మీకు అలెర్జీ సమస్య ఉంటే ఈ ఆహారాలు తినేటప్పుడు జాగ్రత్త, ఇవి కొంతమందికి పడవు

Best Web Hosting Provider In India 2024

మీకు అలెర్జీ సమస్య ఉంటే ఈ ఆహారాలు తినేటప్పుడు జాగ్రత్త, ఇవి కొంతమందికి పడవు

Haritha Chappa HT Telugu

కొందరి శరీరానికి అన్ని ఆహారాలు పడవు. కొన్ని తినగానే అలెర్జీ లక్షణాలు కనిపిస్తాయి. కానీ ఏ ఆహారాలు అలెర్జీకి కారణం అవుతాయో అంచనా వేయడం చాలా కష్టం. ఇక్కడ చెప్పిన ఆహారాలు కొందరిలో అలెర్జీలకు కారణం అవుతాయి.

అలెర్జీ కలిగించే ఆహారాలు

అలెర్జీలకు కారణమయ్యే ఆహారాలు ఎన్నో ఉన్నాయి. ఆహార అలెర్జీ అనేది ప్రపంచంలోని లక్షల మందిని ప్రభావితం చేస్తుంది. ఇది చిన్న సమస్యగా కనిపిస్తుంది… కానీ ఒక్కోసారి అనాఫిలాక్సిస్ అని పిలిచే ప్రాణాంతక సమస్యకు కారణం అవుతుంది.

మీకు జీర్ణ రుగ్మతలు, చర్మ సమస్యలు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వస్తూ ఉంటే కొన్ని ఆహారాలు తిన్న తర్వాత కొంత అసౌకర్యాన్ని అనుభవిస్తే, చాలా జాగ్రత్తగా ఉండండి. అంటే ఆ ఆహారం వల్ల మీకు అలెర్జీ కలుగుతోందని అర్థం. ఆ ఆహారాలను మీరు తినకపోవడమే మంచిది. ఏ ఆహారాలు అలెర్జీలకు కారణమవుతాయో చూడండి.

పాలు

పిల్లల్లో అలర్జీలను కలిగించే అత్యంత సాధారణ ఆహారాలలో పాలు ఒకటి. కొంతమందికి ఆవు పాలు అలెర్జీ కలిగిస్తాయి. దీనిని తిన్న తరువాత, కొంతమందికి వాంతులు, శ్వాసకోశ సమస్యలు, అనాఫిలాక్సిస్ వంటివి రావచ్చు. పిల్లల అభివృద్ధికి పాలు చాలా ముఖ్యమైనవి. కానీ కొంతమంది పెద్దలకు లాక్టోస్ అసహనం ఉండవచ్చు. ఇది పాల అలెర్జీకి భిన్నంగా ఉంటుంది.

గుడ్లు

గుడ్డు పచ్చసొన కంటే తెల్లసొన సర్వసాధారణం.ఇది చర్మ సమస్యలు, ముక్కు దిబ్బడ, జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. గుడ్డు అలెర్జీ పిల్లలలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది వయస్సుతో మెరుగుపడుతుంది.

కోడిగుడ్డు
కోడిగుడ్డు

వేరుశెనగ

వేరుశెనగ కూడా కొంతమందికి తీవ్రమైన అలెర్జీని కలిగిస్తుంది. కొన్నిసార్లు ఇది జీవితకాల అలెర్జీ. చిన్న అలెర్జీ కూడా సున్నితమైన వ్యక్తులకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది. ఇది వికారం వరకు మంటను కలిగిస్తుంది. కొంతమందికి ఇది అనాఫిలిక్ గా కూడా మారవచ్చు.

గింజలు

బాదం, జీడిపప్పు, పిస్తా, వాల్ నట్స్, హాజెల్ గింజలు వంటి నట్స్ కూడా కొందరిలో పడకపోవచ్చు. ఇది జీవితాంతం తీవ్రమైన అలెర్జీలను కలిగిస్తుంది. ఇది సర్వసాధారణమైన ఆహార అలెర్జీలలో ఒకటి.

రొయ్యలు
రొయ్యలు

రొయ్యలు పీతలు…

రొయ్యలు, పీతలు వంటి సముద్ర ఆహారాలు తీవ్రమైన అలెర్జీ ప్రతిచర్యలకు కారణమవుతాయి. ఇది పెద్దవారిలో ఒక సాధారణ అలెర్జీ. ఇది అకస్మాత్తుగా సంభవిస్తుంది. ఇది అకస్మాత్తుగా సమస్యలను కలిగిస్తుంది.

చేపలు

ట్యూనా , సాల్మన్, పన్నా, కలవా వంటి చేపలు అలెర్జీలను కలిగిస్తాయి. ఈ చేపలు తినగానే చర్మంపై దద్దుర్లు, దురద, ఉబ్బసం లేదా వికారం కలిగిస్తుంది.

గోధుమపిండితో చేసే రోటీ
గోధుమపిండితో చేసే రోటీ

గోధుమ పిండి

గోధుమ పిండి కొంతమందిలో అలెర్జీ ప్రతిచర్యలకు కారణమవుతుంది. ఇది శ్వాస సమస్యలు లేదా కడుపు నొప్పికి దారితీస్తుంది. ప్రాసెస్ చేసిన ఆహారాలలో గోధుమలను ఎక్కువగా ఉపయోగిస్తారు. కాబట్టి గోధుమలకు అలెర్జీ ఉన్నవారు. మీరు తినే ప్యాకెట్ ఆహారంలో గోధుమలు ఉండేలా చూసుకోండి.

సోయా బీన్స్

సోయాను బేబీ ఫుడ్స్ లో విరివిగా ఉపయోగిస్తారు.ఇది పిల్లల్లో సాధారణ అలర్జీని కలిగిస్తుంది. సోయా మిల్క్, టోఫు వంటి వివిధ ప్యాకేజ్డ్ ఫుడ్స్ లో ఉంటుంది. పిల్లలు దీనిని తింటే చాలా అసౌకర్యం కలుగుతుంది. కనుక జాగ్రత్తగా ఉండాలి.

నువ్వులు

నువ్వులను అలర్జీలకు కారణమయ్యే ఆహారాల జాబితాలో ఎన్నో దేశాల్లో చేర్చారు. బేకింగ్ లో నువ్వులు అధికంగా వాడుతారు. బ్యూటీ ప్రొడక్ట్స్ లో కూడా ఇది ఉంటుంది. ప్రతిచర్యలు చాలా తీవ్రంగా ఉంటాయి.

మొక్కజొన్న

మొక్కజొన్న పిండి కూడా కొందరిలో అలర్జీలను కలిగిస్తుంది. మొక్కజొన్న పిండిని సిరప్ లు, ప్రాసెస్ చేసిన ఆహారాలలో విరివిగా ఉపయోగిస్తారు. ఇది చర్మపు చికాకు, జీర్ణ సమస్యలు, శ్వాసకోశ సమస్యలను కలిగిస్తుంది.

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024