నిన్ను కోరి మే 24 ఎపిసోడ్: విరాట్‌ను దెబ్బకు దెబ్బ తీసిన చంద్రకళ- శృతి ఒంటిపై వేడి నీళ్లు- చంద్రను తిట్టిన జగదీశ్వరి

Best Web Hosting Provider In India 2024

నిన్ను కోరి మే 24 ఎపిసోడ్: విరాట్‌ను దెబ్బకు దెబ్బ తీసిన చంద్రకళ- శృతి ఒంటిపై వేడి నీళ్లు- చంద్రను తిట్టిన జగదీశ్వరి

Sanjiv Kumar HT Telugu

నిన్ను కోరి సీరియల్ మే 24 ఎపిసోడ్‌లో విరాట్‌కు ఆచారం పేరుతో తనను ఎత్తుకుని గర్భగుడి చుట్టూ 108 ప్రదక్షిణలు చేయాలని చంద్రకళ చెబుతుంది. అలా చేసిన విరాట్ నడుము నొప్పితో బాధపడుతుంటాడు. వేడి నీళ్లు తీసుకొస్తున్న శృతికి చంద్ర కాలు అడ్డం పెట్టడంతో కిందపడిపోతుంది. భర్త గదిలోకి వచ్చిన చంద్రను అత్త తిడుతుంది.

నిన్ను కోరి సీరియల్ మే 24 ఎపిసోడ్‌

నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో గుడికి చంద్రకళ, విరాట్ వెళ్తారు. ఆచారం అని చెప్పి చంద్రకళను చెప్పులు లేకుండా నడిచేలా చేస్తాడు విరాట్. దాంతో చంద్రకళ చెప్పులు విడిచేసి రోడ్డు మీద టెంపుల్ వరకు నడుచుకుంటూ వస్తుంది. అది చూసిన విరాట్ సంతోషంగా ఫీల్ అవుతాడు.

ఆచారం గురించి చెప్పి

ఇంతలో ఫోన్ కాల్ రావడంతో విరాట్ పక్కకు వెళ్లిపోతాడు. చంద్రకళ దగ్గరికి వచ్చిన పంతులు లేట్ ఎందుకయిందని అడుగుతాడు. దాంతో విరాట్ చెప్పిన ఆచారం గురించి చెబుతుంది చంద్రకళ. అలాంటి ఆచారాలు ఏం లేవని పంతులు అనడంతో కావాలనే బావ నాతో నడిపించాడని చంద్రకళ అనుకుంటుంది. గర్భగుడి దగ్గరికి మొక్కుకుంటూ చంద్రకళ వెళ్తుంది.

అది విరాట్ చూస్తాడు. ఏం కోరుకున్నావ్. అంతల మొక్కుకుంటున్నావ్ అని చంద్రకళను విరాట్ అడుగుతాడు. బావ నువ్వు బిజినెస్‌లో పైకి రావడానికి మొక్కు మొక్కుకున్నాను. అలా జరగాలంటే నువ్వు నన్ను ఎత్తుకుని 108 ప్రదక్షిణలు గుడి చుట్టూ చేయాలని పంతులు గారు చెప్పారు. అలాగే, కొత్తగా పెళ్లయిన జంట మొదటిసారి గుడికి వచ్చినప్పుడు భార్యను ఎత్తుకుని గర్భగుడి చుట్టూ 108 ప్రదక్షిణిలు చేయడం మన ఇంటి ఆచారంలో భాగమేనట అని విరాట్‌తో చంద్రకళ అంటుంది.

విరాట్ 108 ప్రదక్షిణలు

అనుమానం వచ్చిన విరాట్ పంతులును అడుగుతాడు. చంద్రకళ చెప్పింది నిజమే అని, మనసులో కోరింది నెరవేరాలంటే ఎవరు కోరుకున్నారో వారిని ఎత్తుకుని 108 ప్రదక్షిణలు చేయాలి అని పంతులు చెబుతాడు. దాంతో చంద్రకళను ఎత్తుకుని విరాట్ 108 ప్రదక్షిణలు చేస్తాడు. విరాట్ ఎత్తుకుని ప్రదక్షిణలు చేస్తుంటే చంద్రకళ మాత్రం రొమాంటిక్‌గా చూస్తుంది.

ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత నడుము పట్టుకుని విరాట్ కూర్చొంటాడు. అలసిపోయిన విరాట్ దగ్గరికి చంద్రకళ వస్తుంది. ఏంటీ బావా బాగా అలసిపోయావా అని వెటకారంగా మాట్లాడుతుంది చంద్రకళ. నీ మొక్కు కోసం ఎత్తుకుని ఇంతలా చేస్తే వెటకారంగా మాట్లాడుతావా అని విరాట్ కోప్పడుతాడు. ఆదితో నువ్వు మాట్లాడటం నేను విన్నాను. నన్నే అంత దూరం నడిపించావ్ కదా. ఇది నీకు టిట్ ఫర్ టాట్.. అంటే దెబ్బకు దెబ్బ అని చంద్రకళ చెబుతుంది.

మొక్కు పేరుతో

ఆచారం పేరుతో విరాట్ చేసినదానికి మొక్కు, కొత్త పెళ్లి జంట ఆచారం పేరుతో ప్రదక్షిణలు చేయించి దెబ్బకు దెబ్బ తీస్తుంది చంద్రకళ. ఇక గుడి నుంచి ఇంటికి వెళ్తారు చంద్రకళ, విరాట్. ప్రదక్షిణలు చేసి అలసిపోయానని, వేడి నీళ్లు పెట్టమని విరాట్ అంటాడు. అది విన్న శృతి వేడి నీళ్లు విరాట్ కోసం తీసుకొస్తుంది. అలా శృతి తీసుకొస్తుండగా.. చంద్రకళ కావాలనే కాలు అడ్డుపెడుతుంది. అది తగిలి శృతి కిందపడిపోతుంది. అంతేకాకుండా వేడి నీళ్లు శృతి ఒంటి మీద పడతాయి.

దాంతో శృతి వేడి అంటూ అరుస్తుంది. చేయిపై పడిన వేడి నీళ్లను ఊదుకుంటుంది. నొప్పితో బాధపడుతున్న శృతి దగ్గరికి వెళ్లిన చంద్రకళ నా భర్తకు నేను సపర్యలు చేసుకుంటాను. నువ్వు వెళ్లు అని చెబుతుంది. దాంతో ఏడుస్తూ శృతి వెళ్లిపోతుంది. తర్వాత విరాట్‌కు కాపడం పెడుతుంది చంద్రకళ. ఇద్దరు కౌంటర్స్ వేసుకోవడం, సరదాగా మాట్లాడుకోవడం జరుగుతుంది.

చంద్రకళను తిట్టిన జగదీశ్వరి

అనంతరం రఘురాం గదిలో ఫ్యాన్ వేయడానికి చంద్రకళ వెళ్తుంది. అది చూసిన జగదీశ్వరి ఆయన గదిలోకి ఎందుకు వచ్చావ్. మీ వల్లే ఆయనకు ఈ గతి పట్టింది. చేసిందంతా చేసి మళ్లీ సేవలు చేయడానికి వచ్చావా అని చంద్రకళను తిడుతుంది జగదీశ్వరి. పక్కనే ఉన్న కామాక్షి, శాలిని, శృతిలు చంద్రకళ గురించి లేనిపోనివి చెప్పి జగదీశ్వరిని మరింత రెచ్చగొడతారు.

దాంతో చంద్రకళను మరింతగా తిడుతుంది జగదీశ్వరి. అత్త తిట్టడంతో చంద్రకళ బాధపడుతుంది. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024