ప్రజాపాలనలో రేషన్ కార్డుకు అప్లయ్ చేశారా…? వెరిఫికేషన్ ప్రాసెస్ ఇలా ఉంటుంది..!

Best Web Hosting Provider In India 2024

ప్రజాపాలనలో రేషన్ కార్డుకు అప్లయ్ చేశారా…? వెరిఫికేషన్ ప్రాసెస్ ఇలా ఉంటుంది..!

Maheshwaram Mahendra Chary HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Maheshwaram Mahendra Chary HT Telugu

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతోంది. ఓవైపు దరఖాస్తుల పరిశీలన కొనసాగుతుండగా… మరోవైపు అఫ్రూవ్ అయిన వారికి కార్డులను మంజూరు చేస్తున్నారు. అయితే చాలా మంది ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్నారు. భారీ సంఖ్యలోనే అప్లికేషన్లు వచ్చాయి. వీటి ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇక్కడ తెలుసుకోండి

ప్రజాపాలన రేషన్ కార్డు దరఖాస్తులు

తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు మంజూరవుతున్నాయి. ప్రజాపాలన కార్యక్రమంలో వచ్చిన అప్లికేషన్లే కాదు…. పాటు మీసేవా ద్వారా కూడా భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. స్వీకరించిన దరఖాస్తులను పరిశీలిస్తున్న అధికారులు…. అర్హతలు కలిగి ఉంటే అఫ్రూవ్ చేస్తున్నారు. వీరికి మాత్రమే కొత్త కార్డులను జారీ చేస్తున్నారు. ఇప్పటికే పలువురికి కొత్త కార్డులు మంజూరు కాగా… మరికొందరి పేర్లను పాత కార్డుల్లోకి ఎంట్రీ కూడా చేస్తున్నారు.

ప్రజాపాలనలో భారీగా దరఖాస్తులు…

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రాజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆరు గ్యారెంటీల అమలు కోసం దరఖాస్తులను స్వీకరించింది. ఇదే సమయంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటనలు కూడా చేసింది. దీంతో భారీ సంఖ్యలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. తెల్ల కాగితంపై రాసి గ్రామ, వార్డు ఆఫీసుల్లో సమర్పించారు. ఇదంతా కూడా ఆఫ్ లైన్ ద్వారా సాగింది.

ప్రజాపాలన ద్వారా భారీగా దరఖాస్తులు రావటంతో… వాటిని పరిశీలించటం క్షేత్రస్థాయిలోని అధికారులు, సిబ్బందికి కాస్త ఇబ్బందికరంగానే మారింది. అయితే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారు రేషన్ కార్డుల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. అర్హతలు ఉన్న ప్రతి ఒక్కరికి కార్డు మంజూరవుతుందని స్పష్టం చేస్తున్నారు.

వెరిఫికేషన్ ప్రాసెస్ ఇలా….

  • ప్రజాపాలన కార్యక్రమం ద్వారా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీసుల్లో రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను స్వీకరించారు.
  • ప్రజాపాలనలో స్వీకరించిన రేషన్ కార్డు దరఖాస్తులను ప్రత్యేకమైన యాప్ ద్వారా ఆన్ లైన్ చేస్తున్నారు.
  • ప్రజాపాలనలో స్వీకరించిన రేషన్ కార్డుల ప్రాసెస్ లో రెవెన్యూ అధికారులు, సిబ్బంది కీలకంగా వ్యవహరిస్తున్నారు.
  • ఇప్పటికే అన్ని జిల్లాల్లో ప్రజాపాలన రేషన్ కార్డు దరఖాస్తుల ప్రాసెస్ వేగంగా కొనసాగుతోంది.
  • యాప్ ద్వారా ఎంట్రీ చేసిన దరఖాస్తులపై రెవెన్యూ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో సర్వే చేస్తున్నారు.
  • క్షేత్రస్థాయి విచారణ తర్వాత మండల స్థాయిలో ఎమ్మార్వో లాగిన్ చేరుతుంది.
  • ఎమ్మార్వో ఆమోదం తెలిపిన తర్వాత…. జిల్లా పౌరసరఫరాల అధికారి లాగిన్‌కు చేరుతుంది.
  • జిల్లా కలెక్టర్‌ ఆమోదంతో కార్డులు మంజూరు చేసి ప్రభుత్వానికి నివేదిక అందిస్తారు. ఇప్పటికప్పుడు ఈ ప్రక్రియ జరుగుతోంది.
  • అఫ్రూవ్ అయిన వారికి తదుపరి నెలలో రేషన్‌ దుకాణాల ద్వారా బియ్యం కేటాయిస్తున్నారు.
  • ఈ ప్రక్రియలో ఏమైనా సమాచారం తెలుసుకోవాలనుకునే వారు స్థానికంగా ఉండే మండల రెవెన్యూ అధికారులను సంప్రదిస్తే మీ దరఖాస్తు ఏ స్థితిలో ఉందనేది తెలుస్తుంది.

ఆన్ లైన్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు:

కొత్త రేషన్ కార్డు పొందినవాళ్లు లేదా పాత కార్డులో పేర్లు నమోదైన వారు… వారి వివరాలను ఆన్ లైన్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ముందుగా https://epds.telangana.gov.in/FoodSecurityAct/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఎఫ్ఎస్ సీ సెర్చ్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ రేషన్ కార్డు సెర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపై క్లిక్ చేస్తే FSC సెర్చ్ అనే ఆప్షన్ డిస్ ప్లే అవుతుంది. దీనిపై క్లిక్ చేసి FSC Ref No నెంబర్ లేదా మీ రేషన్ కార్డు నెంబర్ ను ఎంట్రీ చేసి జిల్లాను ఎంచుకోవాల్లి. చివర్లో ఉండే సెర్చ్ పై క్లిక్ చేస్తే మీ కార్డు వివరాలను కింద డిస్ ప్లే అవుతాయి.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

టాపిక్

Telangana NewsRation CardsPraja PalanaPraja Palana ApplicationsGovernment Of Telangana
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024