కడప జిల్లాలో దారుణం.. మూడేళ్ల బాలికపై అత్యాచారం.. ఆ తర్వాత హత్య

Best Web Hosting Provider In India 2024

కడప జిల్లాలో దారుణం.. మూడేళ్ల బాలికపై అత్యాచారం.. ఆ తర్వాత హత్య

Basani Shiva Kumar HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Basani Shiva Kumar HT Telugu

వైఎస్ఆర్ కడప జిల్లాలో ఘోరం జరిగింది. మూడేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. అత్యాచారానికి పాల్పడి, హత్యచేసిన వ్యక్తిని స్థానికులు పట్టుకొని చితకబాదారు. తర్వాత పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రతీకాత్మక చిత్రం (unsplash)

కడప జిల్లా ప్రొద్దుటూరులోని అమృతనగర్‌కు చెందిన దంపతులు.. తమ మూడేళ్ల కుమార్తెను వెంటబెట్టుకొని.. మైలవరం మండలం కంబాలదిన్నేకు బంధువుల పెళ్లికి వెళ్లారు. తమ మూడేళ్ల కుమార్తె పెళ్లి మండపం బయట ఆడుకుంటుంది. ఈ సమయంలో ఓ వ్యక్తి అరటి పండు ఇస్తానని ఆశ చూపించి.. బాలికను ముళ్ల పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.

ముళ్ల పొదల్లో బాలిక మృతదేహం..

అత్యాచారం విషయం బయటపడుతుందని.. బాలికను దారుణంగా హత్య చేశాడు. అయితే.. కుమార్తె కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. సమీపంలో గాలించారు. ఈ క్రమంలో ముళ్ల పొదల్లో బాలిక మృతదేహం కనిపించింది. కూతురు మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

బాకీ చెల్లింపు విషయంలో..

ఎగువ రామాపురానికి చెందిన శివ రామకృష్ణారెడ్డి అదే గ్రామానికి చెందిన అంకిరెడ్డికి డబ్బు బాకీ పడ్డాడు. ఈ విషయమై వీరిద్దరి మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తోంది. గురువారం రాత్రి ఈ విషయంపై మాట్లాడేందుకు అంకిరెడ్డి.. శివరామకృష్ణారెడ్డి ఇంటి వద్దకు వెళ్లాడు. అక్కడున్న ఆయన తల్లి నారాయణమ్మ తోపాటు కుటుంబ సభ్యులను అంకిరెడ్డి అసభ్య పదజాలంతో దూషించాడు.

కత్తితో దాడి..

ఆగ్రహానికి గురైన శివ రామకృష్ణారెడ్డి.. తన తల్లిని తీసుకొని అంకిరెడ్డి ఇంటికి వెళ్లి నిలదీశాడు. ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో అంకిరెడ్డి కత్తితో దాడి చేయడంతో శివ రామకృష్ణారెడ్డి తలకు తీవ్ర గాయమైంది. స్థానికులు వెంటనే అతన్ని కడప రిమ్స్‌కు తరలించారు. అక్కడినుంచి తిరుపతికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Basani Shiva Kumar

eMail

సంబంధిత కథనం

టాపిక్

KadapaCrime ApAp PoliceAndhra Pradesh News
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024