పప్పులన్నీ కలిపి ఇలా కిచిడీ చేసి పెట్టారంటే పిల్లలకు పోషకాహార లోపమే రాదు, పైగా ఎంతో రుచి

Best Web Hosting Provider In India 2024

పప్పులన్నీ కలిపి ఇలా కిచిడీ చేసి పెట్టారంటే పిల్లలకు పోషకాహార లోపమే రాదు, పైగా ఎంతో రుచి

Haritha Chappa HT Telugu

పిల్లల్లోనే ఎక్కువగా పోషకాహార లోపం కనిపిస్తుంది. వారికి అన్ని పోషకాలు అందేలా ఆహారాన్ని ప్రిపేర్ చేయాలి. ఇక్కడ మేము అన్ని పప్పులు కలిపి అద్భుతమైన కిచిడి రెసిపీ ఇచ్చాము. ఒకసారి ప్రయత్నించి చూడండి .

హెల్తీ కిచ్డి రెసిపీ

కిచిడి ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాల్లో ఒకటి. ఎందుకంటే దీనిలో పప్పుతో పాటు ఎన్నో రకాల కూరగాయలను కూడా కలుపుతాము. కాబట్టి పోషకాహార లోపం రాకుండా ఇది అడ్డుకుంటుంది. అయితే సాధారణ కిచిడీలో పెసరపప్పు లేదా కందిపప్పు ఏదో ఒకదాన్ని మాత్రమే వాడుతారు. కానీ అన్ని పప్పులను కలిపి ఒకసారి కిచిడీ చేసి చూడండి. ఇది ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుంది. పైగా పిల్లలకు వారంలో రెండు మూడు సార్లు ఈ అన్ని పప్పుల కిచిడీని పెడితే వారికి పోషకాలు అన్ని అందుతాయి. వారిలో ఏ విటమిన్ల లోపం కానీ ఖనిజాల లోపం కానీ రాకుండా ఉంటుంది. అన్ని రకాల పప్పులతో కలిపి అద్భుతమైన టేస్టీ కిచిడిని ఎలా చేయాలో తెలుసుకోండి.

అన్ని పప్పుల కిచిడి రెసిపీకి కావలసిన పదార్థాలు

బియ్యం – ఒక కప్పు

కందిపప్పు – అర కప్పు

పెసరపప్పు – అర కప్పు

శెనగపప్పు – అరకప్పు

బంగాళదుంపలు – రెండు

టమాటోలు – రెండు

ఉల్లిపాయ – ఒకటి

క్యారెట్లు – రెండు

పుదీనా తరుగు – పావు కప్పు

కొత్తిమీర తరుగు – పావు కప్పు

పచ్చిమిర్చి – నాలుగు

ఉప్పు – రుచికి సరిపడా

మిరియాల పొడి – అర స్పూను

జీలకర్ర – ఒక స్పూను

నూనె – తగినంత

అన్ని పప్పుల కిచిడీ రెసిపీ

1. బియ్యం, కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు అన్నింటినీ కడిగి పక్కన పెట్టుకోవాలి.

2. వాటిలో నీళ్లు వేసి అరగంట పాటు నానబెట్టుకోవాలి. తర్వాత మరొకసారి కడగాలి.

3. ఇప్పుడు కుక్కర్ ను స్టవ్ మీద పెట్టి నూనె వేయాలి.

4. ఆ నూనెలో జీలకర్ర వేసి వేయించాలి. ఆ తర్వాత సన్నగా కోసినా వెల్లుల్లి, ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి.

5. ఇప్పుడు క్యారెట్ ముక్కలు, బంగాళాదుంప ముక్కలు, టమోటో ముక్కలు వేసి బాగా వేయించాలి. మూత పెట్టి కాసేపు ఉడికించాలి.

6. టమోటోలు మెత్తగా అయ్యేవరకు ఉడికించుకోవాలి.

7. ఆ తర్వాత పచ్చిమిర్చి, పుదీనా తరుగును వేసి బాగా కలుపుకోవాలి.

8. మిరియాల పొడిని కూడా వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి బాగా కలపాలి. కాసేపు మూత పెట్టి ఉడికించాలి.

9. ఆ తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న బియ్యం, పప్పులు వేసి బాగా కలుపుకోవాలి.

10. ఇవి ఉడకడానికి సరిపడా నీటిని వేసి కుక్కర్ మూత పెట్టేయాలని.

11. మూడు విజిల్స్ వచ్చేదాకా ఉంచి ఆ తర్వాత మూత తీయాలి.

12. పైన కొత్తిమీర తరుగును జల్లి ఒకసారి కలుపుకోవాలి. అంతే టేస్టీ కిచిడి రెడీ అయినట్టే.

అన్ని రకాల పప్పులు ఉంటాయి. కాబట్టి రుచి అదిరిపోతుంది. ఎంత తిన్నా ఇంకా కావాలనిపిస్తుంది. మేము ఇక్కడ చెప్పిన పద్ధతిలో ఒకసారి ఇవ్వండి. మీకు నచ్చటమే కాదు పిల్లలకు పోషకాలు కూడా పుష్కలంగా అందుతాయి

ఒకే రకమైన పప్పుతో తినే కన్నా ఇలా కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు కలిపి వండడం వల్ల మరిన్ని పోషకాలు అందుతాయి. ముఖ్యంగా ఈ కిచిడి కొంచెం తింటే చాలు పొట్ట నిండిన ఫీలింగ్ వస్తుంది. అలాగే విటమిన్లు, ఖనిజాలను అధికంగా అందిస్తుంది. పిల్లలకు ఇది బెస్ట్ రెసిపీ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024