ఏపీ పోలీస్‌ కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్ – హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్లోడ్ చేసుకోండి

Best Web Hosting Provider In India 2024

ఏపీ పోలీస్‌ కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్ – హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్లోడ్ చేసుకోండి

Maheshwaram Mahendra Chary HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Maheshwaram Mahendra Chary HT Telugu

ఏపీ పోలీస్ కానిస్టేబుల్ తుది పరీక్ష హాల్ టికెట్లు విడుదలయ్యాయి. అభ్యర్థులు slprb.ap.gov.in వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని రిక్రూట్ మెంట్ బోర్డు తెలిపింది. జూన్‌ 1వ తేదీన రాత పరీక్ష నిర్వహించనున్నారు.

ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు

ఏపీ పోలీస్‌ కానిస్టేబుల్‌ అభ్యర్థులకు రిక్రూట్ మెంట్ బోర్డు కీలక అప్జేట్ ఇచ్చింది. తుది రాత పరీక్ష హాల్ టికెట్లను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు slprb.ap.gov.in/ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది. జూన్‌ 1వ తేదీన తుది రాత పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

హాల్ టికెట్ డౌన్లోడ్ ప్రాసెస్….

  1. ముందుగా ఏపీ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు అధికారిక వెబ్ సైట్ https://slprb.ap.gov.in/UI/index లోకి వెళ్లాలి.
  2. ఇక్కడ పోలీస్ కానిస్టేబుల్ హాల్ టికెట్ లింక్ పై క్లిక్ చేయాలి.
  3. మీ రిజిస్ట్రేషన్ నెంబర్, మొబైల్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి సబ్మిట్ చేయాలి.
  4. ఇక్కడ మీ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
  5. పరీక్షా కేంద్రంలోకి వెళ్లాంటే హాల్ టికెట్ తప్పనిసరి. భవిష్యత్ అవసరాలకు కూడా ఉపయోగపడుతుంది.

ఏపీ పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్ష…. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎగ్జామ్ ఉంటుంది. విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కర్నూల్, తిరుపతి నగరాలు ఎగ్జామ్ సెంటర్లుగా ఉన్నాయి. ఇక హాల్ టికెట్ల డౌన్లోడ్ ప్రక్రియలో ఏమైనా ఇబ్బందులు ఉంటే 9441450639 లేదా 9100203323 హెల్ప్ లైన్ నెంబర్లను సంప్రదించవచ్చని బోర్డు సూచించింది. లేదా mail-slprb@gov.in కు మెయిల్ చేయవచ్చు. ఆఫీస్ పని వేళల్లో మాత్రమే వీటిని చేయాలని స్పష్టం చేసింది.

కానిస్టేబుళ్ల రిక్రూట్ మెంట్ – ఎప్పుడు ఏం జరిగిందంటే..?

  • ఏపీలో కానిస్టేబుళ్ల నియామకాల కోసం 2023 ఏడాదిలో ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించారు.
  • ఇందుకు 4,59,182 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇందులో 95,208 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు.
  • వీరికి 2024 డిసెంబరులో దేహదారుఢ్య పరీక్షలు పూర్తి చేశారు. ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షల్లో 38,910 మంది అర్హత సాధించారు.
  • ఏపీలో కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్ ప్రక్రియ మొదలై రెండేళ్లు కావొస్తోంది. పలు కారణాల రీత్యా వాయిదా పడుతూ వచ్చింది.
  • ప్రస్తుతం రాష్ట్రంలో పోలీస్ శాఖలో దిగువ స్థాయి సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది.
  • పోలీస్ రిక్రూట్‌మెంట్‌పై దృష్టి సారించిన కూటమి సర్కార్… నియామక ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని నిర్ణయించింది.
  • ఈ క్రమంలోనే జూన్ 1వ తేదీన పరీక్షలను నిర్వహించనున్నారు. తుది పరీక్షలను నిర్వహించి… సాధ్యమైనంత త్వరగానే ఫలితాలను ప్రకటించాలని బోర్డు చూస్తోంది.
  • ఎంపికైన వారికి శిక్షణ ఉంటుంది. ఆ తర్వాత నియామక పత్రాలను అందజేస్తారు.

ఈ లింక్ పై క్లిక్ చేసి ఏపీ కానిస్టేబుల్ తుది పరీక్ష హాల్ టికెట్ ను నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు…

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

టాపిక్

RecruitmentAp PoliceAndhra Pradesh NewsAp GovtVijayawada
Source / Credits

Best Web Hosting Provider In India 2024