




Best Web Hosting Provider In India 2024

రేపు తెలంగాణ పాలిసెట్ – 2025 ఫలితాలు విడుదల… ర్యాంక్ ఇలా చెక్ చేసుకోండి
తెలంగాణ పాలిసెట్ – 2025 ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. రేపు (మే24) ఉదయం 11 గంటలకు ఫలితాలను ప్రకటించనున్నారు. మే 13వ తేదీ పాలిసెట్ పరీక్ష నిర్వహించారు. ఈ ఏడాది 1,06,716 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
తెలంగాణ పాలిసెట్ ఫలితాల విడుదలకు ముహుర్తం ఫిక్స్ అయింది. ఇప్పటికే ప్రాథమిక కీలను ప్రకటించిన అధికారులు… అభ్యంతరాలను కూడా స్వీకరించారు. ఈ నేపథ్యంలో రేపు (మే 24) ఉదయం 11 గంటలకు రిజల్ట్స్ ను విడుదల చేయనున్నారు.
మే 13వ తేదీన తెలంగాణ పాలిసెట్ – 2025 పరీక్షను రాష్ట్రవ్యాప్తంగా 276 కేంద్రాల్లో నిర్వహించారు. ఈ ఏడాది 1,06,716 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో అర్హత పొందిన వారు… పాలిటెక్నిక్ కాలేజీల్లోని ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్, టెక్నాలజీ కోర్సుల్లో అడ్మిషన్లు పొందుతారు.
టీజీ పాలిసెట్ ర్యాంక్ ఎలా చెక్ చేసుకోవాలంటే..?
- ఫలితాల విడుదలైన తర్వాత టీజీ పాలిసెట్ అధికారిక వెబ్ సైట్ https://www.polycet.sbtet.telangana.gov.in/ లోకి వెళ్లాలి.
- హోం పేజీలో కనిపించే ర్యాంక్ కార్డుపై క్లిక్ చేయాలి.
- మీ లాగిన్ వివరాలను నమోదు చేసి సబ్మిట్ చేయాలి.
- ఇక్కడ ర్యాంక్ కార్డు స్క్రీన్‌పై డిస్ ప్లే అవుతుంది.
- ర్యాంక్ కార్డును డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు.
- అడ్మిషన్ ప్రక్రియలో ర్యాంక్ కార్డు చాలా కీలకం. జాగ్రత్తగా ఉంచుకోవాలి.
తెలంగాణ పాలిసెట్ – 2025 ఫలితాలను ప్రకటించిన తర్వాత… కౌన్సెలింగ్ షెడ్యూల్ ను ప్రకటిస్తారు. పాలిటెక్నిక్ కోర్సుల్లో మొత్తం కన్వీనర్ కోటా సీట్లే ఉంటాయి. ఇందులో 85 శాతం స్థానికులకు మిగిలిన 15 శాతం సీట్లను స్థానికేతర కోటా కింద కేటాయిస్తారు. విడతల వారీగా సీట్ల భర్తీ ఉంటుంది. సీట్లు మిగిలే స్పాట్ అడ్మిషన్లకు గైడ్ లైన్స్ విడుదలవుతాయి. పూర్తి వివరాలను రాష్ట్ర సాంకేతిక విద్యా మండలి వెల్లడిస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్