



Best Web Hosting Provider In India 2024
మరో కి‘లేడి’; ప్రియుడితో కలిసి భర్త హత్య; ఏమీ ఎరగనట్లు పీఎస్ లో మిస్సింగ్ కేసు
ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి, సమీపంలోని కాలువలో పడేసింది. ఆ తరువాత ఏమీ తెలియనట్లు తన భర్త కనిపించడం లేదని పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు చేసింది. చివరకు నిజం బయటపడి ప్రస్తుతం ఊచలు లెక్కపెడుతోంది.
ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య ఉదంతం మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఆ తరువాత ఆ ప్రియుడి సహకారంతో రహస్యంగా ఆ మృతదేహాన్ని సమీపంలోని మురుగు కాలువలో పడేసింది. ఈ ఘటన థానేలో చోటు చేసుకుంది.
తాగుడుకు బానిస కావడంతో..
తాగుడుకు బానిసైన భర్తకు ఫుల్ గా మద్యం తాగించి, అనంతరం హత్య చేసి కాలువలో పడేసిన వివాహిత, ఆమె ప్రియుడిని మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. బాధితుడి మృతదేహం కోసం పోలీసులు గాలిస్తున్నారు. భర్తను హత్య చేసిందన్న ఆరోపణలపై పూనమ్ కాళిదాస్ వాఘ్మారే (28)ను, ఆమెకు సహకరించిన ఆరోపణలపై ఆమె ప్రియుడు సురేష్ హరిప్రసాద్ యాదవ్ (24)లను రబాలే మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎంఐడీసీ) పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు కలిసి పూనమ్ భర్త కాళిదాస్ వాఘ్మారే (30)ను హత్య చేసినట్లు, మృతదేహాన్ని కాలువలో పడేసినట్లు దర్యాప్తులో తేలింది.
ఎలా జరిగింది..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిత్యం మద్యం మత్తులో తనను వేధించే భర్త కాళిదాస్ వాఘ్మారేను శాశ్వతంగా వదిలించుకోవాలని పూనమ్ నిర్ణయించుకుంది. అందుకు తన ప్రియుడు సురేష్ హరిప్రసాద్ యాదవ్ సహకారం కోరింది. దీంతో సురేష్ హరిప్రసాద్ యాదవ్ మద్యం తాగుదామని కాళిదాస్ వాఘ్మారే ను బయటకు తీసుకువెళ్లాడు. వారితో పాటు పూనమ్ కూడా వెళ్లింది. అక్కడ కాళిదాస్ వాఘ్మారే కు మద్యం తాగించి, అనంతరం హత్య చేశారు. మృతదేహాన్ని సమీపంలో కాలువలోకి విసిరేశారు. ఆ మృతదేహం వాగు ప్రవాహానికి కొట్టుకుపోయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
మిస్సింగ్ కేసు
తన మీద అనుమానం రాకుండా ఉండడం కోసం, దర్యాప్తును తప్పుదోవ పట్టించడం కోసం పూనమ్ మొదట పోలీస్ స్టేషన్ లో తన భర్త కనిపించడం లేదని మిస్సింగ్ పర్సన్ రిపోర్టును దాఖలు చేసింది. కానీ పోలీసుల విచారణలో ఆమె పొంతన లేని విషయాలు చెప్పడంతో, పోలీసులు అనుమానించారు. లోతుగా విచారించగా ఆమె, ఆమె ప్రియుడు ఇద్దరూ కుట్రను అంగీకరించారు. దాంతొ వారిద్దరినీ అరెస్ట్ చేశారు. నిందితులపై భారతీయ న్యాయ్ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 140(1) (కిడ్నాప్), 3(5) (నేరపూరిత కుట్ర) కింద కేసు నమోదు చేశారు.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link