సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన కన్నడ మూవీ.. ఐఎండీబీలో 7.6 రేటింగ్.. నెల రోజుల్లోపే..

Best Web Hosting Provider In India 2024

సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన కన్నడ మూవీ.. ఐఎండీబీలో 7.6 రేటింగ్.. నెల రోజుల్లోపే..

Hari Prasad S HT Telugu

ఓ కన్నడ మూవీ సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోపే డిజిటల్ ప్రీమియర్ కావడం విశేషం. అయితే ఈ సినిమాకు ఐఎండీబీలో 7.6 రేటింగ్ ఉంది. ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో ఈ మూవీని చూడొచ్చు.

సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన కన్నడ మూవీ.. ఐఎండీబీలో 7.6 రేటింగ్.. నెల రోజుల్లోపే..

ఈ వారం మరో కన్నడ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చింది. గత నెల 24న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా డిజిటల్ ప్రీమియర్ కావడం విశేషం. ఐఎండీబీలో 7.6 రేటింగ్ ఉన్న ఈ సినిమాను ప్రముఖ కన్నడ నటుడు శివరాజ్ కుమార్ కూతురు నివేదిత శివరాజ్ కుమార్ నిర్మించడం విశేషం.

ఫైర్‌ఫ్లై ఓటీటీ స్ట్రీమింగ్

కన్నడ డ్రామా మూవీ పేరు ఫైర్‌ఫ్లై (Firefly). ఈ సినిమా ఏప్రిల్ 24న థియేటర్లలో రిలీజైంది. వంశీకృష్ణ శ్రీనివాస్ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. అతడే లీడ్ రోల్లోనూ నటించాడు. ఇక శివరాజ్ కుమార్ కూతురు నివేదిత శివరాజ్ కుమార్ నిర్మించింది. ఆమెకు నిర్మాతగా ఇదే తొలి సినిమా. ఈ ఫైర్‌ఫ్లై మూవీ శుక్రవారం (మే 23) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే దీనిపై ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే సడెన్ గా ఓటీటీలోకి వచ్చేయడం విశేషం.

ఫైర్‌ఫ్లై మూవీ గురించి..

ఫైర్‌ఫ్లై మూవీలో వంశీ కృష్ణ శ్రీనివాస్ తోపాటు రచన ఇందర్, అచ్యుత్ కుమార్, సుధరణి ముఖ్యమైన పాత్రలు పోసించారు. ఈ సినిమా కన్నడ స్టార్ హీరో దివంగత డాక్టర్ రాజ్‌కుమార్ జయంతి అయిన ఏప్రిల్ 24న థియేటర్లలో రిలీజ్ చేశారు. ఇందులో వివేకానంద అనే పాత్రలో వంశీ కృష్ణ నటించాడు. మూవీ మొత్తం అతని చుట్టే తిరుగుతుంది.

జీవితంలో అన్నీ కోల్పోయిన దశ నుంచి అతడు తిరిగి ఎలా ఎదిగాడన్నదే ఈ మూవీ కథ. వివేకానంద నాలుగేళ్ల తర్వాత అమెరికా నుంచి ఇండియాకు వస్తాడు. అయితే తన తల్లిదండ్రులు మూర్తి, పద్మ చనిపోవడంతో అతడు తీవ్ర వేదనకు గురవుతాడు. ఆ తర్వాత మూడు నెలల పాటు కోమాలోకి వెళ్లిపోతాడు. తన ఉద్యోగం కోల్పోతాడు. డిప్రెషన్, నిద్ర లేమితో బాధపడుతుంటాడు.

ఇలాంటి సమయంలో ఓ డేటింగ్ యాప్ ద్వారా నేహ (రచన)ను కలుసుకుంటాడు. ఆమె కలిసిన తర్వాత అతడిలో ఎలాంటి మార్పు వచ్చింది? మళ్లీ తనకు తాను ఎలా గాడిపడ్డాడు అన్నది ఈ ఫైర్‌ఫ్లై మూవీలో చూడొచ్చు. రివర్స్ స్క్రీన్‌ప్లే ద్వారా ఇదంతా చూపించడమే ఈ సినిమాలో ప్రత్యేకం. అంటే కథను వెనక్కి నడిపించడం అన్నమాట. ఈ ఫైర్‌ఫ్లై సినిమాను ప్రైమ్ వీడియోలో కన్నడ ఆడియో, ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో చూడొచ్చు.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024