





Best Web Hosting Provider In India 2024

యోగాసనాలతో మూలాధార చక్రం యాక్టివేట్ చేయాలనుకుంటున్నారా? ఇవి మీ కోసమే!
మన శరీరంలోని ఏడు ప్రధాన చక్రాలలో మొదటిది మూలాధార చక్రం. వెన్నెముక అడుగు భాగంలో ఉండే ఈ చక్రం భూమితో, భద్రతతో, స్థిరత్వంతో ముడిపడి ఉంటుంది. ఈ చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల శారీరక, మానసిక స్థిరత్వం గణనీయంగా పెరుగుతుంది.
మూలాధార చక్రం అనేది మన శరీరంలో ఉన్న ఏడు ప్రధాన చక్రాలలో మొదటిది, ఇది వెన్నెముక అడుగు భాగంలో ఉంటుంది. భూమితో, భద్రతతో, స్థిరత్వంతో ఇది ముడిపడి ఉంటుంది. ఈ చక్రాన్ని క్రియాశీలం చేసుకోవడం ద్వారా శారీరక, మానసిక స్థిరత్వం పెరుగుతుంది. యోగాలోని కొన్ని నిర్దిష్ట ఆసనాలు ఈ చక్రాన్ని యాక్టివేట్ చేయడానికి అద్భుతంగా పనిచేస్తాయి.
శరీరంలో మొదటి చక్రమైన మూలాధార చక్రాన్ని ఏ ఆసనాలతో యాక్టివేట్ చేయాలో తెలుసుకోండి!
మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేసే ముఖ్యమైన యోగా ఆసనాలు:
తాడాసనం:
అన్ని ఆసనాలకు పునాదియైన తాడాసనం వేయడం వల్ల స్థిరత్వాన్ని మెరుగుపరిచి, నిలకడగా ఉంచుతుంది..
ఎలా చేయాలి: పాదాలను భూమికి గట్టిగా ఆనించి నిటారుగా నిలబడండి. మీ శరీరం భూమితో ఎలా అనుసంధానం అయి ఉందో గమనిస్తూ, శ్వాసపై దృష్టి పెట్టండి.
వృక్షాసనం:
ఈ ఆసనం సమతుల్యతను పెంచుతుంది. మూలాధారానికి సంబంధించిన స్థిరత్వాన్ని ప్రోత్సహిస్తుంది.
ఎలా చేయాలి: ఒక కాలిపై నిలబడి, రెండో కాలును తొడ లోపలి భాగంలో ఉంచి, చేతులను నమస్కార ముద్రలో ఉండండి.
వీరభద్రాసనం 2:
ఈ భంగిమ కాళ్ళకు, తుంటికి బలాన్ని ఇస్తుంది, స్థిరత్వాన్ని పెంచుతుంది. భూమికి మరింతగా అనుసంధానం అవ్వడానికి సహాయపడుతుంది.
మాలాసనం:
ఈ ఆసనం తుంటి ప్రాంతాన్ని తెరుస్తుంది. ఇది మూలాధార చక్రానికి సంబంధించిన ప్రాంతం. ఇది గ్రౌండింగ్‌కు చాలా మంచిది.
ఎలా చేయాలి: పాదాలను భూమిపై ఉంచి, పాదాల మధ్య తగినంత దూరం ఉంచుతూ, తుంటిని కిందికి దించి కూర్చుంటారు.
బాలాసనం :
ఇది విశ్రాంతిని ఇచ్చి, సురక్షితమైన అనుభూతిని కలిగిస్తుంది. భూమితో అనుసంధానానికి సహాయపడుతుంది.
ఎలా చేయాలి: మోకాళ్ళపై కూర్చుని, శరీరాన్ని ముందుకు వంచి, నుదుటిని నేలకు ఆనించి, చేతులను ముందుకు లేదా వెనుకకు చాపి ఉంచండి.
బద్ధ కోణాసనం :
ఈ భంగిమ తుంటిని తెరుస్తుంది. పెల్విక్ ప్రాంతంలో రక్త ప్రసరణను పెంచుతుంది. ఇది మూలాధారానికి చాలా మంచిది.
ఎలా చేయాలి: కాళ్ళను మడిచి, పాదాలను ఒకదానికొకటి తాకించి, మోకాళ్ళను పక్కలకు ఉంచాలి.
యోగా ఆసనాలను చేస్తున్నప్పుడు ప్రశాంతంగా, లోతుగా శ్వాస తీసుకోవడం, వదలడంపై దృష్టి పెట్టండి. మీ శ్వాస మీ శరీరం భూమితో అనుసంధానం కావడానికి సహాయపడుతుంది. ఆసనాలను పూర్తిగా స్థిరంగా, సౌకర్యవంతంగా చేయండి. మీ శరీరాన్ని బలవంతం చేయవద్దు. ఈ ఆసనాలను క్రమం తప్పకుండా అభ్యసించడం ద్వారా మూలాధార చక్రాన్ని సమతుల్యం చేసుకోవచ్చు. శారీరక, మానసిక స్థిరత్వాన్ని పెంచుకోవచ్చు.
మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేయడం వల్ల శారీరక, మానసిక స్థిరత్వం పెరుగుతుంది. ఇది భద్రతా భావాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. రోగనిరోధక శక్తి, శక్తి స్థాయిలు మెరుగుపడి, జీవితంలో నిలకడగా ఉండేందుకు సహాయపడుతుంది. భయాలు తగ్గి, ఆర్థిక స్థిరత్వం కూడా మెరుగుపడవచ్చు. అన్నింటికీ మించి, ఇది మన ఆధ్యాత్మిక ప్రయాణానికి బలమైన పునాదిగా నిలుస్తుంది. యోగాసనం వేయడం ఇప్పుడే ప్రారంభిస్తుంటే అనుభవం ఉన్న వారిని లేదా నిపుణుల సలహా తీసుకుని ఆరంభించడం ఉత్తమం.