‘ఆ లేఖ రాసింది నిజమే… బయటకు రావటం వెనక కుట్ర’ – కవిత సంచలన వ్యాఖ్యలు

Best Web Hosting Provider In India 2024

‘ఆ లేఖ రాసింది నిజమే… బయటకు రావటం వెనక కుట్ర’ – కవిత సంచలన వ్యాఖ్యలు

Maheshwaram Mahendra Chary HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Maheshwaram Mahendra Chary HT Telugu

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ కు చేరుకున్నారు. అమెరికా నుంచి తిరిగి వచ్చిన ఆమెకు… అనుచరులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె… రెండు వారాల క్రితం కేసీఆర్ కు లేఖ రాసింది నిజమేనని స్పష్టం చేశారు. లేఖ బయటికి రావటం వెనక కుట్ర ఉందని ఆరోపించారు.

ఎమ్మెల్సీ కవిత

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు వద్ద మీడియాతో మాట్లాడిన ఆమె… కేసీఆర్ కు రాసిన లేఖపై స్పందించారు. రెండు వారాల క్రితం లేఖ రాసింది నిజమేనని స్పష్టం చేశారు. కానీ అంతర్గత లేఖ బయటికి రావటం వెనక కుట్ర ఉందని ఆరోపించారు. కేసీఆర్ గారు దేవుడన్న కవిత…ఆయన చుట్టు దయ్యాలున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.

కోవర్టుల పనే – ఎమ్మెల్సీ కవిత

“రెండు వారాల క్రితమే కేసీఆర్‌కు లేఖ రాశాను. నా అభిప్రాయాలు లేఖ ద్వారా తెలిపాను. కార్యకర్తల అభిప్రాయాలే చెప్పాను. నా వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పలేదు. నా వ్యక్తిగత అజెండా లేదు. ఆ లేఖ ఎలా బహిర్గతమైంది….? లేఖ లీక్‌ చేసింది పార్టీలోని కొందరు కోవర్టులే” అంటూ కవిత ఆరోపించారు.

“కేసీఆర్‌ దేవుడు.. కానీ కేసీఆర్‌ చుట్టూ దెయ్యాలు ఉన్నాయి. అతర్గతంగా నేను రాసిన లేఖ బయటకు వచ్చిందంటే అర్థం ఏంటి?.. నా లేఖే బయటకు వచ్చిదంటే పార్టీలో సామాన్యుల పరిస్థితి ఏంటి..?” అని ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు.

మా నాయకుడు కేసీఆర్ – కవిత క్లారిటీ

“కేసీఆర్ కు ప్రతిసారి లేఖలు రాస్తాను. కానీ ఈసారి బయటికి రావటం బాధాకారం. కుటుంబం, పార్టీ ఐక్యంగానే ఉన్నాయి. మా నాయకుడు కేసీఆర్. ఇందులో ఎలాంటి ఆలోచన లేదు” అని కవిత స్పష్టం చేశారు.

“బీజేపీ, కాంగ్రెస్‌లు తెలంగాణను ఫెయిల్‌ చేశాయి. ఆ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయం కేసీఆర్‌ నాయకత్వమే. కేసీఆరే మా నాయకుడు… కేసీఆర్‌ నాయకత్వంలోనే పని చేస్తాం. పార్టీలోని లోపాలను సవరించుకుంటేనే భవిష్యత్‌ ఉంటుందని నా అభిప్రాయం” అని ఎమ్మెల్సీ కవిత చెప్పుకొచ్చారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

టాపిక్

BrsKavitha KalvakuntlaTelangana NewsKcr
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024