిన్ టెండూల్కర్ (163) ఆ తర్వాత ఉన్నారు.

సచిన్ రికార్డు

టెస్టు క్రికెట్లో అత్యధిక పరుగుల రికార్డు భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరు మీద ఉంది. సచిన్ 200 టెస్టుల్లో 15921 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్లో టాప్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు. కానీ ఇప్పుడా రికార్డును రూట్ బ్రేక్ చేసేందుకు అవకాశాలున్నాయి. 153 టెస్టుల్లో 13006 రన్స్ తో రూట్ అయిదో స్థానంలో ఉన్నాడు. సచిన్ రికార్డుకు రూట్ 2915 పరుగుల దూరంలోనే ఉన్నాడు.

ఆ ముగ్గురు

ఒకవేళ సచిన్ రికార్డును రూట్ అందుకోలేకపోయినా టెస్టుల్లో టాప్-2 బ్యాటర్ గా నిలిచే అవకాశముంది. రూట్ కంటే ముందున్న బ్యాటర్లలో ముగ్గురూ 13400 కంటే తక్కువ రన్స్ చేసినవాళ్లే. పాంటింగ్ (13378), కలిస్ (13289), ద్రవిడ్ (13288) రూట్ కంటే ముందున్నారు. వీళ్లను దాటేసి సచిన్ తర్వాత సెకండ్ ప్లేస్ కు రూట్ ఎగబాకే ఛాన్స్ ఉంది.

ఫస్ట్ ఇంగ్లాండ్ బ్యాటర్

టెస్టుల్లో 13 వేల మైలురాయి చేరుకున్న ఫస్ట్ ఇంగ్లాండ్ బ్యాటర్ గా రూట్ చరిత్ర నెలకొల్పాడు. ఓవరాల్ గా అతను అయిదో బ్యాటర్. 34 ఏళ్ల రూట్ ప్రస్తుతం టెస్టుల్లో సెన్సేషనల్ ఫామ్ లో ఉన్నాడు. అతను మరో రెండు మూడేళ్లు ఆడే సూచనలు కనిపిస్తున్నాయి. అప్పటివరకూ అతను ఇదే నిలకడ కొనసాగిస్తే సచిన్ రికార్డు బ్రేక్ అవడం ఖాయమే.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం


Best Web Hosting Provider In India 2024


Source link