





Best Web Hosting Provider In India 2024

యూట్యూబ్‌లో ఫ్రీగా తెలుగు బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్- పూనమ్ కౌర్ శృంగార సీన్లు- 7.5 రేటింగ్- ఓటీటీలో అలా!
ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న తెలుగు బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ యూట్యూబ్‌లో ఫ్రీగా అందుబాటులో ఉంది. టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ మెయిన్ లీడ్ రోల్ చేసిన ఈ సినిమాకు ఐఎమ్‌డీబీ నుంచి 7.5 రేటింగ్ వచ్చింది. ఓటీటీతోపాటు యూట్యూబ్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమా ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఓటీటీలో కుప్పలుతెప్పలుగా విభిన్న కంటెంట్‌తో సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుంటాయి. అయితే, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో సినిమాలు చూడాలంటే వాటిని సబ్‌స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెల, లేదా త్రైమాసికం, లేదా వార్షిక వారీలుగా సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే అందులోని కంటెంట్‌ను చూడొచ్చు.
రెంటల్ విధానంలో
ఇక మరికొన్ని సినిమాలను అయితే, సబ్‌స్క్రిప్షన్ ఉన్నప్పటికీ రెంటల్ విధానంలో చూడాల్సి వస్తుంది. అలాంటి సినిమానే నాతిచరామి. కన్నడలో మంచి హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా నాతిచరామి. కన్నడలో ఈ సినిమాకు ఐఎమ్‌డీబీ నుంచి 7.2 రేటింగ్ వచ్చింది. అంతేకాకుండా పలువురు విమర్శకులు సైతం నాతి చరామి మూవీని ప్రశంసించారు.
సబ్‌స్క్రిప్షన్ ఉన్నప్పటికీ కూడా
అలాంటి నాతిచరామి ఓటీటీలో రెంటల్ విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. అంటే, సబ్‌స్క్రిప్షన్ ఉన్నప్పటికీ అద్దె విధానంలో అందుబాటులో ఉంది. అమెజాన్ ప్రైమ్‌లో కన్నడ భాషలో రెంటల్ పద్ధతిలో నాతిచరామి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతుంటే.. దీని తెలుగు వెర్షన్ మాత్రం యూట్యూబ్‌లో ఉచితంగా అందుబాటులో ఉంది.
ఐఎమ్‌డీబీ నుంచి 7.5 రేటింగ్
2018లో వచ్చిన కన్నడ మూవీ నాతిచరామికి 2022లో అదే టైటిల్‌తో తెలుగులో రీమేక్ చేశారు. కన్నడ కంటే తెలుగులో మరింతగా క్రేజ్ తెచ్చుకుంది నాతిచరామి సినిమా. దీంతో అలాగే, ఐఎమ్‌డీబీ రేటింగ్‌లో కూడా కన్నడ కంటే తెలుగులో ఎక్కువ ఉండటం విశేషం. నాతిచరామి తెలుగు వెర్షన్‌కు ఐఎమ్‌డీబీ నుంచి 7.5 రేటింగ్ వచ్చింది.
బోల్డ్, క్రైమ్ ఎలిమెంట్స్
నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన నాతిచరామి మూవీకి నాగు గవర దర్శకత్వం వహించారు. టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్, అరవింద్ కృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. వీరిద్దరు భార్యాభర్తలుగా నటించారు. అయితే, నాతిచరామి బోల్డ్, క్రైమ్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కింది. పూనమ్ కౌర్ శృంగార సీన్లు, బోల్డ్ షోతో నాతిచరామి రూపొందింది.
భార్యాభర్తల మధ్య గొడవలు
నాతిచరామి కథ విషయానికొస్తే.. ఇద్దరు భార్యాభర్తలు ప్రేమగా, రొమాంటిక్‌గా, అన్యూన్యంగా కాలం గడుపుతుంటారు. భార్య అందంపై పరాయి వ్యక్తుల కన్ను పడుతుంది. కట్ చేస్తే.. ఈ భార్యాభర్తల మధ్య గొడవలు స్టార్ట్ అవుతాయి. భార్యపై భర్తకు అనుమానం కలుగుతుంది. దాంతో భార్యను దూరం పెడతాడు. ఇంటికి ఏమాత్రం రాడు.
రియలిస్టిక్ అంశాలతో
మరోవైపు పోలీసులకు మూడు ముక్కలుగా ఓ మృతదేహం దొరుకుతుంది. భర్తనే మూడు ముక్కలుగా నరికి భార్య హత్య చేసిందని పోలీసులు భావిస్తారు. ఆ తర్వాత ఏమైంది?, భర్త ఏమైపోయాడు? అసలు భార్యాభర్తల మధ్య గొడవలకు కారణం ఏంటీ? ఆ శవం ఎవరిది? అనే రియలిస్టిక్ అంశాలతో నాతిచరామి తెరకెక్కింది. మరి ఈ సినిమాను యూట్యూబ్‌లో ఫ్రీగా చూసేయండి.
సంబంధిత కథనం