8వ వేతన సంఘం​తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల బేసిక్​ పే 186శాతం పెరగనుందా?

Best Web Hosting Provider In India 2024


8వ వేతన సంఘం​తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల బేసిక్​ పే 186శాతం పెరగనుందా?

Sharath Chitturi HT Telugu

8వ వేతన సంఘం సిఫార్సుల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి ఫిట్​మెంట్​ ఫ్యాక్టర్​ 2.86x వరకు పెరగొచ్చని వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే! ఉద్యోగుల బేసిక్​ పే 186శాతం పెరిగే అవకాశం ఉంది. ఎలా అంటే..

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం 186శాతం అప్​!

8వ పే కమీషన్​ అప్డేట్స్​పై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఉద్యోగుల జీతాలు, రిటైర్​ అయిన వారి పెన్షన్​ని సవరించేందుకు 8వ వేతన సంఘం కమిటీ తర్వలోనే ఏర్పడనుంది. అయితే, జీతాలు, పెన్షన్​ల విషయంలో కీలకమైన ఫిట్​మెంట్​ ఫ్యాక్టర్​పై సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి. ఈ ఫిట్​మెంట్​ ఫ్యాక్టర్​ ఈసారి 2.86x వరకు పెరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే.. ఉద్యోగుల బేసిక్​ పే 186శాతం పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

8వ వేతన సంఘం- ఫిట్​మెంట్​ ఫ్యాక్టర్​ అంటే ఏంటి? ఎలా నిర్ణయిస్తారు?

ప్రభుత్వ ఉద్యోగుల శాలరీ, పెన్షన్​ని లెక్కించేందుకు ఉపయోగించేదే ఈ ఫిట్​మెంట్​ ఫ్యాక్టర్​. ద్రవ్యోల్బణం, ఉద్యోగుల అవసరాలు, ప్రభుత్వ ఆర్థిక సామర్థ్యం వంటి వాటిని పరిగణలోకి తీసుకుని 8వ వేతన సంఘం సిఫార్సుల్లో దీనిని నిర్ణయిస్తారు.

గత వేతన సంఘాల్లో ఫిట్​మెంట్​ ఫ్యాక్టర్​ ఎలా ఉంది?

ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి 10ఏళ్లకు ఒకసారి వేతన సంఘాలు జీతాలు పెంచుతుంటాయి. 2006లో 6వ పే కమిషన్​, 2016లో 7వ పే కమిషన్​లు ఏర్పడ్డాయి. వాటి ద్వారా బేసిక్​ పే, అలొవెన్స్​లు గణనీయంగా పెరిగాయి. 6వ పేకమిషన్​లో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మినిమమ్​ బేసిక్​ శాలరీ రూ. 2,750 నుంచి రూ. 7000కు, 7వ వేతన సంఘం వల్ల రూ. 7వేల నుంచి రూ. 18వేలకు పెరిగాయి.

ఈసారి ఫిట్​మెంట్​ ఫ్యాక్టర్​ ఎంత ఉండొచ్చు? జీతాలు ఎంత పెరగొచ్చు?

8వ పే కమీషన్​లో ఫిట్​మెంట్​ ఫ్యాక్టర్​పై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఈసారి ఫిట్​మెంట్​ ఫ్యాక్టర్​ 2.6 నుంచి 2.86 మధ్యలో ఉండొచ్చను ఊహాగానాలు బయటకు వచ్చాయి. ఇదే జరిగితే.. ప్రభుత్వ ఉద్యోగుల కనీస బేసిక్​ శాలరీ మూడు రెట్లు పెరగొచ్చు!

ఉదాహరణకు బేసిక్​ పే (నెలకు) రూ. 18000 ఉంటే, ఫిట్​మెంట్​ ఫ్యాక్టర్​ 2.86గా ఉంటే. సవరించిన బేసిక్​ పే రూ. 51,480 అవుతుంది! (18,000x 2.86)

అదే విధంగా బేసిక్​ పే రూ. 20వేలు ఉంటే.. సరించిన బేసిక్​ పే రూ. 57,200 (రూ. 20000×2.86) అవుతుంది.

ఇది 186శాతం వృద్ధి! ఫలితంగా 8వ వేతన సంఘం ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల టేక్​ హోం శాలరీ గణనీయంగా పెరుగుతుంది.

2025 జనవరిలో 8వ పే కమిషన్​ని ప్రభుత్వ అధికారికంగా ప్రకటించింది. ఈ కమిటీ.. తన సిఫార్సులను వచ్చే ఏడాది తొలినాళ్లల్లో ప్రభుత్వానికి అందించే అవకాశం ఉంది. 2026 జనవరి 1 నాటికి ఈ 8వ పే కమిషన్​ సిఫార్సులు అమల్లోకి రావాల్సి ఉంది. దీని ద్వారా 50 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షలు పింఛనుదారులు లబ్దిపొందనున్నారు.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link