పోలింగ్ కేంద్రం వద్ద మెుబైల్ ఫోన్ డిపాజిట్ సదుపాయం.. ఓటర్లు లోపలకు తీసుకెళ్లొద్దు.. ఈసీ కీలక నిర్ణయం

Best Web Hosting Provider In India 2024


పోలింగ్ కేంద్రం వద్ద మెుబైల్ ఫోన్ డిపాజిట్ సదుపాయం.. ఓటర్లు లోపలకు తీసుకెళ్లొద్దు.. ఈసీ కీలక నిర్ణయం

Anand Sai HT Telugu

కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లు మెుబైల్ ఫోన్ డిపాజిట్ చేసేందుకు సదుపాయం కల్పించనుంది.

ఎన్నికల సంఘం (HT file photo)

ఓటర్ల సౌకర్యాన్ని పెంచడానికి, ఓటింగ్ రోజున ఏర్పాట్లను క్రమబద్ధీకరించడానికి కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఓటర్ల మొబైల్ ఫోన్‌లను పోలింగ్ కేంద్రాల వెలుపల డిపాజిట్ చేసే సౌకర్యాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ మేరకు పోలింగ్ కేంద్రాల వద్ద మెుబైల్ ఫోన్ డిపాజిట్ కౌంటర్లను ఏర్పాటు చేయనున్నట్టుగా ఈసీ ప్రకటించింది.

పోలింగ్ కేంద్రాల్లో డిపాజిట్ కౌంటర్లు

ఓటు వేసేందుకు వెళ్లిన ఓటర్లు తమ ఫోన్లను డిపాజిట్ చేసే సదుపాయం లేకపోవడంతో దుస్తుల్లో దాచి పోలింగ్ బూత్ ల్లోకి తీసుకెళ్తున్నారు. వీడియోలు, ఫొటోలు తీస్తున్న ఘటనలు కూడా చాలానే వెలుగులోకి వచ్చాయి. ఓటర్లకు ఉపశమనం కలిగిస్తూ పోలింగ్ కేంద్రాలలో మొబైల్ ఫోన్లను డిపాజిట్ చేయడానికి కౌంటర్లను ఏర్పాటు చేస్తామని ఎన్నికల సంఘం తెలిపింది.

అనధికారిక ఓటరు గుర్తింపు స్లిప్పులు

అంతేకాకుండా ఓటింగ్ నిర్వహణను మరింత హేతుబద్ధంగా చేయడానికి కమిషన్ మరొక చొరవ తీసుకుంది. పోలింగ్ కేంద్రం ప్రవేశ ద్వారం నుండి 100 మీటర్ల దూరంలో అనధికారిక ఓటరు గుర్తింపు స్లిప్పులను పంపిణీ చేయడానికి పార్టీలు, అభ్యర్థులు బూత్‌లను ఏర్పాటు చేసుకోవడానికి కూడా ఈసీ అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటివరకు ఈ పరిమితి 200 మీటర్ల వరకు ఉండేది. పోలింగ్ కేంద్రం పరిధిలో ఓటింగ్ గోప్యత పాటించే ఎన్నికల ప్రవర్తనా నియమావళి-1961లోని రూల్ 49ఎంను కఠినంగా అమలు చేస్తామని ఈసీ స్పష్టం చేసింది.

బీహార్ నుంచి అమలు

ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్ లో ఈ రెండు కీలక సంస్కరణలను మొదట అమలు చేయనున్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ ఫోన్ల వినియోగం పెరగడం, పోలింగ్ రోజున మొబైల్ ఫోన్ల నిర్వహణలో ఓటర్లే కాకుండా సీనియర్ సిటిజన్లు, మహిళలు, వికలాంగులు ఎదుర్కొంటున్న సవాళ్లను గుర్తించిన కమిషన్ పోలింగ్ కేంద్రాల వెలుపల మొబైల్ డిపాజిట్ సదుపాయాన్ని అనుమతించాలని నిర్ణయించింది.

పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో కేవలం మొబైల్ ఫోన్లను మాత్రమే అనుమతిస్తామని, అది కూడా స్విచ్ ఆఫ్ మోడ్ లో అని అధికారులు తెలిపారు. ఓటర్లు తమ మొబైల్ ఫోన్లను డిపాజిట్ చేయడానికి వీలుగా పోలింగ్ కేంద్రం ప్రవేశ ద్వారం వద్ద డిపాజిట్ చేసేందుకు ఏర్పాటు చేయాలి. పోలింగ్ కేంద్రంలోకి మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడానికి వీల్లేదని ఎన్నికల సంఘం తెలిపింది.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link