ఆర్టికల్ 142ను ఉపయోగించి పోక్సో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు; దోషిగా తేలినా శిక్ష విధించలేదు

Best Web Hosting Provider In India 2024


ఆర్టికల్ 142ను ఉపయోగించి పోక్సో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు; దోషిగా తేలినా శిక్ష విధించలేదు

Sudarshan V HT Telugu

పోక్సో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. బాధితురాలు దాన్ని నేరంగా చూడకుండా నిందితుడితో కలిసి జీవిస్తున్నందున శిక్ష విధించకూడదని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ద్వారా లభించిన అధికారాలతో ఈ తీర్పును ఇస్తున్నట్లు తెలిపింది.

పోక్సో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు (HT_PRINT)

లైంగిక వేధింపుల నుంచి చిన్నారులను రక్షించే పోక్సో చట్టానికి సంబంధించిన ఒక కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఈ కేసులోని అసాధారణ పరిస్థితుల దృష్ట్యా పోక్సో చట్టం కింద దోషిగా తేలిన వ్యక్తికి శిక్ష విధించరాదని సుప్రీంకోర్టు నిర్ణయించింది.

దోషిగా తేలినా శిక్ష లేదు..

జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీంకోర్టుకు లభించిన ప్రత్యేక అధికారాలను ఉపయోగించి బాధితురాలికి పూర్తి న్యాయం జరిగేలా తీర్పు వెలువరించింది. నిందితుడు పోక్సో చట్టం కింద దోషిగా తేలినప్పటికీ, బాధితురాలి విషయంలో నెలకొన్న అసాధారణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని దోషికి శిక్ష విధించడం లేదని స్పష్టం చేసింది.

సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

ఈ సందర్భంగా సుప్రీంకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ఘటన అనంతరం, సమాజం ఆమెను జడ్జ్ చేసిందని, న్యాయ వ్యవస్థ విఫలమైందని, సొంత కుటుంబమే ఆమెను వదిలేసిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ప్రస్తుతం మేజర్ గా ఉన్న బాధితురాలు ఈ ఘటనను నేరపూరిత చర్యగా ఏనాడు పరిగణించలేదని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది.

చట్టరీత్యా నేరమే అయినా..

‘‘ఈ ఘటనను చట్టరీత్యా నేరంగా పరిగణించినప్పటికీ బాధితురాలు దాన్ని నేరంగా అంగీకరించలేదు. ఆమెకు బాధ కలిగించింది ఆ చట్టపరమైన నేరం కాదు. ఆ తర్వాత జరిగిన పర్యవసానాలే ఆమెను ఎక్కువగా బాధించాయి. నిందితుడిని శిక్ష నుంచి కాపాడడానికి ఆ యువతి పోలీసులతో, న్యాయ వ్యవస్థతో, సమాజంతో నిరంతరం పోరాడాల్సి వచ్చింది’’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసులో వాస్తవాలు అందరి కళ్లను తెరిపిస్తాయని పేర్కొంది.

కలకత్తా హైకోర్టు వివాదాస్పద వ్యాఖ్యలతో..

ఈ కేసులో 2023 లో నిందితుడిని నిర్దోషిగా ప్రకటిస్తూ కలకత్తా హైకోర్టు తీర్పు ఇచ్చింది. కింది కోర్టు విధించిన 20 ఏళ్ల జైలు శిక్షను కొట్టివేసింది. అయితే, ఆ సందర్భంగా హైకోర్టు పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. కౌమారంలో ఉన్న బాలికలు తమ లైంగిక కోరికలను నియంత్రించుకోవాలని, లేదంటే నష్టపోయేది వారేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆ కామెంట్స్ వైరల్ గా మారాయి. దాంతో, ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరింది.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link