





Best Web Hosting Provider In India 2024

ఓటీటీలోకి 9 నెలల తర్వాత వచ్చిన మలయాళం హారర్ థ్రిల్లర్ మూవీ.. ఎక్కడ చూడాలంటే?
మలయాళం హారర్ థ్రిల్లర్ మూవీ ఒకటి 9 నెలల తర్వాత ఓటీటీలోకి అడుగుపెట్టింది. ప్రముఖ నటి భావన నటించిన సినిమా ఇది. గతేడాది ఆగస్టులో థియేటర్లలో రిలీజైనా.. ఇప్పటి వరకు ఏ ఓటీటీ తీసుకోకపోవడంతో డిజిటల్ ప్రీమియర్ ఆలస్యమైంది.
ఓటీటీలోకి మలయాళం హారర్ థ్రిల్లర్ మూవీ వచ్చింది. ఈ సినిమా పేరు హంట్. అయితే ఓటీటీ పార్ట్‌నర్ ఖరారు కావడంలో ఆలస్యం కావడంతో ఏకంగా 9 నెలల తర్వాత డిజిటల్ ప్రీమియర్ కావడం విశేషం. ప్రముఖ నటి భావన ఇందులో లీడ్ రోల్లో నటించింది. బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ సాధించలేకపోయిన మూవీ ఇది.
హంట్ ఓటీటీ స్ట్రీమింగ్
మలయాళం హారర్ థ్రిల్లర్ మూవీ హంట్ (Hunt) శుక్రవారం (మే 23) మనోరమ మ్యాక్స్ ఓటీటీలోకి అడుగుపెట్టింది. షాజీ కైలాస్ డైరెక్ట్ చేసిన హంట్ మూవీ గతేడాది ఆగస్టులో థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాకు పెద్దగా రెస్పాన్స్ రాకపోయినా.. భావన నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. మనోరమ మ్యాక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. ఇప్పుడా మూవీని తమ ఓటీటీలోకి తీసుకొచ్చింది.
హారర్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వాళ్లు ఓసారి ఈ హంట్ మూవీ చూడొచ్చు. గతంలో రెడ్ చిల్లీస్, నట్టురజవు, ది కింగ్ లాంటి సినిమాలు తీసిన షాజి కైలాస్ డైరెక్ట్ చేయడంతో హంట్ పై కాస్త అంచనాలు ఉన్నాయి. అయితే థియేటర్లలో తొలి రోజు నుంచే మిక్స్‌డ్ రివ్యూలు వచ్చాయి.
హంట్ మూవీ స్టోరీ ఏంటంటే?
ఈ సినిమా ఫోరెన్సిక్ సైన్స్ చదివే పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ స్టూడెంట్ డాక్టర్ కీర్తి చుట్టూ తిరుగుతుంది. ఎన్నో ఏళ్ల కిందట హత్యకు గురైన ఓ మహిళ కేసుపై ఆమె పని చేస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో కొన్ని అతీత శక్తులకు సంబంధించిన ఘటనలు ఆమె జీవితంలో జరుగుతుంటాయి. దర్యాప్తులో భాగంగా కీర్తి.. ఆ మహిళకు సంబంధించిన వాళ్లను కలిసి మాట్లాడుతుంది. ఈ క్రమంలో మరికొన్ని హత్యల గురించి తెలుసుకుంటుంది.
బాధితురాలితో ఆ డాక్టర్ కు ఉన్న సంబంధం ఏంటి? హత్య నేపథ్యం ఏంటి అనేదే ఈ హంట్ మూవీలో ప్రధాన అంశం. ఈ హారర్ థ్రిల్లర్ మూవీలో భావనతోపాటు చందూనాథ్, అదితి రవి, అను మోహన్, డైన్ డేవిస్, అజ్మల్ అమీర్, రెంజి పనిక్కర్ ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఈ సినిమాను మలయాళం ఆడియో, ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో మనోరమ మ్యాక్స్ ఓటీటీలో చూడొచ్చు.
సంబంధిత కథనం